Dasara Business: దసరాకు సంచలన బిజినెస్.. చరిత్ర సృష్టించిన నాని.. అన్ని కోట్లు వస్తేనే మూవీ హిట్

స్వయంకృషితో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. సహజ సిద్ధమైన నటనతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుని స్టార్‌గా ఎదిగాడు నేచురల్ స్టార్ నాని. విలక్షణమైన నటనతో పాటు విభిన్నమైన సినిమాలను చేస్తూ ఎన్నో విజయాలను దక్కించుకున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ టాలెంటెడ్ హీరో 'దసరా' అనే పాన్ ఇండియా సినిమాతో రాబోతున్నాడు. విడుదలకు ముందే భారీ అంచనాలను ఏర్పరచుకున్న ఈ చిత్రానికి మంచి డిమాండ్ ఏర్పడడంతో రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగింది. మరి ఇది ఎంత మేర వ్యాపారం చేసుకుందో చూద్దాం పదండి!

దసరా అంటూ వస్తున్న నాని

దసరా అంటూ వస్తున్న నాని

నేచురల్ స్టార్ నాని హీరోగా.. శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన మాస్ మసాలా చిత్రమే 'దసరా'. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించింది. దీన్ని ఎస్‌ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. సంతోష్ నారాయనణ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ సినిమాలో దీక్షిత్ శెట్టి, సముద్రఖని, సాయి కుమార్, పూర్ణ తదితరులు కీలక పాత్రలను పోషించారు.

మాస్ కథతో.. పాన్ ఇండియా

మాస్ కథతో.. పాన్ ఇండియా

సింగరేణి బొగ్గు గనుల్లో పని చేసుకునే ఓ సాధారణ వ్యక్తి.. అమ్మాయి విషయంలో తలెత్తిన గొడవల వల్ల అంగ బలం, అర్థిక బలం, రాజకీయ పలుకుబడి ఉన్న విలన్ గ్యాంగ్‌ను ఎదుర్కొనే అంశాలతో 'దసరా' మూవీ తెరకెక్కినట్లు తెలిసింది. పక్కా మాస్ మసాలా కథతో రాబోతున్న ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో విడుదల కాబోతుంది.

గ్రాండ్‌గా రిలీజ్.. ప్రమోషన్స్

గ్రాండ్‌గా రిలీజ్.. ప్రమోషన్స్

పక్కా మాస్ మసాలా స్టోరీతో రాబోతున్న 'దసరా' మూవీని శ్రీరామనవమి కానుకగా మార్చి 30వ తేదీన ఎంతో గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ అన్ని రాష్ట్రాల్లో ప్రమోషన్స్ చేస్తోంది. మరోవైపు, ఓవర్సీస్ సహా ఎన్నో ప్రాంతాల్లో టికెట్లు బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. అన్ని ఏరియాల్లోనూ దీనికి అదిరిపోయే స్పందన వస్తోంది.

అన్ని భాషల్లో భారీ డిమాండ్

అన్ని భాషల్లో భారీ డిమాండ్

క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'దసరా' మూవీపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీని నుంచి ఏది విడుదలైనా మంచి రెస్పాన్స్ దక్కుతూ వచ్చింది. దీంతో ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. అందుకు అనుగుణంగానే అన్ని ఏరియాల రైట్స్ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయని ట్రేడ్ వర్గాల తెలిపాయి.

ఆంధ్రా, తెలంగాణ బిజినెస్

ఆంధ్రా, తెలంగాణ బిజినెస్

'దసరా' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో భారీ బిజినెస్ జరిగింది. ట్రేడ్ లెక్కల ప్రకారం.. నైజాంలో రూ. 13.70 కోట్లు, సీడెడ్‌లో రూ. 6.50 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 3.90 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.35 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 2 కోట్లు, గుంటూరులో రూ. 3.00 కోట్లు, కృష్ణాలో రూ. 2.00 కోట్లు, నెల్లూరులో రూ. 1.20 కోట్లతో.. రెండు రాష్ట్రాల్లో కలిసి రూ. 34.65 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే

నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన 'దసరా' మూవీకి దేశ వ్యాప్తంగా కూడా మంచి డిమాండ్ వచ్చింది. దీంతో ఈ సినిమా కర్నాటక హక్కులు రూ. 2.85 కోట్లకు, మిగిలిన భాషలకు రూ. 1.50 కోట్లకు, నార్త్ ఇండియా రూ. 5.00 కోట్లు, ఓవర్సీస్ హక్కులు రూ. 6.00 కోట్లకు అమ్ముడుపోయాయి. దీంతో ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 50.00 కోట్లు వ్యాపారం జరిగింది.

అన్ని కోట్ల టార్గెట్.. నాని రికార్డ్

అన్ని కోట్ల టార్గెట్.. నాని రికార్డ్

'దసరా' సినిమాకు రూ. 50 కోట్లు బిజినెస్ జరిగింది. దీంతో రూ. 51 కోట్లు షేర్ వసూలు అయితేనే ఇది హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది. ఇదిలా ఉండగా.. ఈ మూవీ నాని కెరీర్‌లోనే అత్యధిక బిజినెస్‌ను జరుపుకుంది. గతంలో 'అంటే.. సుందరానికీ' రూ. 30 కోట్లు, 'ఎంసీఏ' రూ. 30 కోట్లు అత్యధికంగా ఉండేవి. దీంతో ఈ చిత్రం సంచలనం సృష్టించిందనే చెప్పాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X