DASARA: నాని మరో సంచలనం.. అన్ని వేల థియేటర్లలో దసరా.. మహేశ్, పవన్, ఎన్టీఆర్ రికార్డులు బ్రేక్
సహజసిద్ధమైన నటనతో నేచురల్ స్టార్ అనిపించుకుని.. దాదాపు పదిహేనేళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తనదైన చిత్రాలతో సందడి చేస్తోన్నాడు నేచురల్ స్టార్ నాని. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు మజాను పంచుతోన్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ టాలెంటెడ్ హీరో 'దసరా' అనే చిత్రంతో రాబోతున్నాడు. పాన్ ఇండియా రేంజ్‌లో వస్తున్న ఈ మూవీపై అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దసరా థియేటర్ల లెక్కలు చూద్దాం పదండి!

మాస్ మసాలా మూవీగా దసరా
టాలెంటెడ్ గాయ్ నాని హీరోగా.. శ్రీకాంత్ ఓదెల రూపొందించిన మాస్ మసాలా మూవీనే 'దసరా'. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించింది. దీన్ని ఎస్‌ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. సంతోష్ నారాయనణ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ సినిమాలో దీక్షిత్ శెట్టి, సముద్రఖని, సాయి కుమార్, పూర్ణ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

భారీ అంచనాలతో వస్తుందిగా
'దసరా' మూవీపై ఆరంభం నుంచే ఓ రేంజ్‌లో అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీని నుంచి ఏది వచ్చినా భారీ రెస్పాన్స్‌ను అందుకుంది. దీంతో ఈ సినిమా పేరిట ఎన్నో రికార్డులు సైతం క్రియేట్ అయిపోయాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని ఎంతో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను ఐదు భాషల్లో ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు.

నాని కెరీర్‌లో టాప్ బిజినెస్‌తో
నేచురల్ స్టార్ నాని నటించిన 'దసరా' మూవీ అందరి దృష్టినీ ఆకర్షించింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ. 34.65 కోట్లు బిజినెస్ చేసుకుంది. అలాగే, మిగిలిన ప్రాంతాల రైట్స్ కలిపి రూ. 48.00 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇది నాని కెరీర్‌లోనే టాప్ బిజినెస్ కావడం విశేషం.

దసరా మూవీ థియేటర్ల కౌంట్
భారీ రేంజ్‌లో వస్తున్న 'దసరా' మూవీ తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక థియేటర్లలోనే విడుదల కాబోతుంది. తాజా సమాచారం ప్రకారం.. నైజాంలో 290, సీడెడ్‌లో 190 థియేటర్లలో రాబోతుంది. అలాగే, ఆంధ్రాలోని అన్ని ప్రాంతాల్లో కలిపి 410 థియేటర్లలో ప్రదర్శితం అవనుంది. అంటే.. ఏపీ, తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో కలిపి ఈ సినిమా 900కి పైగా థియేటర్లలో రిలీజ్ కాబోతుంది.

మిగిలిన భాషల్లో థియేటర్లిలా
'దసరా' మూవీని పాన్ ఇండియా రేంజ్‌లో తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేస్తున్నారు. ఇక, దీన్ని తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 900 థియేటర్లలో, తమిళనాడులో 80, కర్నాటకలో 80, కేరళలో 100, హిందీ ప్లస్ రెస్టాప్ ఇండియాలో 750, ఓవర్సీస్‌లో 800 థియేటర్లలో తీసుకు వస్తున్నారు. మొత్తంగా 2710 థియేటర్లలో రాబోతుంది.

నాని ఫస్ట్.. ఓవరాల్‌గా పదిలో
ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'దసరా' మూవీ ప్రపంచ వ్యాప్తంగా 2710కి పైగా థియేటర్లలో విడుదల కాబోతుంది. దీంతో నేచురల్ స్టార్ నాని కెరీర్‌లోనే అత్యధిక థియేటర్లలో విడుదల అవుతోన్న చిత్రంగా ఇది రికార్డు క్రియేట్ చేసింది. అదే సమయంలో ఎక్కువ థియేటర్లలో రాబోతున్న తెలుగు చిత్రాల జాబితాలో 'దసరా' ఏకంగా పదో స్థానానికి చేరుకుని సత్తా చాటబోతుంది.

ఆ స్టార్ హీరోల రికార్డులు బ్రేక్
'దసరా' మూవీ ప్రపంచ వ్యాప్తంగా 2710కి పైగా థియేటర్లలో విడుదల కాబోతుందని ముందు చెప్పుకున్నాం. దీంతో పవన్ నటించిన 'సర్దార్ గబ్బర్ సింగ్' (2600 థియేటర్లు), మహేశ్ 'స్పైడర్' (2400 థియేటర్లు), ఎన్టీఆర్ 'ఆరవింద సమేత' (2300 థియేటర్లు) రికార్డులను ఈ సినిమా దాటేసింది. దీంతో నాని చిత్రానికి అదిరిపోయే ఓపెనింగ్స్ వచ్చే చాన్స్ ఉంది.


Click it and Unblock the Notifications











