Hi Nanna 10 Days Collections: నాని గొప్ప రికార్డు.. అన్ని కోట్ల టార్గెట్ ఫినీష్.. బాలయ్య తర్వాత ఇతడే
నేచురల్ యాక్టింగ్‌తో సుదీర్ఘ కాలంగా ప్రేక్షకులను ఫిదా చేస్తూ.. తన రేంజ్‌ను కూడా పెంచుకుంటూ వెళ్తున్నాడు టాలెంటెడ్ హీరో నాని. అదే సమయంలో ఎన్నో ప్రయోగాలు చేస్తూ డిఫరెంట్ కాన్సెప్టులతో సినిమాలు చేస్తున్నాడు.
ఇందులో భాగంగానే ఇటీవలే నాని 'హాయ్ నాన్న' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి ఆరంభంలోనే భారీ స్థాయిలో స్పందన లభిస్తోంది. ఫలితంగా ఈ చిత్రం రెండో వారంలోనూ భారీ స్థాయిలో వసూళ్లను రాబడుతూనే ఉంది. మరి 'హాయ్ నాన్న' మూవీ పది రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఎంత రాబట్టిందో మీరే చూడండి!

ఫీల్ గుడ్ కాన్సెప్టుతో వచ్చింది: టాలెంటెడ్ హీరో నాని నటించిన సెంటిమెంట్ సినిమానే 'హాయ్ నాన్న'. శౌర్యూవ్ తెరకెక్కించిన ఈ మూవీని వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి నిర్మించారు. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా.. బేబీ కియారా ఖన్నా ముఖ్యమైన రోల్ చేసింది. జయరాం, అంగద్ బేడీ, నాజర్ కీలక పాత్రలు చేశారు. ఈ మూవీకి హేషమ్ అబ్దుల్ వహాబ్ మ్యూజిక్ ఇచ్చాడు.

నాని మూవీకి బిజినెస్ ఎంత?: నేచురల్ స్టార్ నాని 'హాయ్ నాన్న' మూవీకి నైజాంలో రూ. 8.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.60 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాలు కలిపి రూ. 10 కోట్లకు అమ్ముడుపోయింది. ఇలా ఈ సినిమాకు తెలుగులో రూ. 20.10 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ అయింది. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ. 5.50 కోట్లతో కలిపి రూ. 27.60 కోట్లు బిజినెస్ జరిగింది.

10వ రోజు తెలుగులో వసూళ్లు: 'హాయ్ నాన్న' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 10వ రోజు రెస్పాన్స్ భారీగా పెరిగింది. ఫలితంగా నైజాంలో రూ. 88 లక్షలు, సీడెడ్‌లో రూ. 13 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 11 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 7 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 4 లక్షలు, గుంటూరులో రూ. 6 లక్షలు, కృష్ణాలో రూ. 6 లక్షలు, నెల్లూరులో రూ. 3 లక్షలతో రూ. 1.38 కోట్లు షేర్, రూ. 2.50 కోట్లు గ్రాస్ వచ్చింది.
10 రోజులకూ కలిపి ఎంతంటే: 'హాయ్ నాన్న' మూవీ తెలుగు రాష్ట్రాల్లో 10 రోజుల్లో భారీగానే రాణించింది. ఫలితంగా నైజాంలో రూ. 9.65 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.21 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.16 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.08 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 67 లక్షలు, గుంటూరులో రూ. 97 లక్షలు, కృష్ణాలో రూ. 1.01 కోట్లు, నెల్లూరులో రూ. 49 లక్షలతో రూ. 18.24 కోట్లు షేర్, రూ. 32.90 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 10 రోజుల్లో రూ. 18.24 కోట్లు రాబట్టిన నాని 'హాయ్ నాన్న' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ బాగానే రాణించింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 3.48 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 7.82 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపితే 10 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 29.54 కోట్లు షేర్, రూ. 56.05 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసుకుంది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?: ఎమోషనల్ స్టోరీతో రూపొందిన 'హాయ్ నాన్న' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 27.60 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 28.50 కోట్లుగా నమోదైంది. ఇక, 10 రోజుల్లో దీనికి రూ. 29.54 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 1.04 కోట్లు లాభాలను కూడా సొంతం చేసుకుంది.

నానికి హిట్.. బాలయ్యతో: నాని - మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన 'హాయ్ నాన్న' మూవీకి ఆరంభం నుంచీ మంచి స్పందన లభిస్తోంది. ఫలితంగా ఈ చిత్రం 10 రోజుల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకుని హిట్‌గా నిలిచింది. అదే సమయంలో ఈ ఏడాది నానికి రెండో హిట్ వచ్చింది. ఫలితంగా 2023లో రెండు విజయాలను అందుకున్న హీరోగా బాలయ్య తర్వాతి స్థానంలో నేచురల్ స్టార్ నిలిచాడు.


Click it and Unblock the Notifications











