Hi Nanna 11 Days Collections: సండే కుమ్మేసిన హాయ్ నాన్న.. నాని సంచలన రికార్డు.. లాభం ఎన్ని కోట్లంటే!

సహజసిద్ధమైన నటనతో తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుని స్టార్‌గా దూసుకుపోతోన్నాడు నాని. దీనికితోడు ఈ మధ్య కాలంలో అతడు తన రేంజ్‌ను పెంచుకుంటూనే ఎన్నో ప్రయోగాలు కూడా చేస్తున్నాడు.

ఇలా ఇటీవలే నాని 'హాయ్ నాన్న' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి మంచి టాక్ రావడంతో మొదటి నుంచీ భారీ స్థాయిలో స్పందన లభిస్తోంది. ఫలితంగా ఈ చిత్రం క్రేజీ కలెక్షన్లను రాబడుతూనే ఉంది. మరి 'హాయ్ నాన్న' మూవీ 11 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఎంత రాబట్టిందో మీరే చూడండి మరి!

Nani Starrer Hi Nanna Movie 11 Days Worldwide Collections

హాయ్ నాన్న అంటూ వచ్చాడు: నేచురల్ స్టార్ నాని నటించిన ఫీల్ గుడ్ మూవీనే 'హాయ్ నాన్న'. శౌర్యూవ్ తెరకెక్కించిన ఈ మూవీని వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి నిర్మించారు. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా.. బేబీ కియారా ఖన్నా ముఖ్యమైన రోల్ చేసింది. జయరాం, అంగద్ బేడీ, నాజర్ కీలక పాత్రలు చేశారు. ఈ మూవీకి హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని సమకూర్చాడు.

Nani Starrer Hi Nanna Movie 11 Days Worldwide Collections

నాని మూవీకి బిజినెస్ ఎంత?: నాని నటించిన 'హాయ్ నాన్న' మూవీకి నైజాంలో రూ. 8.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.60 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాలు కలిపి రూ. 9 కోట్లకు అమ్ముడుపోయింది. ఇలా ఈ సినిమాకు తెలుగులో రూ. 20.10 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ అయింది. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2 కోట్లకు, ఓవర్సీస్ రైట్స్ రూ. 5.50 కోట్లతో కలిపి రూ. 27.60 కోట్లు బిజినెస్ అయింది.

Nani Starrer Hi Nanna Movie 11 Days Worldwide Collections

11వ రోజు తెలుగులో వసూళ్లు
'హాయ్ నాన్న' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 11వ రోజు రెస్పాన్స్ మరింత పెరిగింది. ఫలితంగా నైజాంలో రూ. 92 లక్షలు, సీడెడ్‌లో రూ. 18 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 12 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 12 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 6 లక్షలు, గుంటూరులో రూ. 12 లక్షలు, కృష్ణాలో రూ. 10 లక్షలు, నెల్లూరులో రూ. 5 లక్షలతో రూ. 1.67 కోట్లు షేర్, రూ. 3.00 కోట్లు గ్రాస్ వచ్చింది.

11 రోజులకూ కలిపి ఎంతంటే
'హాయ్ నాన్న' మూవీ తెలుగు రాష్ట్రాల్లో 11 రోజుల్లో భారీగానే రాణించింది. ఫలితంగా నైజాంలో రూ. 10.57 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.39 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.28 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.20 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 73 లక్షలు, గుంటూరులో రూ. 1.09 కోట్లు, కృష్ణాలో రూ. 1.11 కోట్లు, నెల్లూరులో రూ. 54 లక్షలతో రూ. 19.91 కోట్లు షేర్, రూ. 35.90 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 11 రోజుల్లో రూ. 19.91 కోట్లు రాబట్టిన నాని 'హాయ్ నాన్న' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ బాగానే రాణించింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 3.70 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 8.05 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపితే 11 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 31.66 కోట్లు షేర్‌, రూ. 60.20 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసుకుంది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?
ఫీల్ గుడ్ స్టోరీతో తెరకెక్కిన 'హాయ్ నాన్న' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 27.60 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 28.50 కోట్లుగా నమోదైంది. ఇక, 11 రోజుల్లో దీనికి రూ. 31.66 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 3.16 కోట్లు లాభాలను కూడా సొంతం చేసుకుంది.

నాని ఖాతాలో మరో రికార్డు
నేచురల్ స్టార్ నాని - మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన 'హాయ్ నాన్న' మూవీకి ఆరంభం నుంచీ మంచి స్పందన లభిస్తోంది. ఫలితంగా ఈ చిత్రం 11 రోజుల్లో రూ. 30 కోట్లు షేర్ మార్కును దాటేసింది. తద్వారా ఒకే ఏడాది రెండు సార్లు ఈ ఫీట్ సాధించిన మీడియం రేంజ్ హీరోగా నాని రికార్డు సాధించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X