Hi Nanna 13 Days Collections: నానికి అనుకోని వసూళ్లు.. మొత్తంగా కోట్ల వర్షం.. లాభం ఎంతో తెలిస్తే!
తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా తక్కువ మంది హీరోలు మాత్రమే తమదైన నటనతో ప్రతి సినిమానూ వన్ మ్యాన్ షోలుగా మార్చేస్తున్నారు. అలాంటి వారిలో నేచురల్ స్టార్ నాని ఒకడు. ఈ మధ్య కాలంలో రేంజ్‌ను పెంచుకుంటోన్న అతడు.. 'దసరా' వంటి మాస్ హిట్ తర్వాత 'హాయ్ నాన్న' అనే డీసెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఫీల్ గుడ్ స్టోరీతో రూపొందిన ఈ చిత్రానికి భారీ స్పందన లభిస్తూనే ఉంది. దీంతో ఈ సినిమాకు వసూళ్లు మంచిగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'హాయ్ నాన్న' మూవీ 13 రోజుల్లో ఎంత రాబట్టిందో మీరే చూడండి మరి!
హాయ్ నాన్న అంటూ కొత్తగా:నేచురల్ స్టార్ నాని నటించిన ఎమోషనల్ మూవీనే 'హాయ్ నాన్న'. శౌర్యూవ్ తెరకెక్కించిన ఈ మూవీని వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి నిర్మించారు. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా.. బేబీ కియారా ఖన్నా ముఖ్యమైన రోల్ చేసింది. జయరాం, అంగద్ బేడీ, నాజర్ కీలక పాత్రలు చేశారు. ఈ మూవీకి హేషమ్ అబ్దుల్ వహాబ్ మ్యూజిక్ ఇచ్చాడు.

నాని మూవీకి బిజినెస్ ఎంత?:నేచురల్ స్టార్ నాని 'హాయ్ నాన్న' మూవీకి నైజాంలో రూ. 8.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.60 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాలు కలిపి రూ. 9 కోట్లకు అమ్ముడుపోయింది. ఇలా ఈ సినిమాకు తెలుగులో రూ. 20.10 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ అయింది. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2 కోట్లకు, ఓవర్సీస్ రైట్స్ రూ. 5.50 కోట్లతో కలిపి రూ. 27.60 కోట్లు బిజినెస్ జరిగింది.
13వ రోజు తెలుగులో వసూళ్లు:'హాయ్ నాన్న' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 13వ రోజు రెస్పాన్స్ మరింత తగ్గింది. ఫలితంగా నైజాంలో రూ. 22 లక్షలు, సీడెడ్‌లో రూ. 6 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 3 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, గుంటూరులో రూ. 3 లక్షలు, కృష్ణాలో రూ. 2 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో రూ. 41 లక్షలు షేర్, రూ. 75 లక్షలు గ్రాస్ వచ్చింది.

13 రోజులకూ కలిపి ఎంతంటే:'హాయ్ నాన్న' మూవీ తెలుగు రాష్ట్రాల్లో 13 రోజుల్లో భారీగానే రాణించింది. ఫలితంగా నైజాంలో రూ. 11.05 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.48 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.36 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.27 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 76 లక్షలు, గుంటూరులో రూ. 1.16 కోట్లు, కృష్ణాలో రూ. 1.15 కోట్లు, నెల్లూరులో రూ. 56 లక్షలతో రూ. 20.80 కోట్లు షేర్, రూ. 37.50 కోట్లు గ్రాస్ వచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే:ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 13 రోజుల్లో రూ. 20.80 కోట్లు రాబట్టిన నాని 'హాయ్ నాన్న' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ బాగానే రాణించింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 3.90 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 8.45 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపితే 13 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 33.15 కోట్లు షేర్, రూ. 63.00 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసుకుంది.

టార్గెట్ ఇలా.. లాభం ఎంత?:నాని హీరోగా నటించిన 'హాయ్ నాన్న' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 27.60 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 28.50 కోట్లుగా నమోదైంది. ఇక, 13 రోజుల్లో దీనికి రూ. 33.15 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 4.65 కోట్లు లాభాలను కూడా సొంతం చేసుకుంది.


Click it and Unblock the Notifications











