Hi Nanna 1st Week Collections: 29 కోట్ల టార్గెట్.. వారంలో ఊహించని విధంగా.. నాని హిట్ కొట్టాలంటే!
సహజసిద్ధమైన నటనతో తెలుగు చిత్ర పరిశ్రమలో విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్న హీరోనే నేచురల్ స్టార్ నాని. కెరీర్ ఆరంభం నుంచీ ప్రతి సినిమాలోనూ వన్ మ్యాన్ షో చేస్తోన్న అతడు.. మార్కెట్‌ను, ఫాలోయింగ్‌ను కూడా గణనీయంగా పెంచుకున్నాడు. ఫలితంగా మరింత ఉత్సాహంతో మూవీలు చేస్తున్నాడు. ఇలా ఇప్పుడు నాని 'హాయ్ నాన్న' అనే చిత్రంతో వచ్చాడు. దీనికి టాక్‌కు అనుగుణంగానే అదిరిపోయే వసూళ్లు లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'హాయ్ నాన్న' మూవీ మొదటి వారం రోజుల వసూళ్లను మీరే చూడండి మరి!
ఫీల్ గుడ్ స్టోరీతో హాయ్ నాన్న:నేచురల్ స్టార్ నాని నటించిన ఫీల్ గుడ్ మూవీనే 'హాయ్ నాన్న'. శౌర్యూవ్ తెరకెక్కించిన ఈ మూవీని వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి నిర్మించారు. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా.. బేబీ కియారా ఖన్నా ముఖ్యమైన రోల్ చేసింది. ఈ మూవీకి హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని అందించాడు. జయరాం, అంగద్ బేడీ, నాజర్ కీలక పాత్రల్లో కనిపించారు.

నాని మూవీకి బిజినెస్ ఎంత?:నాని హీరోగా చేసిన 'హాయ్ నాన్న' మూవీకి నైజాంలో రూ. 8.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.60 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాలు కలిపి రూ. 9 కోట్లకు అమ్ముడుపోయింది. ఇలా ఈ సినిమాకు తెలుగులో రూ. 20.10 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ అయింది. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ. 5.50 కోట్లతో కలిపి రూ. 27.60 కోట్లు బిజినెస్ జరిగింది.
7వ రోజు తెలుగులో వసూళ్లు:'హాయ్ నాన్న' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 7వ రోజు రెస్పాన్స్ తగ్గిపోయింది. ఫలితంగా నైజాంలో రూ. 40 లక్షలు, సీడెడ్‌లో రూ. 6 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 5 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 6 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, గుంటూరులో రూ. 4 లక్షలు, కృష్ణాలో రూ. 4 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో రూ. 70 లక్షలు షేర్, రూ. 1.25 కోట్లు గ్రాస్ వచ్చింది.

7 రోజులకూ కలిపి ఎంతంటే:'హాయ్ నాన్న' మూవీ తెలుగు రాష్ట్రాల్లో 7 రోజుల్లో భారీగానే రాణించింది. ఫలితంగా నైజాంలో రూ. 8.12 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.00 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.97 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 94 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 59 లక్షలు, గుంటూరులో రూ. 85 లక్షలు, కృష్ణాలో రూ. 89 లక్షలు, నెల్లూరులో రూ. 44 లక్షలతో రూ. 15.80 కోట్లు షేర్, రూ. 28.45 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే:ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 7 రోజుల్లో రూ. 15.80 కోట్లు రాబట్టిన నాని 'హాయ్ నాన్న' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ బాగానే రాణించింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 3.05 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 7.00 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపితే 7 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 25.85 కోట్లు షేర్, రూ. 49.05 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసుకుంది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?:ఎమోషనల్ స్టోరీతో వచ్చిన 'హాయ్ నాన్న' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 27.60 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 28.50 కోట్లుగా నమోదైంది. ఇక, 7 రోజుల్లో దీనికి రూ. 25.85 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 2.65 కోట్లు రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ను చేరుకుంటుంది.


Click it and Unblock the Notifications











