Hi Nanna 2 Weeks Collections: 28 కోట్లే రావాలి.. 2 వారాల్లోనే కోట్ల వర్షం.. లాభాలతో ఊహించని రికార్డు
ప్రతి సినిమాలోనూ సహజసిద్ధమైన యాక్టింగ్ చేస్తూ నేచురల్ స్టార్ అన్న పేరును సార్థకం చేస్తూ దూసుకుపోతోన్నాడు నాని. ఈ మధ్య కాలంలో అయితే తన రేంజ్‌ను పెంచుకునేలా భారీ సినిమాలను చేస్తున్నాడు. ఇలా ఈ ఏడాది ఆరంభంలో 'దసరా'తో పాన్ ఇండియా హిట్ కొట్టాడు. ఈ ఊపులోనే ఇప్పుడు 'హాయ్ నాన్న' అనే సినిమాతో వచ్చాడు. దీనికి ఆరంభంలోనే మంచి టాక్ రావడంతో ప్రేక్షకుల నుంచి స్పందన భారీ స్థాయిలో లభిస్తోంది. ఫలితంగా దీనికి వసూళ్లు అదిరిపోయేలా వస్తున్నాయి. మరి 'హాయ్ నాన్న' 2 వారాల రిపోర్టును మీరే చూడండి!
హాయ్ నాన్న అంటూ కొత్తగా:నేచురల్ స్టార్ నాని హీరోగా శౌర్యూవ్ నటించిన ఎమోషనల్ మూవీనే 'హాయ్ నాన్న'. ఈ సినిమాను వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి నిర్మించారు. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా.. బేబీ కియారా ఖన్నా ముఖ్యమైన రోల్ చేసింది. జయరాం, అంగద్ బేడీ, నాజర్ కీలక పాత్రలు చేశారు. ఈ మూవీకి హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని సమకూర్చాడు.

నాని మూవీకి బిజినెస్ ఎంత?:నాని నటించిన 'హాయ్ నాన్న' మూవీకి నైజాంలో రూ. 8.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.60 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాలు కలిపి రూ. 9 కోట్లకు అమ్ముడుపోయింది. ఇలా ఈ సినిమాకు తెలుగులో రూ. 20.10 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ అయింది. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2 కోట్లకు, ఓవర్సీస్ రైట్స్ రూ. 5.50 కోట్లతో కలిపి రూ. 27.60 కోట్లు బిజినెస్ చేసుకుంది.
14వ రోజు తెలుగులో వసూళ్లు:'హాయ్ నాన్న' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 14వ రోజు రెస్పాన్స్ మరింత తగ్గింది. ఫలితంగా నైజాంలో రూ. 17 లక్షలు, సీడెడ్‌లో రూ. 3 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 2 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, గుంటూరులో రూ. 2 లక్షలు, కృష్ణాలో రూ. 2 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో రూ. 30 లక్షలు షేర్, రూ. 60 లక్షలు గ్రాస్ వచ్చింది.

14 రోజులకూ కలిపి ఎంతంటే:'హాయ్ నాన్న' మూవీ తెలుగు రాష్ట్రాల్లో 2 వారాల్లో భారీగానే రాణించింది. ఫలితంగా నైజాంలో రూ. 11.22 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.51 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.38 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.29 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 77 లక్షలు, గుంటూరులో రూ. 1.18 కోట్లు, కృష్ణాలో రూ. 1.17 కోట్లు, నెల్లూరులో రూ. 58 లక్షలతో రూ. 21.10 కోట్లు షేర్, రూ. 38.10 కోట్లు గ్రాస్ వచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే:ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 14 రోజుల్లో రూ. 21.10 కోట్లు రాబట్టిన నాని 'హాయ్ నాన్న' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ బాగానే రాణించింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.00 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 8.70 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపితే 14 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 33.80 కోట్లు షేర్, రూ. 64.30 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసుకుంది.

టార్గెట్ ఇలా.. లాభం ఎంత?:నేచురల్ స్టార్ నాని చేసిన 'హాయ్ నాన్న' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 27.60 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 28.50 కోట్లుగా నమోదైంది. ఇక, 14 రోజుల్లో దీనికి రూ. 33.80 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 5.30 కోట్లు లాభాలను కూడా సొంతం చేసుకుంది.


Click it and Unblock the Notifications











