Hi Nanna 3 Days Collections: నాని క్లాస్ బ్యాటింగ్.. 3వ రోజు ఏకంగా అన్ని కోట్లు.. మొత్తం ఎంతంటే!

నేచురల్ యాక్టింగ్‌తో తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న హీరోనే నాని. ఏమాత్రం ఫిల్మ్ బ్యాగ్రౌండ్ లేకుండానే వచ్చిన అతడు.. తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ ముందుకు సాగుతోన్నాడు.

ఈ క్రమంలోనే ఎన్నో హిట్లను అందుకుని ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ఇలా ఇప్పుడు నాని 'హాయ్ నాన్న' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి ఆరంభంలోనే మంచి టాక్ రావడంతో రెస్పాన్స్ భారీగానే వస్తోంది. మరి 'హాయ్ నాన్న' సినిమా మూడు రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూసేయండి!

Nani Starrer Hi Nanna Movie 3 Days Worldwide Collections

హాయ్ నాన్న అంటూ ఎంట్రీ: టాలీవుడ్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీనే 'హాయ్ నాన్న'. శౌర్యూవ్ తెరకెక్కించిన ఈ మూవీని వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి నిర్మించారు. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా.. బేబీ కియారా ఖన్నా ముఖ్యమైన రోల్ చేసింది. ఈ మూవీకి హేషమ్ అబ్దుల్ వహాబ్ మ్యూజిక్ ఇచ్చాడు. జయరాం, అంగద్ బేడీ, నాజర్ కీలక పాత్రల్లో కనిపించారు.

Nani Starrer Hi Nanna Movie 3 Days Worldwide Collections

నాని మూవీకి బిజినెస్ ఎంత?: 'హాయ్ నాన్న' మూవీకి నైజాంలో రూ. 8.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.60 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాలు కలిపి రూ. 9 కోట్లకు అమ్ముడుపోయింది. ఇలా ఈ సినిమాకు తెలుగులో రూ. 20.10 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ. 5.50 కోట్లతో కలిపి మొత్తంగా రూ. 27.60 కోట్లు బిజినెస్ అయింది.

Nani Starrer Hi Nanna Movie 3 Days Worldwide Collections

3వ రోజు తెలుగులో వసూళ్లు: 'హాయ్ నాన్న' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 3వ రోజూ భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 1.86 కోట్లు, సీడెడ్‌లో రూ. 65 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 52 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 21 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 12 లక్షలు, గుంటూరులో రూ. 16 లక్షలు, కృష్ణాలో రూ. 19 లక్షలు, నెల్లూరులో రూ. 9 లక్షలతో రూ. 3.80 కోట్లు షేర్, రూ. 7.00 కోట్లు గ్రాస్ వచ్చింది.

3 రోజులకూ కలిపి ఎంతంటే: 'హాయ్ నాన్న' మూవీ తెలుగు రాష్ట్రాల్లో 3 రోజుల్లో డీసెంట్‌గానే రాణించింది. ఫలితంగా నైజాంలో రూ. 4.56 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.04 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.23 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 51 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 27 లక్షలు, గుంటూరులో రూ. 42 లక్షలు, కృష్ణాలో రూ. 50 లక్షలు, నెల్లూరులో రూ. 22 లక్షలతో రూ. 8.75 కోట్లు షేర్, రూ. 15.65 కోట్లు గ్రాస్ వచ్చింది.

Nani Starrer Hi Nanna Movie 3 Days Worldwide Collections

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 3 రోజుల్లో రూ. 8.75 కోట్లు రాబట్టిన నాని 'హాయ్ నాన్న' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ బాగానే రాణించింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.70 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 4.30 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపితే 3 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 14.75 కోట్లు షేర్‌, రూ. 27.85 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసుకుంది.

Nani Starrer Hi Nanna Movie 3 Days Worldwide Collections

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?:ఫీల్ గుడ్ స్టోరీతో రూపొందిన 'హాయ్ నాన్న' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 27.60 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 28.50 కోట్లుగా నమోదైంది. ఇక, 3 రోజుల్లో దీనికి రూ. 14.75 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 13.75 కోట్లు రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ను చేరుకుంటుంది.

Nani Starrer Hi Nanna Movie 3 Days Worldwide Collections

ఓవర్సీస్‌లో రికార్డు వసూళ్లు: ఓవర్సీస్‌లో ప్రీమియర్స్ నుంచి మంచి వసూళ్లను రాబట్టుకుంటోన్న 'హాయ్ నాన్న' మూవీ.. మూడో రోజు మాత్రం భారీ స్థాయిలో స్పందననే అందుకుంది. ఫలితంగా శనివారం ఈ చిత్రానికి విదేశాల్లో అత్యధిక వసూళ్లు వచ్చాయి. ఇలా ఈ చిత్రం అప్పుడే అక్కడ 1 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. తద్వారా ఈ మార్క్ చేరిన నాని తొమ్మిదో సినిమాగా ఇది రికార్డు సాధించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X