Hi Nanna 8 Days Collections: నాని మూవీకి ఊహించని వసూళ్లు.. 50 కోట్లతో రికార్డు.. ఇంకెంత రావాలంటే!
బ్యాగ్రౌండ్ లేకుండానే సినిమాల్లోకి వచ్చినా తనదైన శైలి యాక్టింగ్‌తో చాలా తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయాడు నాని. సినిమా సినిమానూ వైవిధ్యాన్ని చూపిస్తోన్న అతడు.. తన రేంజ్‌ను కూడా పెంచుకుంటూ వెళ్తున్నాడు. ఈ జోష్‌లోనే మరిన్ని ప్రాజెక్టులను చేస్తున్నాడు. ఇలా ఇప్పుడు నాని 'హాయ్ నాన్న' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి ఆరంభం నుంచీ మంచి స్పందనే వస్తోంది. కానీ, వీక్ డేస్‌లో మాత్రం డౌన్ అవుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో 'హాయ్ నాన్న' మూవీ ఎనిమిది రోజుల వసూళ్లను మీరే చూడండి మరి!
ఎమోషనల్ స్టోరీతో వచ్చింది : టాలీవుడ్ స్టార్ నాని నటించిన ఫీల్ గుడ్ సినిమానే 'హాయ్ నాన్న'. శౌర్యూవ్ తెరకెక్కించిన ఈ మూవీని వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి నిర్మించారు. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా.. బేబీ కియారా ఖన్నా ముఖ్యమైన రోల్ చేసింది. ఈ మూవీకి హేషమ్ అబ్దుల్ వహాబ్ మ్యూజిక్ అందించాడు. జయరాం, అంగద్ బేడీ, నాజర్ కీలక పాత్రలు చేశారు.

నాని మూవీకి బిజినెస్ ఎంత : నాని నటించిన 'హాయ్ నాన్న' మూవీకి నైజాంలో రూ. 8.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.60 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాలు కలిపి రూ. 9 కోట్లకు అమ్ముడుపోయింది. ఇలా ఈ సినిమాకు తెలుగులో రూ. 20.10 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ అయింది. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ. 5.50 కోట్లతో కలిపి రూ. 27.60 కోట్లు బిజినెస్ చేసుకుంది.
8వ రోజు తెలుగులో వసూళ్లు
'హాయ్ నాన్న' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 8వ రోజు రెస్పాన్స్ తగ్గిపోయింది. ఫలితంగా నైజాంలో రూ. 34 లక్షలు, సీడెడ్‌లో రూ. 4 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 4 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 4 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 3 లక్షలు, కృష్ణాలో రూ. 3 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో రూ. 55 లక్షలు షేర్, రూ. 1.00 కోట్లు గ్రాస్ వచ్చింది.

8 రోజులకూ కలిపి ఎంతంటే
'హాయ్ నాన్న' మూవీ తెలుగు రాష్ట్రాల్లో 8 రోజుల్లో భారీగానే రాణించింది. ఫలితంగా నైజాంలో రూ. 8.46 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.04 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.01 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 98 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 61 లక్షలు, గుంటూరులో రూ. 88 లక్షలు, కృష్ణాలో రూ. 92 లక్షలు, నెల్లూరులో రూ. 45 లక్షలతో రూ. 16.35 కోట్లు షేర్, రూ. 29.45 కోట్లు గ్రాస్ వచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 8 రోజుల్లో రూ. 16.35 కోట్లు రాబట్టిన నాని 'హాయ్ నాన్న' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ బాగానే రాణించింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 3.12 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 7.10 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపితే 8 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 26.57 కోట్లు షేర్, రూ. 50.40 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసుకుంది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?
ఫీల్ గుడ్ స్టోరీతో రూపొందిన 'హాయ్ నాన్న' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 27.60 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 28.50 కోట్లుగా నమోదైంది. ఇక, 8 రోజుల్లో దీనికి రూ. 26.57 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 1.93 కోట్లు రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ను చేరుకుంటుంది.
50 కోట్లతో నాని సెన్సేషన్
నాని - మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన 'హాయ్ నాన్న' మూవీకి ఆరంభం నుంచీ మంచి స్పందన లభిస్తోంది. మధ్యలో కాస్త డౌన్ అయినా చక్కని హోల్డుతో ఇది విజయం దిశగా వెళ్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ చిత్రం రూ. 50 కోట్లు గ్రాస్‌ను దాటింది. ఫలితంగా వరుసగా రెండు సార్లు రూ. 50 కోట్లు మార్కును దాటిన మీడియం రేంజ్ హీరోగా నాని రికార్డు సాధించాడు.


Click it and Unblock the Notifications











