Hi Nanna 9 Days Collections: నానికి భారీ వసూళ్లు.. అక్కడ టార్గెట్ ఫినీష్.. ఓవరాల్‌గా హిట్ కావాలంటే!

యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, ఎక్స్‌ప్రెషన్స్, లుక్స్ ఇలా అన్నింటిలోనూ తనదైన మార్కును చూపిస్తూ తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రత్యేకమైన ఇమేజ్‌ను దూసుకుపోతోన్నాడు నేచురల్ స్టార్ నాని. దీనికితోడు హిట్లను కూడా అందుకోవడంతో మార్కెట్‌ను పెంచుకుంటున్నాడు. అలాగే, ప్రయోగాలనూ చేస్తున్నాడు.

ఇలా ఇటీవలే నాని 'హాయ్ నాన్న' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి టాక్‌తో పాటు వసూళ్లు కూడా భారీగానే లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'హాయ్ నాన్న' మూవీ తొమ్మిది రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఎంత రాబట్టిందో మీరే చూసేయండి!

Nani Starrer Hi Nanna Movie 9 Days Worldwide Collections

సెంటిమెంట్‌ స్టోరీతో వచ్చింది: నేచురల్ స్టార్ నాని నటించిన సెంటిమెంట్ సినిమానే 'హాయ్ నాన్న'. శౌర్యూవ్ తెరకెక్కించిన ఈ మూవీని వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి నిర్మించారు. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా.. బేబీ కియారా ఖన్నా ముఖ్యమైన రోల్ చేసింది. జయరాం, అంగద్ బేడీ, నాజర్ కీలక పాత్రలు చేశారు. ఈ మూవీకి హేషమ్ అబ్దుల్ వహాబ్ మ్యూజిక్ అందించాడు.

Nani Starrer Hi Nanna Movie 9 Days Worldwide Collections

నాని మూవీకి బిజినెస్ ఎంత?: నాని హీరోగా చేసిన 'హాయ్ నాన్న' మూవీకి నైజాంలో రూ. 8.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.60 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాలు కలిపి రూ. 9 కోట్లకు అమ్ముడుపోయింది. ఇలా ఈ సినిమాకు తెలుగులో రూ. 20.10 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ అయింది. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ. 5.50 కోట్లతో కలిపి రూ. 27.60 కోట్లు బిజినెస్ చేసింది.

Nani Starrer Hi Nanna Movie 9 Days Worldwide Collections

9వ రోజు ఇలా.. మొత్తం అలా: నేచురల్ స్టార్ నాని హీరోగా శౌర్యూవ్ తెరకెక్కించిన 'హాయ్ నాన్న' సినిమాకు 9వ రోజు కూడా రెస్పాన్స్ కాసింత తగ్గిపోయింది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి ఈ సినిమా రూ. 48 లక్షలు షేర్‌ను వసూలు చేసింది. అలాగే, ప్రపంచ వ్యాప్తంగా రూ. 75 లక్షలు వరకూ రాబట్టింది. ఇలా భారీ వసూళ్లతో ఈ చిత్రం విజయానికి మరింత చేరువగా వచ్చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X