Hi Nanna Day 1 Collections: మ్యాజిక్ చేసిన నాని.. తొలి రోజు అన్ని కోట్లు.. అక్కడ సంచలన వసూళ్లు

టాలీవుడ్‌లో నేచురల్ యాక్టింగ్‌తో మాయ చేస్తూ.. సుదీర్ఘ కాలంగా ప్రేక్షకులను అలరిస్తూ ముందుకు సాగుతోన్నాడు నేచురల్ స్టార్ నాని. గతంలో కంటే ఈ మధ్య కాలంలో ఫుల్ జోష్‌తో కనిపిస్తోన్న అతడు.. వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూనే ఉన్నాడు.

ఈ క్రమంలోనే తాజాగా నాని 'హాయ్ నాన్న' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఫీల్ గుడ్ స్టోరీతో రూపొందిన ఈ చిత్రానికి మంచి టాక్ కూడా వచ్చింది. అందుకు తగ్గట్లుగానే వసూళ్లు వచ్చాయి. మరి 'హాయ్ నాన్న' సినిమా మొదటి రోజు ఎంత వసూలు చేసిందో చూద్దామా!

Nani Starrer Hi Nanna Movie Day 1 Worldwide Collections

ఫీల్ గుడ్ స్టోరీతో హాయ్ నాన్న: టాలీవుడ్ స్టార్ నాని హీరోగా నటించిన ఫీల్ గుడ్ మూవీనే 'హాయ్ నాన్న'. శౌర్యూవ్ తెరకెక్కించిన ఈ మూవీని వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి నిర్మించారు. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా.. బేబీ కియారా ఖన్నా ముఖ్యమైన రోల్ చేసింది. ఈ సినిమాకు హేషమ్ అబ్దుల్ వహాబ్ మ్యూజిక్ ఇచ్చాడు. జయరాం, అంగద్ బేడీ, నాజర్ కీలక పాత్రలు చేశారు.

Nani Starrer Hi Nanna Movie Day 1 Worldwide Collections

నాని మూవీకి బిజినెస్ ఎంత?: 'హాయ్ నాన్న' మూవీకి నైజాంలో రూ. 8.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.60 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాలు అన్నీ కలిపి రూ. 9 కోట్లకు అమ్ముడుపోయింది. ఇలా ఈ సినిమాకు తెలుగులో రూ. 20.10 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ. 5.50 కోట్లతో కలిపి మొత్తంగా రూ. 27.60 కోట్లు బిజినెస్ అయింది.

Nani Starrer Hi Nanna Movie Day 1 Worldwide Collections

అలాంటి టాక్‌తో డీసెంట్‌గా: ఆరంభంలోనే మంచి హైప్‌ను క్రియేట్ చేసుకుని 'హాయ్ నాన్న' మూవీ గురువారమే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ పాజిటివ్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన కూడా మంచిగానే లభించింది. ముఖ్యంగా ఈవినింగ్ షోలకు భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కిందని తెలుస్తోంది.

Nani Starrer Hi Nanna Movie Day 1 Worldwide Collections

తొలి రోజు తెలుగులో ఇలా: ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్‌తో రూపొందిన 'హాయ్ నాన్న' సినిమాకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఫస్ట్ డే టాక్‌కు అనుగుణంగానే స్పందన దక్కింది. ఫలితంగా ఈ చిత్రం మొదటి రోజు రూ. 4.00 - 4.50 కోట్లు షేర్ వసూలు చేసినట్లు తెలిసింది. నాని గత చిత్రంతో పోల్చుకుంటే ఇది తక్కువే అయినా.. ఈ సినిమా రిలీజ్‌ను బేస్ చేసుకుంటే డీసెంట్ అని చెప్పాలి.

Nani Starrer Hi Nanna Movie Day 1 Worldwide Collections

ఓవర్సీస్‌లో భారీ వసూళ్లు: నాని నటించిన 'హాయ్ నాన్న' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో మొదటి రోజు డీసెంట్ వసూళ్లే వచ్చాయి. తెలుగులోనే కాదు.. వరల్డ్ వైడ్‌గా ఇది ఆశించిన రీతిలో పెర్ఫార్మ్ చేసిందనే ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా ఓవర్సీస్‌లో ఇది 350K డాలర్లు (2.9 కోట్లు గ్రాస్) రాబట్టింది. ఇలా ఫస్ట్ డే ఇది రూ. 5.50 కోట్లు షేర్‌తో పాటు రూ. 10 కోట్లు వరకూ గ్రాస్ రాబట్టింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X