Hi Nanna Collections: నాని మూవీకి ఊహించని వసూళ్లు.. మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే!
తెలుగు చిత్ర పరిశ్రమలో వేగంగా సినిమాలు చేసుకుంటూ వెళ్తోన్న హీరోల్లో నేచురల్ స్టార్ నాని ఒకడు. ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా మూవీలు చేస్తోన్న అతడు.. ఈ ఏడాదిలో 'దసరా' అనే చిత్రంతో వచ్చి సంచలనం సృష్టించాడు.
ఈ ఊపులోనే ఈ టాలెంటెడ్ హీరో ఇప్పుడు 'హాయ్ నాన్న' అనే సినిమాను చేశాడు. ఫీల్ గుడ్ స్టోరీతో రూపొందిన ఈ చిత్రం ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనికి మంచి టాక్ కూడా వచ్చింది. మరి 'హాయ్ నాన్న' సినిమా మొదటి రోజు ఎంత వసూలు చేసే అవకాశం ఉందో చూద్దామా!

హాయ్ నాన్న అంటూ వచ్చాడు: నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన తాజా సినిమానే 'హాయ్ నాన్న'. శౌర్యూవ్ తెరకెక్కించిన ఈ మూవీని వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి నిర్మించారు. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా.. బేబీ కియారా ఖన్నా ముఖ్యమైన రోల్ చేసింది. ఈ సినిమాకు హేషమ్ అబ్దుల్ వహాబ్ మ్యూజిక్ ఇచ్చాడు. జయరాం, అంగద్ బేడీ, నాజర్ తదితరులు నటించారు.

నాని మూవీకి బిజినెస్ ఎంత?: 'హాయ్ నాన్న' మూవీకి నైజాంలో రూ. 8.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.60 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాలు అన్నీ కలిపి రూ. 9 కోట్లకు అమ్ముడుపోయింది. ఇలా ఈ సినిమాకు తెలుగులో రూ. 20.10 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ. 5.50 కోట్లతో కలిపి మొత్తంగా రూ. 27.60 కోట్లు వ్యాపారం జరిగింది.

అలాంటి టాక్.. వసూళ్లు ఇలా: ఎన్నో అంచనాల నడుమ రూపొందిన 'హాయ్ నాన్న' మూవీ గురువారమే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ మంచి టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే రివ్యూలు కూడా పాజిటివ్‌గానే వచ్చాయి. ఫలితంగా ఈ సినిమాకు మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

తొలి రోజు తెలుగులో వసూళ్లు: ఎమోషనల్ స్టోరీతో వచ్చిన 'హాయ్ నాన్న' సినిమాకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఫస్ట్ డే టాక్‌కు అనుగుణంగానే రెస్పాన్స్ భారీగా లభించింది. మ్యాట్నీ నుంచి ఈ చిత్రానికి బుకింగ్స్ మరింతగానే పెరిగాయని తెలిసింది. దీంతో తొలి రోజు రెండు రాష్ట్రాల్లో కలిపి ఈ చిత్రం రూ. 3.50 - 4.00 కోట్లు షేర్ వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

వరల్డ్ వైడ్‌గా ఎంత రావచ్చు: నాని నటించిన 'హాయ్ నాన్న' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో మొదటి రోజు డీసెంట్ వసూళ్లే రాబోతున్నాయి. తెలుగులోనే కాదు.. వరల్డ్ వైడ్‌గా ఇది ఆశించిన రీతిలో పెర్ఫార్మ్ చేసిందనే ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఫలితంగా కర్నాటక, రెస్టాఫ్ ఇండియా ముఖ్యంగా ఓవర్సీస్‌లోనూ సత్తా చాటింది. ఇలా ఫస్ట్ డే ఇది రూ. 4.50 కోట్లు షేర్‌తో పాటు రూ. 8 కోట్లు గ్రాస్ రాబట్టే ఛాన్స్ ఉంది.


Click it and Unblock the Notifications











