Hi Nanna 2 Days Collections: నాని మూవీకి షాకింగ్ వసూళ్లు.. 2 రోజుల్లో అన్ని కోట్లే.. హిట్ కావాలంటే!
సహజసిద్ధమైన నటనతో సుదీర్ఘ కాలంగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ విభిన్నమైన సినిమాలతో వస్తున్నాడు నేచురల్ స్టార్ నాని. హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేస్తోన్న అతడు.. ఈ ఏడాది 'దసరా' అనే సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టాడు. ఈ జోష్‌లోనే ఇప్పుడు 'హాయ్ నాన్న' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి ఆరంభంలోనే మంచి టాక్ వచ్చింది. కానీ, ఓపెనింగ్స్ మాత్రం మోస్తరుగా వచ్చాయి. రెండో రోజు కాస్త తగ్గాయి. మరి 'హాయ్ నాన్న' సినిమా రెండు రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూసేయండి!
ఎమోషనల్ స్టోరీతో వచ్చాడు:నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ఎమోషనల్ మూవీనే 'హాయ్ నాన్న'. శౌర్యూవ్ తెరకెక్కించిన ఈ మూవీని వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి నిర్మించారు. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా.. బేబీ కియారా ఖన్నా ముఖ్యమైన రోల్ చేసింది. ఈ మూవీకి హేషమ్ అబ్దుల్ వహాబ్ మ్యూజిక్ ఇచ్చాడు. జయరాం, అంగద్ బేడీ, నాజర్ కీలక పాత్రల్లో నటించారు.

నాని మూవీకి బిజినెస్ ఎంత?:'హాయ్ నాన్న' సినిమాకు నైజాంలో రూ. 8.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.60 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాలు కలిపి రూ. 9 కోట్లకు అమ్ముడుపోయింది. ఇలా ఈ సినిమాకు తెలుగులో రూ. 20.10 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ. 5.50 కోట్లతో కలిపి మొత్తంగా రూ. 27.60 కోట్లు బిజినెస్ జరిగింది.
2వ రోజు తెలుగులో వసూళ్లు:'హాయ్ నాన్న' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 2వ రోజూ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 1.06 కోట్లు, సీడెడ్‌లో రూ. 15 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 28 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 16 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 7 లక్షలు, గుంటూరులో రూ. 12 లక్షలు, కృష్ణాలో రూ. 14 లక్షలు, నెల్లూరులో రూ. 6 లక్షలతో రూ. 2.04 కోట్లు షేర్, రూ. 3.55 కోట్లు గ్రాస్ వచ్చింది.

2 రోజులకూ కలిపి ఎంతంటే:'హాయ్ నాన్న' మూవీ తెలుగు రాష్ట్రాల్లో 2 రోజుల్లో బాగానే రాణించింది. ఫలితంగా నైజాంలో రూ. 2.70 కోట్లు, సీడెడ్‌లో రూ. 39 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 71 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 30 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 15 లక్షలు, గుంటూరులో రూ. 26 లక్షలు, కృష్ణాలో రూ. 31 లక్షలు, నెల్లూరులో రూ. 13 లక్షలతో రూ. 4.95 కోట్లు షేర్, రూ. 8.65 కోట్లు గ్రాస్ వచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే:ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 2 రోజుల్లో రూ. 6.78 కోట్లు రాబట్టిన నాని 'హాయ్ నాన్న' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ బాగానే రాణించింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 95 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 3.50 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపితే 2 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 8.95 కోట్లు షేర్, రూ. 16.85 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసుకుంది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?:ఫీల్ గుడ్ స్టోరీతో వచ్చిన 'హాయ్ నాన్న' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 27.60 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 28.50 కోట్లుగా నమోదైంది. ఇక, 2 రోజుల్లో దీనికి రూ. 8.95 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 19.55 కోట్లు రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ను చేరుకుంటుంది.


Click it and Unblock the Notifications











