దుమ్ము రేపుతున్న నాని.. అవి కలెక్షన్లా? వసూళ్ల సునామీనా?
గత కొన్నేండ్లుగా నాని పట్టిందల్లా బంగారమే అవుతున్నది. ఎలాంటి చిత్రం చేసినా నానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. రివ్యూలు, పబ్లిక్ టాక్‌ను పక్కన పెట్టి ఆయన నటించిన చిత్రాలను ఆదరిస్తున్నారు.
టాలీవుడ్‌లో యువ హీరో నాని అంత అదృష్ణవంతుడు మరొకరు ఉండరేమో. గత కొన్నేండ్లుగా నాని పట్టిందల్లా బంగారమే అవుతున్నది. ఎలాంటి చిత్రం చేసినా నానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. రివ్యూలు, పబ్లిక్ టాక్‌ను పక్కన పెట్టి ఆయన నటించిన చిత్రాలను ఆదరిస్తున్నారు. అదే క్రమంలో నాని నటించిన తాజా చిత్రం నిన్ను కోరి సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నది. విమర్శకులు సందేహాలకు నిన్నుకోరి చక్కటి సమాధానం ఇస్తున్నది.

టాప్ స్పీడ్లో నాని కెరీర్
టాలీవుడ్‌లో నాని కెరీర్ టాప్ గేర్‌లో దూసుకెళ్తున్నది. సక్సెస్ రేటు రాకెట్ స్పీడ్ ముందుకెళ్తున్నది. నిన్ను కోరి చిత్రం నానికి వరుసగా ఆరో హిట్. నిన్ను కోరి చిత్రాన్ని దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించాడు. ఆయనకు ఇదే తొలి చిత్రమైనా అనుభవం ఉన్న దర్శకుడిగా సినిమాను నడిపించాడు. అక్కడక్కడ కథను నడిపించడంలో కొంత తడబాటుకు లోనైనా ప్రేక్షకులను మెప్పించగలిగాడు.

ప్రేక్షకులే డిసైడ్ చేస్తారు..
చిత్ర విజయాన్ని పురస్కరించుకొని నాని మాట్లాడుతూ.. మంచి సినిమాలను చేయడంపైనే నా దృష్టి ఉంటుంది. దాని ఫలితం నా చేతుల్లో ఆధారపడి ఉండదు. ప్రతీ సారి ఈ చిత్రం హిట్ అవుతుందనే నమ్మకంతోనే సినిమా చేస్తాను. మంచి సినిమాను అందించడానికి కష్టపడుతాను. ఈ చిత్ర సక్సెస్‌ను ప్రేక్షకులు డిసైడ్ చేస్తారు అని నాని అన్నారు.

తొలివారాంతంలో కలెక్షన్లు ఇవే...
జూలై 7వ తేదీన నిన్నుకోరి చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రం తొలివారాంతానికి రూ.25 కోట్లు వసూలు చేసింది. విడుదలైన తర్వాత తొలి సోమవారం రోజున కలెక్షన్లు తగ్గుముఖం పట్టిన దాఖలాలు లేవు. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి భారీ స్పందన కనిపిస్తున్నది.

నాని కెరీర్‌లోనే భారీ ఒపెనింగ్స్
ప్రపంచవ్యాప్తంగా నిన్నుకోరి సినిమాకు అనూహ్యమైన స్పందన లభిస్తున్నది. నాని కెరీర్‌లోనే భారీ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిన్నుకోరి నిలిచింది. ఓవర్సీస్ మార్కెట్‌లో కలెక్షన్ల పరంగా ఈ చిత్రం దుమ్మురేపుతున్నది అని ట్రేడ్ అనలిస్టు త్రినాథ్ తెలిపారు.


Click it and Unblock the Notifications











