Saripodha Sanivaaram 11 Days Collections: నానికి సండే లక్.. అప్పుడే అన్ని కోట్లు.. లాభం చూస్తే మెంటలే!
తెలుగు సినిమా రంగంలో విభిన్నమైన సబ్జెక్టులతో మూవీలు చేస్తూ తన రేంజ్‌ను పెంచుకుంటూ వెళ్తున్నాడు నేచురల్ స్టార్ నాని. సహజసిద్ధమైన నటనతో మాయ చేస్తోన్న అతడు.. కోట్ల మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. దీనికితోడు వరుసగా హిట్లను కూడా అందుకుంటూ దూసుకుపోతోన్నాడు. ఇలా ఇప్పుడు నాని 'సరిపోదా శనివారం' అనే సినిమాను చేశాడు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ చిత్రం భారీ రెస్పాన్స్‌ను రాబడుతోంది. ఫలితంగా అత్యధిక వసూళ్లను సాధిస్తోంది. ఈ నేపథ్యంలో నాని 'సరిపోదా శనివారం' 11 రోజుల వసూళ్లను మీరే చూడండి!
మాస్ స్టోరీతో వచ్చిన స్టార్ హీరో
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన మాస్ మూవీనే 'సరిపోదా శనివారం'. వివేక్ ఆత్రేయ తీసిన ఈ మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించగా.. ఎస్‌జే సూర్య విలన్ పాత్రను చేశారు. అలాగే, అభిరామి, అదితి బాలన్, మురళీ శర్మ నటించారు. ఈ మూవీని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై దానయ్య నిర్మించారు. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ మ్యూజిక్ ఇచ్చాడు.

నాని మూవీ బిజినెస్ వివరాలు
నాని 'సరిపోదా శనివారం'కు నైజాంలో రూ. 12.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 5.00 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 12.50 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 30 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకట ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 5.00 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6 కోట్లకు అమ్ముడైంది. ఇలా నాని సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 41 కోట్ల బిజినెస్ చేసుకుంది.
11వ రోజు ఇలా.. మొత్తం అలా
వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని నటించిన 'సరిపోదా శనివారం' సినిమాకు అదిరిపోయే స్పందన వస్తోంది. మధ్యలో కాస్త డౌన్ అయినా రెండో వీకెండ్‌లో ఈ సినిమా సత్తా చాటుతూనే ఉంది. ఇలా సండే అడ్వాంటేజ్‌తో ఇది మళ్లీ కుమ్మేసింది. ఫలితంగా ఈ చిత్రం 11వ రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 1.95 కోట్లు వసూలు చేసింది.

11 రోజుల్లో ఎక్కడ? ఎంతంటే
'సరిపోదా శనివారం'కు తెలుగులో 11 రోజుల్లో భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 13.34 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.46 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 3.54 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.90 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.29 కోట్లు, గుంటూరులో రూ. 1.75 కోట్లు, కృష్ణాలో రూ. 1.74 కోట్లు, నెల్లూరులో రూ. 1.13 కోట్లతో కలిపి.. రూ. 28.15 కోట్లు షేర్, రూ. 46.60 కోట్లు గ్రాస్ వచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే
ఆంధ్రా, తెలంగాణలో భారీ స్థాయిలో రూ. 28.15 కోట్లు కొల్లగొట్టిన 'సరిపోదా శనివారం'.. ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 6.80 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 11.85 కోట్లు రాబట్టింది. ఇలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలూ కలుపుకుని రూ. 46.80 కోట్లు షేర్, రూ. 90 కోట్లు గ్రాస్ వసూలు చేసింది.

మూవీకి టార్గెట్.. లాభం ఇలా
క్రేజీ కాంబోలో రూపొందిన 'సరిపోదా శనివారం' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 41 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 42 కోట్లుగా నమోదైంది. ఇక, 11 రోజుల్లో దీనికి రూ. 46.80 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 4.80 కోట్లు లాభాలు కూడా సొంతం అయ్యాయి.


Click it and Unblock the Notifications











