Saripodha Sanivaaram 12 Days Collections: నాని వీర కుమ్ముడు.. లాభాలతో నయా రికార్డు.. మొత్తం ఎంతంటే!
సహజసిద్ధమైన నటనతో పాటు విభిన్నమైన సినిమాలు చేస్తూ తెలుగు సినిమా పరిశ్రమలో తనదైన మార్కును చూపిస్తూ దూసుకుపోతోన్నాడు నేచురల్ స్టార్ నాని. ఇలా డిఫరెంట్ జోనర్లలో మూవీలు చేస్తూ రేంజ్‌ను పెంచుకుంటున్నాడు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో యమా ఫామ్‌లో ఉన్న నాని ఇటీవలే 'సరిపోదా శనివారం' అనే సినిమాతో వచ్చాడు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ చిత్రం భారీ రెస్పాన్స్‌ను అందుకుంటోంది. ఫలితంగా భారీ వసూళ్లను సాధిస్తోంది. ఈ నేపథ్యంలో నాని 'సరిపోదా శనివారం' 12 రోజుల వసూళ్లను మీరే చూడండి మరి!
డిఫరెంట్ యాక్షన్‌తో వచ్చాడు
నేచురల్ స్టార్ నాని హీరోగా.. వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన సినిమానే 'సరిపోదా శనివారం'. ఈ మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించగా.. ఎస్‌జే సూర్య విలన్ పాత్రను చేశారు. అలాగే, అభిరామి, అదితి బాలన్, మురళీ శర్మ నటించారు. ఈ మూవీని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై దానయ్య నిర్మించారు. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు.

నాని మూవీ బిజినెస్ వివరాలు
నాని నటించిన 'సరిపోదా శనివారం'కు నైజాంలో రూ. 12.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 5.00 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 12.50 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 30 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకట ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 5.00 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6 కోట్లకు అమ్ముడైంది. ఇలా ఇది ప్రపంచ వ్యాప్తంగా రూ. 41 కోట్ల బిజినెస్ జరుపుకుంది.
12వ రోజు ఇలా.. మొత్తం అలా
టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో నేచురల్ స్టార్ నాని చేసిన 'సరిపోదా శనివారం' సినిమాకు మంచి స్పందన వస్తోంది. మధ్యలో కాస్త డౌన్ అయినా రెండో వీకెండ్‌లో ఈ సినిమా సత్తా చాటింది. అయితే, 12వ రోజు వర్కింగ్ డే కావడంతో మళ్లీ పడిపోయింది. ఫలితంగా ఈ చిత్రం 12వ రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 40 లక్షలు, వరల్డ్ వైడ్‌గా రూ. 55 లక్షలే వసూలు చేసుకుంది.


Click it and Unblock the Notifications











