Saripodha Sanivaaram 14 Days Collections: 42 కోట్ల బిజినెస్.. 2 వారాల్లో ఊహించనంత.. లాభంతో నాని రికార్డు
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో వేగంగా సినిమాలు చేసే హీరోలు అతి తక్కువ మందే ఉన్నారు. అందులో కొందరు మాత్రమే మంచి చిత్రాలతో విజయాలను సొంతం చేసుకుంటున్నారు. అలాంటి వారిలో నేచురల్ స్టార్ నాని ఒకడు. ఈ మధ్య కాలంలో ఫుల్ ఫామ్‌లో ఉన్న అతడు.. ఇటీవలే 'సరిపోదా శనివారం' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి ఆరంభం నుంచే అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఫలితంగా ఈ సినిమా అదిరిపోయే కలెక్షన్లను సొంతం చేసుకుంటోంది. మరి నాని 'సరిపోదా శనివారం' 14 రోజుల వసూళ్లను మీరే చూడండి మరి!
యాక్షన్ స్టోరీతో వచ్చిన నాని
నేచురల్ స్టార్ నాని హీరోగా.. వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన సినిమానే 'సరిపోదా శనివారం'. ఈ మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించగా.. ఎస్‌జే సూర్య విలన్ పాత్రను చేశారు. అలాగే, అభిరామి, అదితి బాలన్, మురళీ శర్మ నటించారు. ఈ మూవీని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై దానయ్య నిర్మించారు. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు.

నాని మూవీ బిజినెస్ వివరాలు
నాని హీరోగా నటించిన 'సరిపోదా శనివారం'కు నైజాంలో రూ. 12.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 5.00 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 12.50 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 30 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకట ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 5.00 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6 కోట్లకు అమ్ముడైంది. ఇలా ఇది ప్రపంచ వ్యాప్తంగా రూ. 41 కోట్ల బిజినెస్ చేసింది.
14వ రోజు ఇలా.. మొత్తం అలా
క్రియేటివ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో నేచురల్ స్టార్ నాని చేసిన 'సరిపోదా శనివారం' సినిమాకు ఆరంభం నుంచే మంచి స్పందన వస్తోంది. మధ్యలో కాస్త డౌన్ అయినా రెండో వీకెండ్‌లో ఈ సినిమా సత్తా చాటింది. అయితే, 14వ రోజు వర్కింగ్ డే కావడంతో మళ్లీ తగ్గింది. ఫలితంగా ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ. 35 లక్షలు, వరల్డ్ వైడ్‌గా రూ. 40 లక్షలే వసూలు చేసింది.


Click it and Unblock the Notifications











