Saripodha Sanivaaram 15 Days Collections: నాని సినిమాకు కోట్ల వర్షం.. 15 రోజుల్లో ఎంత వచ్చిందో తెలిస్తే!
టాలీవుడ్‌లో ఎంతో మంది హీరోలు ఉన్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే నేచురల్ యాక్టింగ్‌తో సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో టాలెంటెడ్ గాయ్ నాని ఒకడు. డిఫరెంట్ జోనర్లలో సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్న అతడు.. విజయాలను అందుకుంటూ రేంజ్ పెంచుకుంటున్నాడు. ఈ జోష్‌లోనే ఇటీవలే నాని 'సరిపోదా శనివారం' అనే చిత్రంతో వచ్చాడు. దీనికి భారీ స్థాయిలో స్పందన కూడా లభిస్తోంది. ఫలితంగా వసూళ్లు అదిరిపోయేలా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నాని నటించిన 'సరిపోదా శనివారం' 15 రోజుల వసూళ్లను మీరే చూడండి మరి!
డిఫరెంట్ యాక్షన్‌తో వచ్చేసి
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన చిత్రమే 'సరిపోదా శనివారం'. వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన ఈ మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించగా.. ఎస్‌జే సూర్య విలన్ పాత్రను చేశారు. అలాగే, అభిరామి, అదితి బాలన్, మురళీ శర్మ నటించారు. ఈ మూవీని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై దానయ్య నిర్మించారు. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ మ్యూజిక్ ఇచ్చాడు.

నాని మూవీ బిజినెస్ వివరాలు
నేచురల్ స్టార్ నాని 'సరిపోదా శనివారం'కు నైజాంలో రూ. 12.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 5.00 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 12.50 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 30 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకట ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 5.00 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6 కోట్లకు అమ్ముడైంది. ఇలా ఇది ప్రపంచ వ్యాప్తంగా రూ. 41 కోట్ల బిజినెస్ జరిపింది.
15వ రోజు ఇలా.. మొత్తం అలా
టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో నేచురల్ స్టార్ నాని చేసిన 'సరిపోదా శనివారం' సినిమాకు ఆరంభం నుంచే అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తోంది. మధ్యలో కాస్త పడిపోయినా ఈ సినిమా సత్తా చాటుతూనే వస్తోంది. అయితే, 15వ రోజు వర్కింగ్ డే కావడంతో బాగా డౌన్ అయింది. ఫలితంగా ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ. 25 లక్షలు, వరల్డ్ వైడ్‌గా రూ. 30 లక్షలే వసూలు చేసింది.


Click it and Unblock the Notifications











