Saripodha Sanivaaram 17 Days Collections: నాని మరో రికార్డు.. 17 రోజుల్లో కోట్ల సునామీ.. లాభం చూశారంటే!

తెలుగు సినిమా రంగంలోకి ఎలాంటి సపోర్ట్ లేకుండానే వచ్చినా.. తనదైన నటనతో ప్రత్యేకమైన ఇమేజ్‌ను, ఫ్యాన్‌ బేస్‌ను సొంతం చేసుకున్నాడు నేచురల్ స్టార్ నాని. ఇలా చాలా ఏళ్లుగా రేంజ్‌ను పెంచుకుంటూ వెళ్తోన్న అతడు.. ఈ మధ్యన వరుసగా హిట్లు కొడుతోన్నాడు. ఈ ఊపులోనే ఇప్పుడు నాని 'సరిపోదా శనివారం' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి భారీ స్థాయిలో స్పందన కూడా లభిస్తోంది. ఫలితంగా వసూళ్లు అధికంగానే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నాని నటించిన 'సరిపోదా శనివారం' 17 రోజుల వసూళ్లను మీరే చూడండి మరి!

డిఫరెంట్ యాక్షన్ మోడ్‌లో
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో నాని నటించిన చిత్రమే 'సరిపోదా శనివారం'. వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన ఈ మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించగా.. ఎస్‌జే సూర్య విలన్ పాత్రను చేశారు. అలాగే, అభిరామి, అదితి బాలన్, మురళీ శర్మ నటించారు. ఈ మూవీని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై దానయ్య నిర్మించారు. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతాన్ని ఇచ్చాడు.

Nani Starrer Saripodha Sanivaaram Movie 17 Days Worldwide Collections Details

నాని మూవీ బిజినెస్ వివరాలు

నాని హీరోగా చేసిన 'సరిపోదా శనివారం'కు నైజాంలో రూ. 12.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 5.00 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 12.50 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 30 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకట ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 5.00 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6 కోట్లకు అమ్ముడైంది. ఇలా ఇది ప్రపంచ వ్యాప్తంగా రూ. 41 కోట్ల బిజినెస్ చేసుకుంది.

17వ రోజు ఇలా.. మొత్తం అలా
క్రియేటివ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో నేచురల్ స్టార్ నాని చేసిన 'సరిపోదా శనివారం' సినిమాకు ఆరంభం నుంచే అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తోంది. మధ్యలో కాస్త పడిపోయినా వీకెండ్స్‌లో మాత్రం మళ్లీ పుంజుకుంటోంది. ఇలా 17వ రోజు ఈ సినిమా మరింత ఎక్కువగా రెస్పాన్స్ అందుకుంది. ఫలితంగా ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ. 54 లక్షలు షేర్ వసూలు చేసింది.

Nani Starrer Saripodha Sanivaaram Movie 17 Days Worldwide Collections Details

17 రోజుల్లో ఎక్కడ? ఎంతంటే

'సరిపోదా శనివారం'కు తెలుగులో 17 రోజుల్లో భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 14.33 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.76 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 3.81 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.00 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.51 కోట్లు, గుంటూరులో రూ. 1.83 కోట్లు, కృష్ణాలో రూ. 1.82 కోట్లు, నెల్లూరులో రూ. 1.28 కోట్లతో కలిపి.. రూ. 30.34 కోట్లు షేర్, రూ. 50.80 కోట్లు గ్రాస్ వచ్చింది.

Nani Starrer Saripodha Sanivaaram Movie 17 Days Worldwide Collections Details

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే
ఆంధ్రా, తెలంగాణలో భారీ స్థాయిలో రూ. 30.34 కోట్లు కొల్లగొట్టిన 'సరిపోదా శనివారం'.. ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 7.00 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 12.20 కోట్లు రాబట్టింది. ఇలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలూ కలుపుకుని రూ. 49.54 కోట్లు షేర్‌, రూ. 91.90 కోట్లు గ్రాస్ వసూలు చేసింది.

Nani Starrer Saripodha Sanivaaram Movie 17 Days Worldwide Collections Details

మూవీకి టార్గెట్.. లాభం ఇలా

డిఫరెంట్ యాక్షన్‌తో రూపొందిన 'సరిపోదా శనివారం' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 41 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 42 కోట్లుగా నమోదైంది. ఇక, 17 రోజుల్లో దీనికి రూ. 49.54 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 7.54 కోట్లు లాభాలు కూడా సొంతం అయ్యాయి.

More from Filmibeat

Read more about: saripodha sanivaaram movie nani
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X