Saripodha Sanivaaram 19 Days Collections: రెండు 50 కోట్లతో నాని సంచలనం.. సరిపోదాతో టాప్ హీరోగా రికార్డు
టాలీవుడ్‌లో అతి తక్కువ మంది హీరోలు మాత్రమే తమ చిత్రాల్లో సహజసిద్ధమైన నటనను కనబరుస్తూ ప్రేక్షకులను మైమరిస్తున్నారు. అలాంటి వారిలో నేచురల్ స్టార్ నాని ఒకడు. పక్కా కమర్షియల్ హీరోగా మారిన తర్వాత యమా ప్రయోగాలు చేస్తోన్న అతడు.. ఈ మధ్యన వరుసగా విజయాలను అందుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే నాని 'సరిపోదా శనివారం' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. దీనికి భారీ స్థాయిలో రెస్పాన్స్ లభించడంతో రికార్డులు బ్రేక్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో 'సరిపోదా శనివారం' 19 రోజుల వసూళ్లను మీరే చూడండి!
యాక్షన్ జోనర్‌తో వచ్చిన నాని
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన మూవీనే 'సరిపోదా శనివారం'. వివేక్ ఆత్రేయ రూపొందించిన ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించగా.. ఎస్‌జే సూర్య విలన్ పాత్రను చేశారు. అలాగే, అభిరామి, అదితి బాలన్, మురళీ శర్మ నటించారు. ఈ మూవీని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై దానయ్య నిర్మించారు. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ మ్యూజిక్ ఇచ్చాడు.

నాని మూవీ బిజినెస్ వివరాలు
నాని నటించిన 'సరిపోదా శనివారం'కు నైజాంలో రూ. 12.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 5.00 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 12.50 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 30 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకట ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 5.00 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6 కోట్లకు అమ్ముడైంది. ఇలా ఇది ప్రపంచ వ్యాప్తంగా రూ. 41 కోట్ల బిజినెస్ జరుపుకుంది.
19వ రోజు ఇలా.. మొత్తం అలా
టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో నేచురల్ స్టార్ నాని చేసిన 'సరిపోదా శనివారం' సినిమాకు మొదటి నుంచే మంచి రెస్పాన్స్ లభిస్తోంది. మధ్యలో కాస్త పడిపోయినా వీకెండ్స్‌లో మాత్రం మళ్లీ పుంజుకుంది. అయితే, 19వ రోజు ఈ సినిమా వర్కింగ్ డే అవడంతో డౌన్ అయింది. ఫలితంగా ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ. 22 లక్షలు షేర్ వసూలు చేసింది.

19 రోజుల్లో ఎక్కడ? ఎంతంటే
19 రోజుల్లో 'సరిపోదా శనివారం'కు తెలుగులో భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 14.75 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.86 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 3.90 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.03 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.57 కోట్లు, గుంటూరులో రూ. 1.85 కోట్లు, కృష్ణాలో రూ. 1.84 కోట్లు, నెల్లూరులో రూ. 1.34 కోట్లతో కలిపి.. రూ. 31.14 కోట్లు షేర్, రూ. 52.60 కోట్లు గ్రాస్ వచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే
ఆంధ్రా, తెలంగాణలో రికార్డు స్థాయిలో రూ. 31.14 కోట్లు కొల్లగొట్టిన 'సరిపోదా శనివారం'.. ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 7.12 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 12.30 కోట్లు రాబట్టింది. ఇలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలూ కలుపుకుని రూ. 50.56 కోట్లు షేర్, రూ. 100 కోట్లు గ్రాస్ వసూలు చేసింది.

మూవీకి టార్గెట్.. లాభం ఇలా
'సరిపోదా శనివారం' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 41 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 42 కోట్లుగా నమోదైంది. ఇక, 19 రోజుల్లో దీనికి రూ. 50.56 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 8.56 కోట్లు లాభాలు కూడా సొంతం అయ్యాయి. ఇదిలా ఉండగా.. రెండు సార్లు రూ. 50 కోట్లు షేర్ మార్కును దాటిన ఏకైక టైర్ 2 హీరోగా నాని సంచలన రికార్డును నమోదు చేసుకున్నాడు.


Click it and Unblock the Notifications











