Saripodha Sanivaaram 2 Days Collections: మళ్లీ కుమ్మేసిన నాని.. 2వ రోజు ఊహించని విధంగా!
అసలు ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినా.. తనదైన టాలెంట్లతో చాలా తక్కువ సమయంలోనే స్టార్‌గా మారిపోయాడు నాని. మొదట్లో చిన్న చిన్న సినిమాలు చేసిన అతడు.. కమర్షియల్ హీరోగా మారిన తర్వాత భారీ చిత్రాలతో వస్తున్నాయి. ఇలా ఇప్పుడు నేచురల్ స్టార్ 'సరిపోదా శనివారం' అనే సినిమాతో అతడు వచ్చేశాడు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమాకు మంచి టాక్ రావడంతో రెస్పాన్స్ కూడా భారీ స్థాయిలో వస్తోది. ఈ నేపథ్యంలో నాని 'సరిపోదా శనివారం' 2 రోజుల్లో ఎంత రాబట్టిందో మీరే చూసేయండి మరి!
సరిపోదా శనివారంతో వచ్చాడు
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన తాజా చిత్రమే 'సరిపోదా శనివారం'. వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన ఈ మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించగా.. ఎస్‌జే సూర్య విలన్ పాత్రను చేశారు. అలాగే, అభిరామి, అదితి బాలన్, మురళీ శర్మ నటించారు. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ మ్యూజిక్ ఇచ్చాడు. ఈ మూవీని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై దానయ్య నిర్మించారు.

నాని మూవీ బిజినెస్ వివరాలు
నాని 'సరిపోదా శనివారం'కు నైజాంలో రూ. 12.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 5.00 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 12.50 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 30 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకట ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 5.00 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6 కోట్లకు అమ్ముడైంది. ఇలా నాని సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 41 కోట్ల బిజినెస్ జరుపుకుంది.
2వ రోజు తెలుగులో ఎంతంటే
'సరిపోదా శనివారం' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో రెండో రోజు బాగానే హోల్డ్ చేసింది. ఫలితంగా నైజాంలో రూ. 1.41 కోట్లు, సీడెడ్‌లో రూ. 48 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 38 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 14 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 13 లక్షలు, గుంటూరులో రూ. 20 లక్షలు, కృష్ణాలో రూ. 19 లక్షలు, నెల్లూరులో రూ. 11 లక్షలతో రూ. 3.04 కోట్లు షేర్, రూ. 5.10 కోట్లు గ్రాస్ వచ్చింది.

2 రోజుల్లో ఎక్కడ? ఎంతంటే
'సరిపోదా శనివారం' మూవీకి తెలుగులో 2 రోజుల్లో భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 4.16 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.22 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.15 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 47 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 45 లక్షలు, గుంటూరులో రూ. 52 లక్షలు, కృష్ణాలో రూ. 60 లక్షలు, నెల్లూరులో రూ. 35 లక్షలతో కలిపి.. రూ. 8.92 కోట్లు షేర్, రూ. 13.95 కోట్లు గ్రాస్ వచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది
ఆంధ్రా, తెలంగాణలో భారీ స్థాయిలో రూ. 8.92 కోట్లు కొల్లగొట్టిన 'సరిపోదా శనివారం'.. ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.15 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 5.65 కోట్లు రాబట్టింది. ఇలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలూ కలుపుకుని రూ. 16.72 కోట్లు షేర్, రూ. 30.70 కోట్లు గ్రాస్ వసూలు చేసింది.
మూవీకి టార్గెట్.. ఎంత రావాలి?
క్రేజీ కాంబోలో రూపొందిన 'సరిపోదా శనివారం' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 41 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 42 కోట్లుగా నమోదైంది. ఇక, 2 రోజుల్లో దీనికి రూ. 16.72 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 25.28 కోట్లు రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది.


Click it and Unblock the Notifications











