Saripodha Sanivaaram 7 Days Collections: 42 కోట్లు రావాలి.. వారంలో షాకింగ్‌గా.. నానికి హిట్ కావాలంటే!
విలక్షణమైన నటనతో పాటు విభిన్నమైన సినిమాలు చేస్తూ తెలుగు సినిమా రంగంలో నేచురల్ స్టార్‌గా దూసుకుపోతోన్నాడు నాని. ఆరంభం నుంచీ వైవిధ్యాన్ని చూపిస్తోన్న అతడు.. మంచి ఫలితాలను రాబడుతున్నాడు. ఇలా ఇప్పుడు ఫుల్ ఫామ్‌తో దూసుకుపోతోన్నాడు. ఈ ఉత్సాహంలోనే ఇప్పుడు 'సరిపోదా శనివారం' అనే సినిమాను చేశాడు. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం అదిరిపోయే రెస్పాన్స్‌ను రాబడుతోంది. ఫలితంగా అత్యధిక వసూళ్లను అందుకుంటోంది. ఈ నేపథ్యంలో నాని 'సరిపోదా శనివారం' 2 రోజుల్లో ఎంత రాబట్టిందో మీరే చూసేయండి!
మరో విభిన్నమైన కథతో ఎంట్రీ
నేచురల్ స్టార్ నాని హీరోగా.. వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన సినిమానే 'సరిపోదా శనివారం'. ఈ మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించగా.. ఎస్‌జే సూర్య విలన్ పాత్రను చేశారు. అలాగే, అభిరామి, అదితి బాలన్, మురళీ శర్మ నటించారు. ఈ మూవీని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై దానయ్య నిర్మించారు. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు.

నాని మూవీ బిజినెస్ వివరాలు
'సరిపోదా శనివారం' సినిమాకు నైజాంలో రూ. 12.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 5.00 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 12.50 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 30 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకట ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 5.00 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6 కోట్లకు అమ్ముడైంది. ఇలా నాని సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 41 కోట్ల బిజినెస్ చేసింది.
7వ రోజు ఇలా.. మొత్తం అలా
వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని నటించిన 'సరిపోదా శనివారం' సినిమాకు మంచి స్పందన వస్తోంది. అయితే, ఏడో రోజు మాత్రం ఇది ఒక్కసారిగా డౌన్ అయింది. ఫలితంగా ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ. 70 లక్షలు వసూలు చేసింది. మిగిలిన అన్ని ప్రాంతాల్లో కలిపి రూ. 1.10 కోట్లు రాబట్టింది. ఇలా వారంలో ఈ చిత్రం రూ. 38.80 కోట్లతో హిట్‌కు చేరువైంది.


Click it and Unblock the Notifications











