Saripodha Sanivaaram Day 1 Collections: నాని మాస్ బ్యాటింగ్.. తొలి రోజు కోట్ల సునామీ.. తెలుగులోనే అంతా!
తెలుగు చిత్ర పరిశ్రమలో కొందరు హీరోలు మాత్రమే ఫ్యాన్ వార్స్‌కు దూరంగా ఉంటూ అందరివాళ్లలా ఉంటున్నారు. అలాంటి వారిలో నేచురల్ స్టార్ నాని ఒకడు. తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తోన్న అతడు.. స్టోరీల ఎంపికలోనూ వైవిధ్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఇలా ఇప్పుడు 'సరిపోదా శనివారం' అనే సినిమాతో అతడు వచ్చేశాడు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమాకు అదిరిపోయే టాక్ వచ్చింది. దీంతో రెస్పాన్స్ కూడా భారీ స్థాయిలో లభించింది. ఈ నేపథ్యంలో నాని 'సరిపోదా శనివారం' మొదటి రోజు ఎంత రాబట్టిందో మీరే చూసేయండి!
విభిన్నమైన కథతో వచ్చేశారు
నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన చిత్రమే 'సరిపోదా శనివారం'. ఈ మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించగా.. ఎస్‌జే సూర్య విలన్ పాత్రను చేశారు. అలాగే, అభిరామి, అదితి బాలన్, మురళీ శర్మ తదితరులు నటించారు. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ మ్యూజిక్ ఇచ్చాడు. ఈ మూవీని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై దానయ్య నిర్మించారు.

నాని మూవీ బిజినెస్ వివరాలు
'సరిపోదా శనివారం'కు నైజాంలో రూ. 12.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 5.00 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 12.50 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 30 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకట ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 5.00 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6 కోట్లకు అమ్ముడైంది. ఇలా నాని సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 41 కోట్ల బిజినెస్ చేసుకుంది.

అలాంటి టాక్‌తోనే రెస్పాన్స్
ఎన్నో అంచనాల నడుమ రూపొందిన నాని 'సరిపోదా శనివారం' మూవీ గురువారమే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ పాజిటివ్ టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే అంతగా రెస్పాన్స్ భారీ స్థాయిలో వచ్చింది. దీంతో ఈ సినిమాకు అనుకున్న దానికంటే ఓపెనింగ్ డేన అత్యధిక కలెక్షన్లు వస్తాయని విశ్లేషకులు అంచనా వేశారు.

తొలి రోజు ఎంత వచ్చిందంటే
వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని నటించిన 'సరిపోదా శనివారం' సినిమాకు అదిరిపోయే టాక్ రావడంతో మొదటి రోజు ప్రేక్షకుల స్పందన భారీ స్థాయిలో లభించింది. ఫలితంగా ఈ సినిమాకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 8.50 కోట్లు వరకూ షేర్ వచ్చింది. తద్వారా 'దసరా' తర్వాత నాని రెండో అత్యధిక ఓపెనింగ్స్‌ను అందుకున్నట్లు అయింది.


Click it and Unblock the Notifications











