Saripodhaa Sanivaaram: పవన్, చిరంజీవి రికార్డు బ్రేక్ చేసిన నాని.. సరిపోదా శనివారం మరో సంచలనం

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సహజసిద్ధమైన నటనతో మెప్పిస్తూ.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు నేచురల్ స్టార్ నాని. ఇలా చాలా కాలంగా టాలీవుడ్‌లో విభిన్నమైన కాన్సెప్టులతో సినిమాలు చేస్తోన్న అతడు.. ఈ మధ్య కాలంలో వరుసగా హిట్లను అందుకుంటున్నాడు. ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు 'సరిపోదా శనివారం' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాకు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఇక, తాజాగా యూఎస్ గడ్డపై అదిరిపోయే రికార్డును సాధించింది. ఆ సంగతులేంటో మీరే చూసేయండి!

సరిపోదా శనివారంతో నాని
నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ రూపొందించిన సినిమానే 'సరిపోదా శనివారం'. ఈ మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించగా.. ఎస్‌జే సూర్య విలన్ పాత్రను చేశారు. ఈ మూవీని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై దానయ్య నిర్మించారు. అలాగే, అభిరామి, అదితి బాలన్, మురళీ శర్మ తదితరులు నటించారు. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ మ్యూజిక్ ఇచ్చాడు.

Nani Starrer Saripodha Sanivaaram Movie Reaches 1 5 Million Dollar Mark In USA

గ్రాండ్ రిలీజ్.. ఆ టాక్‌తో

యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'సరిపోదా శనివారం' ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాన్ ఇండియా చిత్రం కావడంతో దీన్ని ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 3000లకు పైగా థియేటర్లలో విడుదల చేశారు. ఈ సినిమాను యూనానిమస్‌గా పాజిటివ్ టాక్ వచ్చింది. అందుకు తగ్గట్లుగానే ఈ చిత్రానికి రివ్యూలు కూడా బాగా వచ్చాయి. దీంతో చిత్ర యూనిట్ ఖుషీగా ఉంది.

భారీ రెస్పాన్స్‌తో 50 కొట్టి
'సరిపోదా శనివారం' మూవీకి అమెరికాలోని ప్రీమియర్స్ నుంచే మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇది సత్తా చాటుతూనే ఉంది. ఫలితంగా ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ ఈ సినిమాకు భారీ వసూళ్లు కూడా లభిస్తున్నాయి. ఇలా కేవలం మూడు రోజుల్లోనే ఈ సినిమా రూ. 52 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి సత్తా చాటుకుంది.

Nani Starrer Saripodha Sanivaaram Movie Reaches 1 5 Million Dollar Mark In USA

యూఎస్‌లో మరింతగానే

నేచురల్ స్టార్ నాని హీరోగా చేసిన 'సరిపోదా శనివారం' మూవీపై అంచనాలు భారీగా ఉండడంతో అక్కడ యూఎస్‌లో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. అలా నార్త్ అమెరికాలో టికెట్ల అమ్మకాలు చాలా రోజుల క్రితమే ప్రారంభం అయ్యాయి. అంచనాలకు తగ్గట్లుగానే అక్కడ ఈ చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ కూడా వస్తోంది. దీంతో నాని సినిమా అక్కడ దుమ్ములేపే వసూళ్లు సాధిస్తోంది.

మరో మార్కును దాటేసి
వివేక్ ఆత్రేయతో నాని చేసిన 'సరిపోదా శనివారం' మూవీకి నార్త్ అమెరికాలో భారీ రెస్పాన్స్ లభిస్తోంది. దీంతో ప్రీమియర్స్‌కే ఇది 551K డాలర్లు రాబట్టింది. అలాగే, మొదటి రోజు 318K డాలర్లు, రెండో రోజు 319K డాలర్లు, మూడో రోజు 355K డాలర్లు రాబట్టింది. ఇలా ఇప్పటికే 1.54 మిలియన్ మార్కును చేరింది. తద్వారా ఈ మైలురాయి చేరిన నాని 4వ సినిమా అయింది.

Nani Starrer Saripodha Sanivaaram Movie Reaches 1 5 Million Dollar Mark In USA

పవన్, చిరంజీవి వెనక్కి

'సరిపోదా శనివారం' మూవీ అమెరికాలో ఇప్పటి వరకూ 1.5 మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ వసూలు అయింది. దీంతో టాలీవుడ్‌లో ఎక్కువ సార్లు ఈ మార్కును చేరుకున్న హీరోల లిస్టులో నాని నాలుగో స్థానానికి చేరాడు. ఈ క్రమంలోనే చిరంజీవి, పవన్ కల్యాణ్, విజయ్ దేవరకొండలను వెనక్కి నెట్టాడు. ఈ లిస్టులో మహేశ్ 9, ప్రభాస్ 7, ఎన్టీఆర్ 5 చిత్రాలతో టాప్ 3లో ఉన్నారు.

More from Filmibeat

Read more about: saripodha sanivaaram nani
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X