బుక్ మై షోలో నాని సరికొత్త రికార్డు.. ఈ ఘనత అందుకున్న తొలి హీరోగా సెన్సేషన్
టాలీవుడ్‌లోకి సాదాసీదాగానే వచ్చినా తనదైన నేచురల్ యాక్టింగ్‌తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్‌గా మారిపోయాడు టాలెంటెడ్ గాయ్ నాని. ఆరంభంలో ఓ జోనర్ సినిమాలకే పరిమితం అయిన అతడు.. కమర్షియల్ హీరోగా మారిన తర్వాత పంథాను మార్చుకున్నాడు. ఇలా ఇప్పుడు ఎన్నో ప్రయోగాలు చేస్తూ డిఫరెంట్ మూవీలతో వస్తున్నాడు. దీంతో వరుసగా హిట్లను అందుకుంటూ ఫుల్ ఫామ్‌తో దూసుకుపోతోన్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు 'సరిపోదా శనివారం' మూవీతో వచ్చాడు. ఈ చిత్రం తాజాగా ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఆ వివరాల్లోకి వెళ్తే....
నేచురల్ స్టార్ నాని హీరోగా క్రియేటివ్ యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన చిత్రమే 'సరిపోదా శనివారం'. ఫుల్ లెంగ్త్ యాక్షన్‌తో రూపొందిన ఈ సినిమాపై ఆరంభంలోనే అంచనాలు భారీగా నెలకొన్నాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని హై లెవెల్‌లో తెరకెక్కించారు. ఈ క్రమంలోనే ఆగస్టు 29వ తేదీన ఈ మూవీని వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా విడుదల చేశారు.

క్రేజీ యాక్షన్‌తో రూపొందిన 'సరిపోదా శనివారం' మూవీకి ఆరంభంలోనే పాజిటివ్ టాక్ రావడంతో ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తూనే ఉంది. ఫలితంగా ఈ చిత్రం రికార్డు స్థాయిలో వసూళ్లను తెచ్చుకుంటోంది. ఇలా ఇప్పటికే రూ. 60 కోట్లకు పైగా గ్రాస్‌ను సైతం వసూలు చేసింది. అదే సమయంలో హిట్ స్టేటస్‌కు చేరువగా కూడా వచ్చేసింది.
వివేక్ ఆత్రేయ - నాని కాంబినేషన్‌లో రూపొందిన 'సరిపోదా శనివారం' చిత్రానికి బుక్ మై షో యాప్ లేదా వెబ్‌సైట్‌లో ఎవరూ ఊహించని రీతిలో అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఒకవైపు వర్షాలు, వరదలు వస్తున్నా ఈ సినిమా టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఫలితంగా ఈ చిత్రం బుక్ మై షో ద్వారా 1 మిలియన్ టికెట్లు మార్కును చేరుకుంది.

డిఫరెంట్ కాన్సెప్టుతో రూపొందిన 'సరిపోదా శనివారం' సినిమాకు సంబంధించి బుక్ మై షోలో 1 మిలియన్ అంటే 10 లక్షల టికెట్లు అమ్ముడుపోయాయి. తద్వారా వేగంగా ఈ మార్కును చేరుకున్న టైర్ 2 హీరో చిత్రంగా 'సరిపోదా శనివారం' చరిత్రను సృష్టించింది. దీంతో మరోసారి నాని పేరు టాలీవుడ్‌లో మారిమ్రోగిపోతోంది.
ఇదిలా ఉండగా.. 'సరిపోదా శనివారం' మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించగా.. ఎస్‌జే సూర్య విలన్ పాత్రను చేశారు. ఈ మూవీని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై దానయ్య నిర్మించారు. అలాగే, అభిరామి, అదితి బాలన్, మురళీ శర్మ తదితరులు నటించారు. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు.


Click it and Unblock the Notifications











