Saripodha Sanivaaram: పరాయి దేశంలో నాని సంచలనం.. విజయ్ దేవరకొండ రికార్డు బ్రేక్
తెలుగు సినిమా రంగంలో చాలా మంది హీరోలు ఉన్నా.. అందులో కొందరు మాత్రమే మినిమమ్ గ్యారెంటీ సినిమాలతో సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో నేచురల్ స్టార్ నాని ఒకడు. డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీలతో ప్రేక్షకుల ముందుకు వస్తోన్న అతడు.. ఇటీవలి కాలంలో వరుసగా హిట్లను అందుకున్నాడు. ఈ ఊపులోనే ఇప్పుడు 'సరిపోదా శనివారం' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా తాజాగా యూఎస్ గడ్డపై అదిరిపోయే రికార్డును నమోదు చేసింది. ఆ సంగతులేంటో మీరే చూసేయండి!
సరిపోదా శనివారం అంటూ
నేచురల్ స్టార్ నాని - వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో రూపొందిన 'సరిపోదా శనివారం' మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించగా.. ఎస్‌జే సూర్య విలన్ పాత్రను చేశారు. ఈ మూవీని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై దానయ్య నిర్మించారు. అలాగే, అభిరామి, అదితి బాలన్, మురళీ శర్మ తదితరులు నటించారు. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు.

నాని కెరీర్‌లో భారీగా రిలీజ్
యాక్షన్ బ్యాగ్‌డ్రాప్‌తో రూపొందిన 'సరిపోదా శనివారం' తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాన్ ఇండియా చిత్రం కావడంతో దీన్ని ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 3000లకు పైగా థియేటర్లలో విడుదల చేశారు. ఇప్పటికే యూఎస్ సహా తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో షోలు ప్రదర్శితం అయిపోయాయి. దీంతో అంతటా నేచురల్ స్టార్ నాని మేనియా ఉంది.
ఆరంభంలో అలాంటి టాక్
'సరిపోదా శనివారం' మూవీకి అమెరికాలోని ప్రీమియర్స్ నుంచే మంచి టాక్ వచ్చింది. అయితే, తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉంటుందో అని అంతా అనుకున్నారు. కానీ, ఇక్కడ కూడా దీనికి పాజిటివ్ టాక్ సొంతం అయింది. ఫలితంగా ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ దక్కడంతో థియేటర్లు కళకళలాడిపోతున్నాయి.

యూఎస్‌లో ఎక్కువ స్క్రీన్లు
నేచురల్ స్టార్ నాని నటించిన 'సరిపోదా శనివారం' మూవీపై ఊహించని రీతిలో బజ్ ఏర్పడింది. దీంతో అక్కడ దీన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. అలా నార్త్ అమెరికాలో టికెట్ల అమ్మకాలు చాలా రోజుల క్రితమే ప్రారంభం అయ్యాయి. అంచనాలకు తగ్గట్లుగానే అక్కడ ఈ చిత్రానికి దిమ్మతిరిగే రెస్పాన్స్ కూడా వస్తోంది. దీంతో అప్పుడే కలెక్షన్లను కూడా భారీగానే వసూలు చేసింది.
అప్పుడే ఆ మార్క్ దాటేసి
వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని నటించిన 'సరిపోదా శనివారం' మూవీ అమెరికా హక్కులను ప్రత్యంగిరా సినిమాస్ సంస్థ భారీ ధరకు సొంతం చేసుకుంది. దీంతో ఈ మూవీ బుకింగ్స్ విడుదల కంటే ముందుగానే ప్రారంభం అయ్యాయి. ఫలితంగా యూఎస్‌లో ప్రీమియర్స్ ద్వారా ఈ సినిమాకు హాఫ్ మిలియన్ డాలర్లు (500K) వసూలు అయినట్లు అధికారికంగా తెలిపారు.

విజయ్ దేవరకొండ వెనక్కే
'సరిపోదా శనివారం' మూవీ అమెరికాలో ప్రీమియర్స్ ద్వారానే 505k డాలర్లకు పైగా గ్రాస్ వసూలు అయింది. దీంతో టాలీవుడ్‌లోని టైర్ 2 హీరోల జాబితాలో విజయ్ దేవరకొండ 'లైగర్' (504K డాలర్లు)ను నేచురల్ స్టార్ దాటేశాడు. ఇదే కంటిన్యూ అయితే టాప్ ప్లేస్‌లో ఉన్న 'దసరా' రికార్డును కూడా నాని బద్దలు కొట్టేసే అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు.


Click it and Unblock the Notifications











