twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Tuck Jagadish Profits: బాక్సాఫీస్ వద్ద కూడా ఈ రేంజ్‌లో లాభాలు వచ్చేవి కావు.. నాని సేఫ్ బిజినెస్!

    |

    నేచురల్ స్టార్ నాని నటించిన టక్ జగదీష్ సినిమా డైరెక్ట్ గా అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన విషయం తెలిసిందే. అయితే సినిమాను మొదట థియేటర్లోనే విడుదల చేయాలని చిత్ర యూనిట్ సభ్యులు ఎన్నో ప్రణాళికలు రచించారు. కానీ కరోనాతో పాటు ఆంధ్రప్రదేశ్ లో థియేటర్స్ టికెట్ల రేట్లు వంటి పరిస్థితులు ఏమాత్రం అనుకూలించకపోవడంతో నిర్మాతలు ధైర్యం చేయలేకపోయారు. మధ్యలో ఎగ్జిబిటర్లు నుంచి అభ్యంతరాలు వచ్చినప్పటికీ కూడా ఓటీటీలోకి ధైర్యం చేసి అడుగులు వేశారు.

    అయితే అలా చేయడమే మంచిది అయ్యింది అంటూ కొన్ని కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఎందుకంటే సినిమా అంతగా నచ్చలేదని థియేటర్ లోకి వచ్చి ఉంటే చాలా ఎక్కువగా నష్టపోయేదని కూడా అంటున్నారు. మొత్తంగా సినిమా బిజినెస్ ఎలా ఉంది అనే విషయంలోకి వెళితే నిర్మాతలకు మంచి ప్రాఫిట్స్ దక్కినట్లు తెలుస్తోంది.

    నాని బాక్సాఫీస్ రిజల్ట్

    నాని బాక్సాఫీస్ రిజల్ట్

    నాని గత కొంత కాలంగా బాక్సాఫీసు వద్ద అయితే సరైన విజయాన్ని అందుకోలేదు. 2017 లో మిడిల్ క్లాస్ అబ్బాయి అనంతరం నాని ఎక్కువగా కమర్షియల్ విజయాన్ని అందుకోలేదుమ్ ఆ తరువాత వచ్చిన కృష్ణార్జున యుద్ధం దేవదాస్, జెర్సీ, గ్యాంగ్ లీడర్ సినిమాలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ బాక్సాఫీసు వద్ద మాత్రం గతంలో మాదిరిగా నిర్మాతలకు లాభాలు మాత్రం పెద్దగా ఇవ్వలేదు. జెర్సీ సినిమా అందలో చాలా ప్రత్యేకం అని చెప్పవచ్చు.

    నాన్ థియేట్రికల్ గానే లాభాలు

    నాన్ థియేట్రికల్ గానే లాభాలు

    అయితే కరోనా లాక్ డౌన్ అనంతరం థియేటర్ బిజినెస్ బాగా తగ్గిపోవడం వలన చాలా సినిమాలు ఓటీటీ లోకి వచ్చాయి. ఇక మధ్యలో కొన్ని సినిమాలు ధైర్యం చేసి నమ్మకంతో బాక్సాఫీసు ముందు పోటీ పడ్డాయి. ఇక నాని V సినిమాను నిర్మాత దిల్ రాజు థియేట్రికల్ గా విడుదల చేయడం ఇష్టం లేక అమెజాన్ ప్రైమ్ కు భారీ ధరకు అమ్మేశాడు. ఒక విధంగా సినిమా పెట్టిన పెట్టుబడినికి నాన్ థియేట్రికల్ గానే లాభాలను అందించింది. రీసెంట్ గా విడుదలైన టక్ జగదీష్ సినిమా కూడా మంచి లాభాలను అందించింది.

     బడ్జెట్ ఎంత?

    బడ్జెట్ ఎంత?

    టక్ జగదీష్ సినిమా కోసం దాదాపు 34 కోట్ల వరకు ఖర్చు అయినట్లు సమాచారం. ఇక అమెజాన్ ప్రైమ్ ఈ సినిమాను మొత్తం 37 కోట్లకు కొనుగోలు చేసింది. అమెజాన్ ప్రైమ్ మిగతా డీలింగ్స్ ను కూడా కలుపుకొని మొత్తంగా 40 కోట్లకు దక్కించుకోవాలని అనుకున్నారు. కానీ శాటిలైట్ హిందీ డబ్బింగ్ ఇవ్వడానికి నిర్మాతలు సిద్ద పడలేదు. డిమాండ్ ను బట్టి వారు బయట మరొక రేటుకు అమ్ముకున్నారు.

    మొత్తం ప్రాఫిట్స్ ఎంతంటే?

    మొత్తం ప్రాఫిట్స్ ఎంతంటే?

    ఇక ప్రత్యేకంగా శాటిలైట్ హక్కులను బయట అమ్ముకోవడంతో నిర్మాతలకు మరొక 7.5 కోట్లు లాభంగా వచ్చాయి. ఆడియో రైట్స్ ద్వారా మరొక రెండు కోట్లు రాగా హిందీ డబ్బింగ్ రైట్స్ ద్వారా ఐదు కోట్లు లాభం వచ్చింది. మొత్తంగా ఈ సినిమా యాభై 51.5 కోట్ల వరకు బిజినెస్ చేసింది. అంటే 34 కోట్ల బడ్జెట్ పెడితే ఆ పెట్టుబడికి నిర్మాతలకు 17 కోట్ల వరకు లాభం వచ్చింది. ఒక విధంగా ఎక్కువ రిస్కు చేయకుండా నిర్మాతలు తెలివైన బిజినెస్ చేసుకునే ప్రాఫిట్ జోన్ లోకి వచ్చారు.

    English summary
    Nani Tuck Jagadish total bussiness and Profits
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X