1660 కోట్ల బడ్జెట్.. ఇండియాలో 5 కోట్ల కలెక్షన్లు.. హిస్టరీలోనే డిజాస్టర్‌గా నిలిచిన మూవీ ఎంటో తెలుసా?

ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలతో రిలీజైన హాలీవుడ్ చిత్రాల్లో నెపోలియన్ ఒకటి. జోక్వైన్ ఫోనికస్, వెనెస్సా కిర్బీ, తాహర్ రహిమ్ నటించిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ యాపిల్ నిర్మించింది. ఈ సినిమాను ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ సోనితో కలిపి యాపిల్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూట్ చేసింది. ఇండియా, యూఎస్ఏ, వరల్డ్ వైడ్‌గా పలు దేశాల్లో రిలీజైన ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఎంత వసూలు చేసిందనే వివరాల్లోకి వెళితే..

ప్రపంచ చరిత్రలో ముఖ్యమైన ఘట్టంగా భావించే నెపోలియన్ బోనాపార్టీ కథ నేపథ్యంగా నెపోలియన్ సినిమాను భారీ వ్యయంతో తెరకెక్కించారు. హిస్టారికల్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో నెపోలియన్‌గా జాక్విన్ ఫోనిక్స్, జోస్‌పైన్‌గా వెన్నేసా కిర్బీ నటించారు. రిడ్లీ స్కాట్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

Napoleon movie Closing Collections worldwide: Ridley Scotts cinema heading disaster

చరిత్రాత్మక చిత్రంగా రూపొందిన నెపోలియన్ సినిమాను 1660 కోట్ల (200 మిలియన్ డాలర్లు) రూపాయలతో నిర్మించారు. ఈ సినిమాను సోని నిర్మాణ సంస్థ రూపొందించింది. ఈ సినిమా హక్కులను కూడా సోని టెలివిజన్ దక్కించుకొన్నది. దాంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. కనీసం 500 మిలియన్ డాలర్లు వసూలు చేయాల్సి వచ్చింది.

ఇండియన్ బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలతో రిలీజైన నెపోలియన్ సినిమా పేలవంగా కలెక్షన్లను ప్రారంభించింది. తొలి రోజు కేవలం 1 కోటి రూపాయలు, రెండో రోజు 1.25 కోట్ల రూపాయలు, మూడో రోజు 1.25 కోట్ల రూపాయలు, నాలుగో రోజు 6 లక్షల రూపాయలు, ఐదో రోజు 55 లక్షల రూపాయలు మాత్రమే వసూలు చేసింది. ఇక ఆరో రోజు 50 లక్షలు, ఏడో రోజు 40 లక్షలు మాత్రమే వసూలు చేసింది.

Napoleon movie Closing Collections worldwide: Ridley Scotts cinema heading disaster

ఇండియాలో తొలివారం తర్వాత నెపోలియన్ సినిమాకు ఆదరణ కనిపించకపోవడంతో థియేటర్ల నుంచి ఎత్తేశారు. దాంతో ఈ సినిమా థియేట్రికల్ రన్‌లో కేవలం 5.5 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేసింది. దాంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్‌ను సొంతం చేసుకొన్నది.

ఇక నెపొలియన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ మూవీ అమెరికాలో 36 మిలియన్ డాలర్లు, ఓవర్సీస్‌లో 47 మిలియన్ డాలర్లుతో మొత్తంగా 83 మిలియన్ డాలర్లు కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమాపై వచ్చిన ప్రతికూల రివ్యూల కారణంగా భారీగా కలెక్షన్లు సాధించలేకపోయిందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X