Prathinidhi 2 Movie 2 Days Collections: నారా రోహిత్‌కు దెబ్బ.. 2 రోజులకు కలిపినా.. హిట్ కావాలంటే!

టాలీవుడ్‌లో కొందరు హీరోలు నటనలోనూ, సినిమాల ఎంపికలోనూ వైవిధ్యాన్ని చూపిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. అలాంటి వారిలో నారా వారి అబ్బాయి రోహిత్ ఒకడు. ఆరంభం నుంచీ ఇదే పంథాను ఫాలో అవుతోన్న అతడు.. గతంలో 'ప్రతినిధి' అంటూ వచ్చి సక్సెస్ సాధించాడు.

ఇప్పుడు దానికి సీక్వెల్‌గా రూపొందిన మూవీనే 'ప్రతినిధి 2'. పొలిటికల్ బ్యాగ్‌డ్రాప్‌తో తెరకెక్కిన ఈ చిత్రం డీసెంట్ టాక్ తెచ్చుకున్నా వసూళ్లను అంతగా రాబట్టలేకపోతోంది. ఈ నేపథ్యంలో నారా రోహిత్ 'ప్రతినిధి 2' 2 రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూడండి!

Nara Rohit Starrer Prathinidhi 2 Movie 2 Days Worldwide Collections Details

ఓటు విలువ చెప్పే కథతోనే
నారా రోహిత్ హీరోగా.. మూర్తి దేవగుప్తపు తెరకెక్కించిన సందేశాత్మక సినిమానే 'ప్రతినిధి 2'. ఈ మూవీని వానర ఎంటర్‌టైన్‌మెంట్స్, రానా ఆర్ట్స్ బ్యానర్లపై కుమార్ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, సురేంద్రనాథ్‌లు నిర్మించారు. దీనికి మహతీ స్వర సాగర్ మ్యూజిక్ ఇచ్చాడు. ఇందులో ఉదయభాను, సచిన్ ఖేడ్కర్, రఘుబాబు, జిస్సూ సేన్‌గుప్తాలు నటించారు.

నారా రోహిత్ మూవీ బిజినెస్

చాలా రోజులుగా సినిమాలు చేయని నారా రోహిత్ మళ్లీ తనదైన మార్కును చూపించాలని చేసిన చిత్రమే 'ప్రతినిధి 2'. దీంతో ఈ చిత్రంపై అందరిలో ఆసక్తి ఏర్పడింది. ఫలితంగా అంచనాలను భారీ స్థాయిలో పెంచుకుంది. తద్వారా మంచి డిమాండ్‌ను ఏర్పరచుకుని భారీ బిజినెస్‌ను చేసుకుంది. ఇలా ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ. 3.00 కోట్లు వ్యాపారం జరుపుకుంది.

Nara Rohit Starrer Prathinidhi 2 Movie 2 Days Worldwide Collections Details

2వ రోజు తెలుగులో ఎంత?
గతంలో వచ్చి హిట్ అయిన 'ప్రతినిధి' చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన 'ప్రతినిధి 2' మూవీకి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అందుకు తగ్గట్లే మొదటి రోజు ఇది తక్కువ వసూళ్లనే రాబట్టింది. ఇక, రెండో రోజు కూడా సరైన రెస్పాన్స్‌ను అందుకోలేదు. ఫలితంగా ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో రెండో రోజు రూ. 25 లక్షలు షేర్‌తో పాటు రూ. 45 లక్షలు గ్రాస్ వచ్చింది.

2 రోజుల్లో తెలుగులో ఇలా

నారా రోహిత్ హీరోగా.. జర్నలిస్ట్ మూర్తి దేవగుప్తపు రూపొందించిన చిత్రం కావడంతో 'ప్రతినిధి 2'పై అందరిలోనూ ఆసక్తి వచ్చింది. కానీ, ఇది థియేటర్లకు ప్రేక్షకులను రప్పించలేకపోతోంది. ఫలితంగా రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిసి నారా రోహిత్ సినిమాకు రూ. 55 లక్షలు షేర్, రూ. 1.00 కోట్లు గ్రాస్ మాత్రమే వసూలు అయినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

Nara Rohit Starrer Prathinidhi 2 Movie 2 Days Worldwide Collections Details

ప్రపంచ వ్యాప్తంగా అలా
నారా రోహిత్ హీరోగా నటించిన 'ప్రతినిధి 2' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 2 రోజుల్లో రూ. 55 లక్షలు షేర్ వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలిపి రూ. 15 లక్షలు మాత్రమే వసూలు చేసింది. వీటితో కలిపి రెండు రోజుల్లో ఈ చిత్రానికి రూ. 70 లక్షలు షేర్‌తో పాటు రూ. 1.30 లక్షలు గ్రాస్ మాత్రమే వసూలు అయింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?

ఓటు విలువ చెప్పే కథతో రూపొందిన 'ప్రతినిధి 2' సినిమాకు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 3.00 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 3.50 కోట్లుగా నమోదైంది. ఇక, 2 రోజుల్లో రోహిత్ సినిమాకు రూ. 70 లక్షలు వచ్చాయి. అంటే మరో రూ. 2.80 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్‌గా నిలుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X