Prathinidhi 2 Movie 4 Days Collections: నారా రోహిత్‌కు షాక్.. 4 రోజుల్లో ఘోరంగా.. హిట్ అవుతుందా అంటే!
తెలుగు సినిమాల్లో సీక్వెల్స్ ట్రెండ్ కనిపిస్తోంది. గతంలో వచ్చి ప్రేక్షకుల మెప్పును పొందిన ఎన్నో చిత్రాలకు ఇప్పుడు కొనసాగింపుగా మూవీలను చేస్తున్నారు. అలా ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో మూవీ ఆడియెన్స్‌ను అలరించేందుకు వచ్చింది. అదే నారా రోహిత్ నటించిన 'ప్రతినిధి 2'. ఓటు విలువను చాటి చెప్పే కథాంశంతో రూపొందిన ఈ చిత్రం ఆశించిన రీతిలో రెస్పాన్స్‌ను అందుకోవడం లేదు. ఫలితంగా వసూళ్లు డౌన్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో నారా రోహిత్ 'ప్రతినిధి 2' 4 రోజుల్లో ఎంత వసూలు చేసిందో చూడండి!
సందేశాత్మక కథతో వచ్చింది:నారా రోహిత్ హీరోగా నటించిన చిత్రమే 'ప్రతినిధి 2'. మూర్తి దేవగుప్తపు తెరకెక్కించిన ఈ సందేశాత్మక మూవీని వానర ఎంటర్‌టైన్‌మెంట్స్, రానా ఆర్ట్స్ బ్యానర్లపై కుమార్ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, సురేంద్రనాథ్‌లు నిర్మించారు. ఇందులో ఉదయభాను, సచిన్ ఖేడ్కర్, రఘుబాబు, జిస్సూ సేన్‌గుప్తాలు నటించారు. దీనికి మహతీ స్వర సాగర్ మ్యూజిక్ ఇచ్చాడు.

నారా రోహిత్ మూవీ బిజినెస్:ఈ మధ్య కాలంలో సినిమాలకు దూరంగా ఉంటోన్న నారా రోహిత్ సరైన హిట్ కొట్టాలని చేసిన చిత్రమే 'ప్రతినిధి 2'. దీంతో ఈ సినిమాపై అందరిలో ఆసక్తి పెరిగిపోయింది. ఫలితంగా అంచనాలను భారీ స్థాయిలో ఏర్పరచుకుంది. తద్వారా మంచి డిమాండ్‌ను కూడా పెంచుకుని భారీ బిజినెస్‌ను చేసుకుంది. ఇలా ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ. 3.00 కోట్లకు అమ్మడైంది.
4వ రోజు తెలుగులో ఎంత?:గతంలో హిట్ అయిన 'ప్రతినిధి' చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన 'ప్రతినిధి 2' మూవీకి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అందుకు తగ్గట్లే మొదటి వీకెండ్‌లో ఇది తక్కువ వసూళ్లనే రాబట్టింది. ఇక, ఎలెక్షన్ డే అయిన 4వ రోజు కూడా సరైన రెస్పాన్స్‌ను అందుకోలేదు. ఫలితంగా ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో రూ. 10 లక్షలు షేర్‌తో పాటు రూ. 20 లక్షలు గ్రాస్ వచ్చింది.

4 రోజుల్లో తెలుగులో ఇలా:నారా రోహిత్ హీరోగా.. జర్నలిస్ట్ మూర్తి దేవగుప్తపు తెరకెక్కించిన సినిమా కావడంతో 'ప్రతినిధి 2'పై అందరిలోనూ ఆసక్తి వచ్చింది. కానీ, ఇది థియేటర్లకు ప్రేక్షకులను రప్పించలేకపోతోంది. ఫలితంగా నాలుగు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిసి నారా రోహిత్ సినిమాకు రూ. 68 లక్షలు షేర్, రూ. 1.25 కోట్లు గ్రాస్ మాత్రమే వసూలు అయినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
ప్రపంచ వ్యాప్తంగా అలా:నారా రోహిత్ హీరోగా నటించిన 'ప్రతినిధి 2' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 4 రోజుల్లో రూ. 68 లక్షలు షేర్ వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలిపి రూ. 10 లక్షలు మాత్రమే వసూలు చేసింది. వీటితో కలిపి నాలుగు రోజుల్లో ఈ చిత్రానికి రూ. 78 లక్షలు షేర్‌తో పాటు రూ. 1.45 లక్షలు గ్రాస్ మాత్రమే వసూలు అయింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?:సందేశాన్ని ఇచ్చే కథతో రూపొందిన 'ప్రతినిధి 2' సినిమాకు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 3.00 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 3.50 కోట్లుగా నమోదైంది. ఇక, 4 రోజుల్లో రోహిత్ సినిమాకు రూ. 78 లక్షలు వచ్చాయి. అంటే మరో రూ. 2.72 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్‌గా నిలుస్తుంది.


Click it and Unblock the Notifications











