Prathinidhi 2 Total Collections: 3.50 కోట్లు రావాలి.. ఫుల్ రన్‌లో ఘోరంగా.. నారా హీరోకు నష్టం ఎంతంటే!

టాలీవుడ్‌లో విలక్షణమైన నటనతో విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్న హీరోలు చాలా తక్కువ మందే ఉన్నారు. అలాంటి వారిలో నారా రోహిత్ ఒకడు. ఆరంభం నుంచే డిఫరెంట్ కాన్సెప్టులతో సినిమాలు చేస్తోన్న అతడు.. ఈ మధ్య చాలా గ్యాప్ తీసుకున్నాడు.

ఈ క్రమంలోనే ఇటీవలే 'ప్రతినిధి 2' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ, ఈ చిత్రం కూడా ఆశించిన రీతిలో రెస్పాన్స్‌ను సొంతం చేసుకోలేదు. ఫలితంగా తక్కువ వసూళ్లనే అందుకుంది. ఈ నేపథ్యంలో నారా రోహిత్ 'ప్రతినిధి 2' ఫుల్ రన్‌లో ఎంత వసూలు చేసిందో చూడండి!

Nara Rohit Starrer Prathinidhi 2 Movie Closing Worldwide Collections Details

మెసేజ్ ఇచ్చే కథతో వచ్చింది
నారా రోహిత్ హీరోగా నటించిన మెసేజ్ మూవీనే 'ప్రతినిధి 2'. మూర్తి దేవగుప్తపు తెరకెక్కించిన ఈ సినిమాను వానర ఎంటర్‌టైన్‌మెంట్స్, రానా ఆర్ట్స్ బ్యానర్లపై కుమార్ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, సురేంద్రనాథ్‌లు నిర్మించారు. ఇందులో ఉదయభాను, సచిన్ ఖేడ్కర్, రఘుబాబు, జిస్సూ సేన్‌గుప్తాలు నటించారు. దీనికి మహతీ స్వర సాగర్ మ్యూజిక్ అందించాడు.

నారా రోహిత్ మూవీ బిజినెస్

చాలా రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటోన్న నారా రోహిత్ సరైన హిట్ కొట్టాలని చేసిన సినిమానే 'ప్రతినిధి 2'. దీంతో ఈ సినిమాపై అందరిలో ఆసక్తి పెరిగిపోయింది. ఫలితంగా అంచనాలను భారీ స్థాయిలో ఏర్పరచుకుంది. తద్వారా మంచి డిమాండ్‌ను కూడా పెంచుకుంది. ఇలా ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ. 3.00 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్‌ను జరుపుకుంది.

Nara Rohit Starrer Prathinidhi 2 Movie Closing Worldwide Collections Details

అలాంటి టాక్‌తో డల్‌గానే
నారా రోహిత్ హీరోగా నటించి హిట్ అయిన 'ప్రతినిధి' చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన 'ప్రతినిధి 2' మూవీకి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అందుకు తగ్గట్లే మొదటి వీకెండ్‌లో ఇది తక్కువ వసూళ్లనే రాబట్టింది. తర్వాత కూడా ఈ చిత్రం ఏమాత్రం ప్రభావాన్ని చూపించలేకపోయింది. ఫలితంగా తక్కువ సమయంలోనే డల్ కలెక్షన్లతో రన్‌ను ముగించుకోవాల్సి వచ్చింది.

Nara Rohit Starrer Prathinidhi 2 Movie Closing Worldwide Collections Details

తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే

నారా రోహిత్ హీరోగా.. జర్నలిస్ట్ మూర్తి దేవగుప్తపు తెరకెక్కించిన సినిమా కావడంతో 'ప్రతినిధి 2'పై అందరిలోనూ ఆసక్తి వచ్చింది. కానీ, ఇది థియేటర్లకు ప్రేక్షకులను రప్పించలేకపోతోంది. ఫలితంగా ఫుల్ రన్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిసి నారా రోహిత్ సినిమాకు రూ. 87 లక్షలు షేర్, రూ. 1.90 కోట్లు గ్రాస్ మాత్రమే వసూలు అయినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

ప్రపంచ వ్యాప్తంగా ఎంత?
టాలెంటెడ్ గాయ్ నారా రోహిత్ హీరోగా చేసిన 'ప్రతినిధి 2' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో రూ. 87 లక్షలు షేర్ వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలిపి రూ. 13 లక్షలు మాత్రమే వసూలు చేసింది. వీటితో కలిపి ఫుల్ రన్‌లో ఈ చిత్రానికి రూ. 1.00 కోట్లు షేర్‌తో పాటు రూ. 2.25 లక్షలు గ్రాస్ మాత్రమే వసూలు అయింది.

Nara Rohit Starrer Prathinidhi 2 Movie Closing Worldwide Collections Details

టార్గెట్ ఇలా.. నష్టం ఎంత?

సందేశాత్మక కథతో రూపొందిన 'ప్రతినిధి 2' సినిమాకు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 3.00 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 3.50 కోట్లుగా నమోదైంది. ఇక, ఫుల్ రన్‌లో రోహిత్ సినిమాకు రూ. 1.00 వచ్చాయి. అంటే ఈ చిత్రం రూ. 2.50 కోట్లు నష్టాలను చవి చూసి డిజాస్టర్‌గా మిగిలిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X