Prathinidhi 2 Movie Day 1 Collections: నారా రోహిత్ మూవీకి ఊహించని వసూళ్లు.. ప్రతినిధి ఎంత రాబట్టాడంటే!
బడా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తోనే సినిమాల్లోకి అడుగు పెట్టినా.. టాలీవుడ్‌లో విలక్షణమైన నటనతో విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు నారా రోహిత్. హీరోగా ప్రయాణం మొదలెట్టినప్పటి నుంచే విభిన్నమైన కథలతో సినిమాలు చేసి టాలీవుడ్‌లోని హీరోల్లో స్పెషల్ అనిపించుకున్న అతడు.. ఈ మధ్య కాలంలో గ్యాప్ తీసుకున్నాడు. ఇలా చాలా రోజుల తర్వాత ఇప్పుడు 'ప్రతినిధి 2' అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. శుక్రవారం విడుదలైన ఈ చిత్రానికి టాక్‌కు అనుగుణంగానే రెస్పాన్స్ వచ్చింది. మరి 'ప్రతినిధి 2'కు తొలి రోజు ఎంత వచ్చిందో చూడండి!
హిట్ మూవీకి సీక్వెల్‌గా వచ్చి
నారా రోహిత్ హీరోగా ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి దేవగుప్తపు తెరకెక్కించిన చిత్రమే 'ప్రతినిధి 2'. ఈ మూవీని వానర ఎంటర్‌టైన్‌మెంట్స్, రానా ఆర్ట్స్ బ్యానర్లపై కుమార్ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, సురేంద్రనాథ్‌లు నిర్మించారు. దీనికి మహతీ స్వర సాగర్ మ్యూజిక్ ఇచ్చాడు. ఇందులో ఉదయభాను, సచిన్ ఖేడ్కర్, రఘుబాబు, జిస్సూ సేన్‌గుప్తాలు నటించారు.

నారా రోహిత్ మూవీ బిజినెస్
సుదీర్ఘ కాలం పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన నారా రోహిత్ నటించిన తాజా చిత్రమే 'ప్రతినిధి 2'. దీంతో ఈ చిత్రంపై అందరిలో ఆసక్తి ఏర్పడింది. ఫలితంగా అంచనాలను భారీ స్థాయిలో పెంచుకుంది. తద్వారా మంచి డిమాండ్‌ను ఏర్పరచుకుని భారీ ప్రీ రిలీజ్ బిజినెస్‌ను చేసుకుంది. ఇలా ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ. 3.00 కోట్లు వరకూ థియేట్రికల్ బిజినెస్ చేసింది.
మిక్స్‌డ్ టాక్‌తో మోస్తురుగా
పొలిటికల్ బ్యాగ్‌డ్రాప్‌తో రూపొందిన 'ప్రతినిధి 2' మూవీ గత శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ మిక్స్‌డ్ టాక్ వచ్చింది. దీంతో ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన కూడా అనుకున్న విధంగా లభించలేదు. ఫలితంగా ఈ చిత్రానికి తక్కువ వసూళ్లు వస్తాయని ట్రేడ్ వర్గాల వాళ్లు అంచనాలు వేసుకున్నారు.

తొలి రోజు తెలుగులో ఇలా
నారా రోహిత్ హీరోగా.. జర్నలిస్ట్ మూర్తి దేవగుప్తపు తెరకెక్కించిన చిత్రం కావడంతో 'ప్రతినిధి 2'పై అందరిలోనూ ఆసక్తి వచ్చింది. అయితే, ఈ సినిమా టాక్‌ను అనుకున్న విధంగా రాలేదు. ఫలితంగా మొదటి రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిసి నారా రోహిత్ సినిమాకు రూ. 30 లక్షలు షేర్, రూ. 55 లక్షలు గ్రాస్ మాత్రమే వసూలు అయినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
ప్రపంచ వ్యాప్తంగా అలా
టాలెంటెడ్ హీరో సత్యదేవ్ నటించిన 'ప్రతినిధి 2' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో మొదటి రోజు రూ. 30 లక్షలు షేర్ వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలిపి రూ. 10 లక్షలు మాత్రమే వసూలు చేసింది. వీటితో కలిపి మొదటి రోజు ఈ చిత్రానికి రూ. 40 లక్షలు షేర్‌తో పాటు రూ. 80 లక్షలు గ్రాస్ మాత్రమే వసూలు అయింది.
టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?
సందేశాత్మక కథతో రూపొందిన 'ప్రతినిధి 2' సినిమాకు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 300 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 3.50 కోట్లుగా నమోదైంది. ఇక, తొలి రోజు రోహిత్ సినిమాకు రూ. 40 లక్షలు వచ్చాయి. అంటే మరో రూ. 3.10 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్‌గా నిలుస్తుంది.


Click it and Unblock the Notifications











