నారప్ప, దృశ్యంకు సాలీడ్ ఆఫర్.. విరాటపర్వం 50కోట్లు.. దగ్గుబాటి వారి బిజినెస్ మామూలుగా లేదు!
ఎలాంటి సినిమా చేసినా కూడా నిర్మాత ఫైనల్ గా కోరుకునేది నాలుగు డబ్బులు ఎక్కువ రావాలనే. అయితే కరోనా దెబ్బకు చాలామంది నిర్మాతలు ఇప్పుడు సందిగ్ధంలో పడ్డారు. ముఖ్యంగా సీనియర్ నిర్మాతలు ఎటూ తేల్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. అయితే దగ్గుబాటి వారి సినిమాలకు ఓటీటీ వరల్డ్ లో భారీగా ఆఫర్స్ వస్తున్నాయి. ఓటీటీ కంపెనీలు పోటాపోటీగా ఆఫర్స్ ఇస్తున్నాయి. దీంతో కొన్నింటిని డైరెక్ట్ గా డిజిటక్ వరల్డ్ లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.

ధైర్యం చేయలేకపోయారు
నిర్మాత సురేష్ బాబు థియేట్రికల్ బిజినెస్ కు నిత్యం సపోర్ట్ గా ఉండేవారు. అయితే ఇటీవల ఆయననే నారప్ప సినిమాను ఓటీటీలో డైరెక్ట్ గా రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు. నారప్ప అమెజాన్ ప్రైమ్ లో జూలై 20న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. మొదట థియేటర్స్ లోనే విడుదల చేయాలని అనుకున్నారు గాని ఎందుకో ధైర్యం చేయలేకపోయారు.

నారప్ప రేటు..
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన నారప్ప సినిమాపై ఓ వర్గం ప్రేక్షకుల్లో అంచనాలు అయితే బాగానే ఉన్నాయి. ఇక అమెజాన్ ప్రైమ్ మొదట కేవలం 35కోట్లకు ఆఫర్ చేయగా అప్పుడు సురేష్ బాబు ఒప్పుకోలేదు. ఇక ఆ తరువాత 40కోట్లకు డీల్ సెట్టవ్వడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.

దృశ్యం.. రూ.36కోట్లు
ఇక సురేష్ బాబు నిర్మించిన మరో సినిమా దృశ్యం సినిమాకు కూడా మొదటి నుంచి అమెజాన్ మంచి ఆఫర్స్ ప్రకటిస్తూ వచ్చింది. కానీ ఆ సినిమా శాటిలైట్ డిజిటల్ హక్కులను హాట్ స్టార్ 36కోట్లకు సొంతం చేసుకుంది. ఈ సినిమాను థియేట్రికల్ గా రిలీజ్ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు.
Recommended Video

విరాటపర్వంపై నెట్ ఫ్లిక్స్ కన్ను
ఇక రానా దగ్గుబాటి విరాటపర్వం సినిమాపై నెట్ ఫ్లిక్స్ మొదటి నుంచి ఫోకస్ చేస్తోంది. కాని నిర్మాత సురేష్ బాబు థియేట్రికల్ గా రిలీజ్ చేయాలని ట్రై చేస్తున్నారు. ఇటీవల డైరెక్ట్ గా ఓటీటీ రిలీజ్ కోసం 50కోట్ల ఆఫర్ ను ప్రకటించినట్లు సమాచారం. మరి సురేష్ బాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. అలాగే ఓటీటీ ఆఫర్స్ కు మరికొన్ని పెద్ద సినిమాలు కూడా తలొగ్గే అవకాశం ఉన్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











