Box office: చిన్న టార్గెట్ కూడా అందుకోలేకపోయిన బంగారు బుల్లోడు.. గేమ్ ఓవర్

కామెడీ సినిమాలతో ఒకప్పుడు ట్రెండ్ సెట్ చేసి తనకంటూ ఒక స్పెషల్ క్రేజ్ అందుకున్న అల్లరి నరేష్ మధ్యమధ్యలో కొన్ని డిఫరెంట్ సినిమాలు కూడా చేసేవాడు. అప్పట్లో గమ్యం లాంటి మంచి సినిమా అతనికి గుర్తిండిపోయేలా క్రేజ్ అంధించింది. అయితే నరేష్ గత కొంత కాలంగా వరుస అపజయాలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇక ఫైనల్ గా బంగారు బుల్లోడు సినిమాతో ఈ నెల 23న ప్రేక్షకులు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇప్పటివరకు 8రోజులకు సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంత రాబట్టిందనే విషయంలోకి వెళితే..

చాలా కాలంగా.. సరైన సక్సెస్ చూడలేదు.

చాలా కాలంగా.. సరైన సక్సెస్ చూడలేదు.

చాలా ఏళ్లుగా నరేష్ కు ఎలాంటి సినిమా చేసినా కూడా కలిసి రావడం లేదు. అప్పుడెప్పుడో సుడిగాడు సినిమాతో బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టిన నరేష్ ఇంతవరకు సరైన సక్సెస్ చూడలేదు. దీంతో ఎలాగైనా ఈ సారి సక్సెస్ అందుకోవాలని కొన్ని విభిన్నమైన కథలను ఎంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక కమర్షియల్ కామెడీ కథ బంగారు బుల్లోడు ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

 రిస్క్ చేయలేకపోయారు.

రిస్క్ చేయలేకపోయారు.


బంగారు బుల్లోడు సినిమా కూడా గత ఏడాది రిలీజ్ కావాల్సింది. కానీ అనుకోకుండా కరోనా రావడం వలన వాయిదా పడుతూ వచ్చింది. ఇక సంక్రాంతి భరిలోనే సినిమాను రిలీజ్ చేయాలని అనుకున్నప్పటికి పోటీ ఎక్కువగా ఉండడం వలన . వలన రిస్క్ చేయలేకపోయారు. సినిమాకు ప్రమోషన్స్ కూడా కూడా బాగానే చేశారు గాని వర్కౌట్ కాలేదు.

వీకెండ్స్ అయితే మరీ దారుణం

వీకెండ్స్ అయితే మరీ దారుణం

తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 450కి పైగా థియేటర్స్ లో విడుదలైనప్పటికి బంగారు బుల్లోడు ఫస్ట్ డే రోజే కలెక్షన్స్ చాలా తక్కువగానే వచ్చాయి. సినిమాకు పాజిటివ్ టాక్ కూడా పెద్దగా ఏమి రాలేదు. పైగా సంక్రాంతి హాలిడేస్ అనంతరం విడుదలైన సినిమా కాబట్టి కలెక్షన్స్ అందుకునేందుకు ఏ విధంగాను అవకాశం కలగలేదు. వీకెండ్స్ అయితే మరీ దారుణం.

8రోజులకు వచ్చిన మొత్తం కలెక్షన్స్ ఎంతంటే..

8రోజులకు వచ్చిన మొత్తం కలెక్షన్స్ ఎంతంటే..

తెలుగు రాష్ట్రాల్లో సినిమా 8వ రోజు పెద్దగా లాభాలను ఏమి అందుకోలేదు. ఇక ఇప్పటివరకు మొత్తం 8రోజుల్లో అందుకున్న గ్రాస్ కలెక్షన్స్ 2.31కోట్లు. ఇటీవల కాలంలో విడుదలైన సినిమాల్లో ఈ సినిమానే అతి తక్కువ ఓపెనింగ్స్ అందుకుంది. ఒకవైపు క్రాక్, రెడ్, మాస్టర్ సినిమాలు ఒక రేంజ్ లో షేర్స్ అందుకున్నాయి.

Recommended Video

Kurushatram Trailer Launch Event | Darshan | Arjun Sarja | Naganna | Sonu Sood || Filmibeat Telugu
దాదాపు పనైపోయినట్లే..

దాదాపు పనైపోయినట్లే..


బంగారు బుల్లోడు సినిమాను వరల్డ్ వైడ్ గా 3.2కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. 3.5కోట్ల టార్గెట్ తో భరిలోకి దిగిన అల్లరి నరేష్ ఇప్పటివరకు 1.71కోట్ల షేర్స్ ను మాత్రమే అందుకున్నాడు. ఇక ఆదివారం ఒక్కరోజే మిగిలి ఉంది. ఏమైనా వస్తే ఇప్పుడే రావాలి. ఎందుకంటే ఆధివారంతో హాలిడేస్ అయిపోయినట్లే. కాలేజ్ లు స్కూల్స్ కూడా తెరచుకొనున్నాయ. సమ్మర్ వరకు బాక్సాఫీస్ వద్ద సందడి కనిపించదు. మరి అల్లరి నరేష్ నష్టాలను ఎంతవరకు కవర్ చేస్తాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X