Nari Nari Naduma Murari Closing Collections: నారీ నారీ నడుమ మురారి క్లోజింగ్ కలెక్షన్లు.. లాభమెంత? నష్టమెంత?

శర్వానంద్ హీరోగా సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటించిన చిత్రం నారీ నారీ నడుమ మురారి. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అనిల్ సుంకర, రామబ్రహ్మం సంయుక్తంగా నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీన నారీ నారీ నడుము మురారి చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. సత్య, వీకే నరేష్, సుదర్శన్, సంపత్ రాజ్, శ్రీకాంత్ అయ్యంగార్, సునీల్, వెన్నెల కిషోర్, గెటప్ శ్రీను, సిరి హనుమంత్ తదితరులు ఈ సినిమాలో కీలకపాత్రలు పోషించారు. భాను భోగవరపు స్టోరీని అందించగా.. నందు సావిరిగన సంభాషణలు రాశారు. జీ శేఖర, యువరాజ్ సినిమాటోగ్రఫిని, విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అందించారు. ఈ నేపథ్యంలో నారీ నారీ నడుమ మురారి బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? థియేట్రికల్ రన్‌లో ఈ సినిమా సాధించిన కలెక్షన్స్ ఎంత? శర్వానంద్ మూవీకి లాభమెంత? నష్టమెంత? అనేది పరిశీలిస్తే..

నారీ నారీ నడుము మురారి బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులు కలిపి నారీ నారీ నడుము మురారి మూవీకి 40 కోట్ల రూపాయల బడ్జెట్ అయ్యింది. టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాలతో ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాలు, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ కలిపి వరల్డ్ వైడ్‌గా దాదాపు 11 కోట్ల రూపాయల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగింది. దాంతో నారీ నారీ నడుమ మురారీ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే 12 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూషన్ షేర్... 25 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు వాల్యూ కట్టారు.

Nari Nari Naduma Murari Box Office Collections Worldwide Sharwanand film total Collections at Global Box Office Report

నారీ నారీ నడుము మురారి కలెక్షన్స్
25 కోట్ల రూపాయల బ్రేక్ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగిన శర్వానంద్‌ మూవీ తొలిరోజున ఇండియాలో తొలి రోజున 70 లక్షల రూపాయలు, 2వ రోజున 2.25 కోట్ల రూపాయలు, మూడో రోజున 2.35 కోట్ల రూపాయలు, 4వ రోజున 2.6 కోట్ల రూపాయలు, 5వ రోజున 2.5 కోట్ల రూపాయలు, 6వ రోజున 1.3 కోట్ల రూపాయలు, 7వ రోజున కోటి రూపాయలు, 8వ రోజున 80 లక్షల రూపాయలు, 9వ రోజున 70 లక్షల రూపాయలు, 10వ రోజున కోటి రూపాయలు, 11వ రోజున 1.6 కోట్ల రూపాయలు, 12వ రోజున 1.95 కోట్ల రూపాయలు, 13వ రోజున 1.65 కోట్ల రూపాయలు, 14వ రోజున 70 లక్షల రూపాయలు, 15వ రోజున 60 లక్షల రూపాయలు, 16వ రోజున 65 లక్షల రూపాయలు, 17వ రోజున 60 లక్షల రూపాయలు, 18వ రోజున 70 లక్షల రూపాయలు, 19వ రోజున 75 లక్షల రూపాయలు, 20వ రోజున 28 లక్షల రూపాయలు, 21వ రోజున 30 లక్షల రూపాయలు, 22వ రోజున 25 లక్షల రూపాయలు, 23వ రోజున 17 లక్షల రూపాయలు చొప్పున ఇప్పటి వరకు ఇండియాలో 25.43 కోట్ల రూపాయల నెట్.. 29.75 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు సాక్‌నిక్ తెలిపింది.

నారీ నారీ నడుము మురారి ఓవర్సీస్ కలెక్షన్స్
శర్వానంద్ మూవీకి ఓవర్సీస్‌లోనూ బలమైన పోటీ ఉన్నప్పటికీ చెప్పుకోదగ్గ వసూళ్లు వచ్చాయి. నార్త్ అమెరికాలో ఫిబ్రవరి 4వ తేదీ వరకు నారీ నారీ నడుమ మురారి మూవీకి 765K డాలర్లు ( భారత కరెన్సీలో 7 కోట్ల రూపాయలు) వసూలైంది. యూకే, యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తదితర దేశాలలో మరో కోటి రూపాయల వరకు రాబట్టింది. దాంతో ఓవర్సీస్‌లో ఇప్పటి వరకు నారీ నారీ నడుమ మురారి మూవీ 8 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ట్రేడ్ పండితులు తెలిపారు. భారత్‌లో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి శర్వానంద్ మూవీ ఇప్పటి వరకు వరల్డ్ వైడ్‌గా 38 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసినట్లు సాక్‌నిక్ నివేదించింది.

నారీ నారీ నడుమ మురారి మూవీకి ఇప్పటి వరకు కర్ణాటకలో 1.9 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో21.39 కోట్ల రూపాయలు, తమిళనాడులో 24 లక్షల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 32 లక్షల రూపాయలు, ఓవర్సీస్‌లో 8 కోట్ల రూపాయలు చొప్పున ఈ చిత్రం వసూలు చేసినట్లు ట్రేడ్ పండితులు తెలిపారు.

నారీ నారీ నడుమ మురారికి లాభమెంత? నష్టమెంత?
దాదాపు 7 ఏళ్లుగా హిట్ లేక సతమతం అవుతోన్న హీరో శర్వానంద్‌కు నారీ నారీ నడుమ మురారి మూవీ కొత్త ఊపిరి పోసింది. రిలీజైన క్షణం నుంచి పాజిటివ్ టాక్‌, రివ్యూలతో ఈ చిత్రానికి ప్రేక్షకులు.. ముఖ్యంగా యూత్ బ్రహ్మరథం పట్టారు. మన శంకర వరప్రసాద్ గారు, ది రాజా సాబ్ సహా సంక్రాంతి సినిమాల పోటీని తట్టుకుని ఈ సినిమా నిలబడటం మామూలు విషయం కాదు. శర్వానంద్ మూవీ లాభాల్లోకి రావాలంటే 12 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూషన్ షేర్.. 25 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టాల్సి ఉంది.

దీని ప్రకారం ఇప్పటి వరకు నారీ నారీ నడుమ మురారి మూవీ వరల్డ్ వైడ్‌గా 36 కోట్ల రూపాయల గ్రాస్.. 20 కోట్ల రూపాయల షేర్ రాబట్టింది. దాంతో దాదాపు 10 కోట్ల రూపాయలకు పైగా లాభాలను అందించాడు శర్వానంద్. ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్‌‌ను దాదాపు 18 కోట్ల రూపాయలు వెచ్చించి అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకోవడంతో అప్పుడే టేబుల్ ప్రాఫిట్‌ను అందుకున్నారు నిర్మాతలు. ఇంకా ఈ మూవీ ఆడియో రైట్స్, శాటిలైట్ రైట్స్, డబ్బింగ్ రైట్స్‌తో నిర్మాతకు మంచి లాభాలు వచ్చాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X