Nari Nari Naduma Murari Day 1 Collections: నారీ నారీ నడుమ మురారి డే 1 కలెక్షన్స్..శర్వానంద్ మూవీకి ఎంతంటే?
దాదాపు 9 ఏళ్లుగా సాలీడ్ హిట్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు యంగ్ హీరో శర్వానంద్. మధ్యలో కామెడీ, యాక్షన్, విభిన్న చిత్రాలు ట్రై చేసినా ఆయనకు హిట్ అందలేదు. ఈ నేపథ్యంలో తన బాడీ లాంగ్వేజ్‌కు తగ్గ కథతో, తనకు శతమానం భవతి వంటి హిట్ ఇచ్చిన సంక్రాంతి సీజన్‌లో నారీ నారీ నడుమ మురారి చిత్రంతో మరోసారి అదృష్టం పరీక్షించుకోవాలని అనుకున్నారు శర్వానంద్. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ కెరీర్‌లో ఆల్‌టైమ్ క్లాసిక్‌గా గుర్తింపు తెచ్చుకున్న సినిమా టైటిల్‌తో సంక్రాంతికి శర్వానంద్ వస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో నారీ నారీ నడుమ మురారి బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? తొలిరోజు ఈ సినిమా ఎన్ని కోట్ల రూపాయల ఓపెనింగ్స్ రాబట్టింది? ఈ వివరాల్లోకి వెళితే..
నారీ నారీ నడుము మురారి చిత్రానికి రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించారు. శర్వానంద్ సరసన సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటించారు. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అనిల్ సుంకర, రామబ్రహ్మం సంయుక్తంగా నారీ నారీ నడుము మురారి మూవీని నిర్మించారు. ఈ చిత్రంలో సత్య, వీకే నరేష్, సుదర్శన్, సంపత్ రాజ్, శ్రీకాంత్ అయ్యంగార్, సునీల్, వెన్నెల కిషోర్, గెటప్ శ్రీను తదితరులు నటించారు. ఈ సినిమాకు భాను భోగవరపు స్టోరీని అందించగా.. నందు సావిరిగన సంభాషణలు రాశారు. జీ శేఖర, యువరాజ్ సినిమాటోగ్రఫిని, విశాల్ చంద్రశేఖర్ సంగీత దర్శకత్వం వహించారు. సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీ ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.

నారీ నారీ నడుము మురారి బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులు కలిపి నారీ నారీ నడుము మురారి మూవీకి 40 కోట్ల రూపాయల బడ్జెట్ అయ్యింది. టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాలతో ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయ్యింది. ఇక నారీ నారీ నడుము మురారి ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే.. గడిచిన 9 ఏళ్లుగా శర్వానంద్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేస్తూ ఉండటంతో ఈ సినిమాకు అంతంత మాత్రంగానే థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
నారీ నారీ నడుము మురారి బ్రేక్ ఈవెన్ టార్గెట్?
అయితే నారీ నారీ నడుము మురారి ఓటీటీ రైట్స్‌కు మాత్రం మంచి ధర పలికినట్లుగా తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోస్.. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను దాదాపు 18 కోట్ల రూపాయలు వెచ్చించి దక్కించుకుంది. అలాగే శర్వానంద్ మూవీ శాటిలైట్, డబ్బింగ్, ఆడియో రైట్స్‌కు కూడా ఫర్వాలేదనే స్థాయిలో బిజినెస్ చేసినట్లుగా టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. నారీ నారీ నడుమ మురారీ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే 45 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూషన్ షేర్... 90 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు.
నారీ నారీ నడుము మురారి తొలి రోజు కలెక్షన్స్
సంక్రాంతి నేపథ్యంలో జనవరి 14న ఒకే రోజు రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. నవీన్ పొలిశెట్టి నటించిన అనగనగా ఒకరాజు చిత్రం ఈరోజు ఉదయమే రిలీజ్ కాగా... జనవరి 14వ తేదీ సాయంత్రం నుంచి నారీ నారీ నడుము మురారి వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. కడపటి సమాచారం అందేనాటికి శర్వానంద్ మూవీకి తొలిరోజున ఇండియాలో 42 లక్షల రూపాయల నెట్ వచ్చింది. అయితే తొలిరోజున ఫస్ట్ షో, సెకండ్ షోలకు మాత్రమే బుకింగ్స్ జరిగినందున కలెక్షన్స్‌పై ప్రభావం చూపినట్లుగా వార్తలు వస్తున్నాయి. అటు ఓవర్సీస్ ఆడియన్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ నేపథ్యంలో తొలి రోజున నారీ నారీ నడుము మురారి చిత్రం వరల్డ్ వైడ్‌గా 4 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
రోపాజిటివ్ రివ్యూలు వస్తుండటంతో యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాను రేపటి నుంచి ఆదరించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే ది రాజాసాబ్, మన శంకర వరప్రసాద్‌గారు వంటి భారీ చిత్రాలతో పాటు భర్త మహాశయులకు విజ్ఞప్తి, అనగనగా ఒకరాజు వంటి సినిమాల నుంచి నారీ నారీ నడుమ మురారి మూవీకి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. మరి ఈ పోటీలో శర్వానంద్ ఏ స్థాయిలో నెట్టుకొస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications











