Nari Nari Naduma Murari Day 11 Collections: నారీ నారీ నడుమ మురారి కలెక్షన్స్.. శర్వానంద్ మూవీకి లాభం ఎంతంటే?
శర్వానంద్ హీరోగా సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటించిన చిత్రం నారీ నారీ నడుమ మురారి. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అనిల్ సుంకర, రామబ్రహ్మం సంయుక్తంగా నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీన నారీ నారీ నడుము మురారి చిత్రం వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సత్య, వీకే నరేష్, సుదర్శన్, సంపత్ రాజ్, శ్రీకాంత్ అయ్యంగార్, సునీల్, వెన్నెల కిషోర్, గెటప్ శ్రీను, సిరి హనుమంత్ తదితరులు ఈ సినిమాలో కీలకపాత్రలు పోషించారు. భాను భోగవరపు స్టోరీని అందించగా.. నందు సావిరిగన సంభాషణలు రాశారు. జీ శేఖర, యువరాజ్ సినిమాటోగ్రఫిని, విశాల్ చంద్రశేఖర్ సంగీత దర్శకత్వం వహించారు. ఈ నేపథ్యంలో నారీ నారీ నడుమ మురారి బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? 11వ రోజు ఈ సినిమా ఎన్ని కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టింది? ఈ వివరాల్లోకి వెళితే..
నారీ నారీ నడుము మురారి బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులు కలిపి నారీ నారీ నడుము మురారి మూవీకి 40 కోట్ల రూపాయల బడ్జెట్ అయ్యింది. టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాలతో ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాలు, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ మార్కెట్ కలిపి వరల్డ్ వైడ్‌గా దాదాపు 11 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. నారీ నారీ నడుమ మురారీ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే 12 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూషన్ షేర్... 25 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు. సంక్రాంతికి భారీ చిత్రాలతో పాటు దాదాపు అరడజను సినిమాలు పోటీలో ఉండటంతో థియేటర్ల కొరత కనిపించింది.

నారీ నారీ నడుము మురారి 10 రోజుల కలెక్షన్స్
శర్వానంద్ మూవీ తొలిరోజు 70 లక్షల రూపాయలు, రెండో రోజున 2.25 కోట్ల రూపాయలు, మూడో రోజున 2.35 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 2.6 కోట్ల రూపాయలు, ఐదో రోజున 2.5 కోట్ల రూపాయలు, ఆరో రోజున 1.3 కోట్ల రూపాయలు, ఏడో రోజున కోటి రూపాయలు, ఎనిమిదో రోజున 80 లక్షల రూపాయలు, తొమ్మిదో రోజున 71 లక్షల రూపాయలు, పదో రోజున 90 లక్షల రూపాయలు చొప్పున ఇండియాలో 15.64 కోట్ల రూపాయల నెట్... 17.8 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇప్పటి వరకు కర్ణాటకలో 1.50 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాలలో 15.8 కోట్ల రూపాయలు, తమిళనాడులో 21 లక్షల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 29 లక్షల రూపాయలు చొప్పున నారీ నారీ నడుమ మురారి చిత్రం కలెక్ట్ చేసింది.
నారీ నారీ నడుము మురారి ఓవర్సీస్ కలెక్షన్స్
నార్త్ అమెరికాలో శర్వానంద్ మూవీకి మంచి ఆదరణ లభిస్తోంది. చిరంజీవి, నవీన్ పొలిశెట్టి సినిమాలకు నారీ నారీ నడుమ మురారి గట్టి పోటీ ఇచ్చింది. గురువారం వరకు అందిన లెక్కల ప్రకారం శర్వానంద్ మూవీకి నార్త్ అమెరికాలో 700K డాలర్లు (భారత కరెన్సీలో 6.41 కోట్ల రూపాయలు) వసూలు చేసింది. శనివారం నాటి అడ్వాన్స్ బుకింగ్‌లోనూ శర్వానంద్ మూవీకి మంచి వసూళ్లు వచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇక ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూకే, యూరప్, గల్ఫ్ తదితర దేశాలలో ఈ సినిమాకు మరో 50 లక్షల రూపాయలు వసూలైంది. దాంతో ఓవర్సీస్‌లో నారీ నారీ నడుమ మురారికి ఇప్పటి వరకు 7.25 కోట్ల రూపాయలు వచ్చినట్లుగా తెలుస్తోంది. దాంతో భారత్‌లో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్ కలిపి శర్వానంద్ మూవీ వరల్డ్ వైడ్‌గా 25 కోట్ల రూపాయల వరకు వసూలు చేసినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో నారీ నారీ నడుము మురారి కలెక్షన్స్
తెలుగు రాష్ట్రాల్లో శర్వానంద్ మూవీకి తొలి రోజున 70 లక్షల రూపాయలు, రెండో రోజున 2.25 కోట్ల రూపాయలు, మూడో రోజున 2.35 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 2.6 కోట్ల రూపాయలు, ఐదో రోజున 2.5 కోట్ల రూపాయలు, ఆరో రోజున 1.3 కోట్ల రూపాయలు, ఏడో రోజున కోటి రూపాయలు, ఎనిమిదో రోజున 80 లక్షల రూపాయలు, తొమ్మిదో రోజున 70 లక్షల రూపాయలు, పదో రోజున కోటి రూపాయలు రాబట్టింది.
నారీ నారీ నడుము మురారి 11వ రోజు కలెక్షన్స్
పాజిటివ్ రివ్యూలు, యూత్ నుంచి ఆదరణ నేపథ్యంలో నారీ నారీ నడుమ మురారి మూవీకి మంచి బుకింగ్స్ నమోదవుతున్నాయి. వీకెండ్ కావడంతో శనివారం ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. 11వ రోజు శర్వానంద్ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో సాయంత్రం 5 గంటల వరకు 30 శాతం మేర థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిక్ నివేదించింది. కడపటి వార్తలు అందేసరికి ఈరోజు నారీ నారీ నడుమ మురారి మూవీకి ఇండియాలో 67 లక్షల రూపాయల నెట్ వసూలైనట్లు సాక్‌నిక్ పేర్కొంది. 11వ రోజు ఈ చిత్రం తెలుగు రాష్ట్రాలలో 1.50 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 50 లక్షల రూపాయల చొప్పున వరల్డ్ వైడ్‌గా 2 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టవచ్చని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. దాంతో 11 రోజుల వరకు శర్వానంద్ మూవీకి వరల్డ్ వైడ్‌గా 27 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వస్తాయని భావిస్తున్నారు.
శర్వానంద్ మూవీ లాభాల్లోకి రావాలంటే 12 కోట్ల రూపాయల షేర్... 25 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రావాల్సి ఉంది. అయితే ఇప్పటికే ఈ మూవీ లాభాల్లోకి వచ్చినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఈ వీకెండ్ ముగిసేనాటికి శర్వానంద్ మూవీ మంచి వసూళ్లను రాబడుతుందని అంచనా వేస్తున్నారు. సోమవారం నుంచి వర్కింగ్ డేస్ మొదలు కానుండటంతో శర్వానంద్ మూవీ ఏ మేరకు రాణిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











