Nari Nari Naduma Murari Day 2 Collections: నారీ నారీ నడుమ మురారి కలెక్షన్స్.. శర్వానంద్ మూవీకి ఎన్ని కోట్లంటే?

శర్వానంద్ హీరోగా సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్లుగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం నారీ నారీ నడుమ మురారి. సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అనిల్ సుంకర, రామబ్రహ్మం సంయుక్తంగా నారీ నారీ నడుము మురారి మూవీని నిర్మించారు. సత్య, వీకే నరేష్, సుదర్శన్, సంపత్ రాజ్, శ్రీకాంత్ అయ్యంగార్, సునీల్, వెన్నెల కిషోర్, గెటప్ శ్రీను తదితరులు నటించారు.

ఈ సినిమాకు భాను భోగవరపు స్టోరీని అందించగా.. నందు సావిరిగన సంభాషణలు రాశారు. జీ శేఖర, యువరాజ్ సినిమాటోగ్రఫిని, విశాల్ చంద్రశేఖర్ సంగీత దర్శకత్వం వహించారు. ఈ నేపథ్యంలో నారీ నారీ నడుమ మురారి బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? 2వ రోజు ఈ సినిమా ఎన్ని కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టింది? ఈ వివరాల్లోకి వెళితే..

nari

నారీ నారీ నడుము మురారి బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులు కలిపి నారీ నారీ నడుము మురారి మూవీకి 40 కోట్ల రూపాయల బడ్జెట్ అయ్యింది. టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాలతో ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయ్యింది. నారీ నారీ నడుమ మురారీ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే 45 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూషన్ షేర్... 90 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు.

నారీ నారీ నడుము మురారి తొలి రోజు కలెక్షన్స్
శర్వానంద్ మూవీ తొలిరోజు అంతంత మాత్రంగానే ఓపెనింగ్స్ వసూలు చేసింది. సంక్రాంతి సినిమాల మధ్య భారీ పోటీకి తోడు తొలిరోజు సాయంత్రం నుంచి షోలు మొదలు కావడం ఈ సినిమా కలెక్షన్స్‌పై ప్రభావం చూపింది. తొలి రోజు ఇండియాలో కేవలం 61 లక్షల రూపాయల నెట్.. 68 లక్షల రూపాయల గ్రాస్ మాత్రమే రాబట్టగలిగింది.

నారీ నారీ నడుము మురారి రెండో రోజు కలెక్షన్స్
తొలి రోజు తక్కువ షోలకే శర్వానంద్ సినిమా పరిమితం కావడం మైనస్‌గా మారగా... పాజిటివ్ రివ్యూలు, మౌత్ టాక్‌తో రెండో రోజు ఉదయం నుంచే నారీ నారీ నడుమ మురారికి బుకింగ్స్ భారీగా జరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. రెండో రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు శర్వానంద్ సినిమాకు 22 శాతం మేర థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైంది. హైదరాబాద్‌లో 216 షోలు, బెంగళూరులో 99 షోలు, విశాఖలో 48 షోలు, విజయవాడలో 38 షోలు చొప్పున ప్రదర్శితమయ్యామయ్యాయి.

రెండో రోజు మధ్యాహ్నం 3 గంట వరకు అందిన సమాచారం ప్రకారం ఇండియాలో నారీ నారీ నడుమ మురారి చిత్రం 56 లక్షల రూపాయల నెట్ కలెక్షన్స్ క్రాస్ చేసేసింది. ఫస్ట్ షో, సెకండ్ షోలకు మరింత ఆదరణ దక్కే అవకాశాలు ఉండటంతో రెండో రోజు శర్వానంద్ మూవీకి మంచి కలెక్షన్స్ నమోదవుతాయని భావిస్తున్నారు. గురువారం నారీ నారీ నడుమ మురారి చిత్రం వరల్డ్ వైడ్‌గా 5 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. దాంతో రెండ్రోజుల్లో ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 7 కోట్ల రూపాయల మార్క్ క్రాస్ చేయొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే ది రాజాసాబ్, మన శంకర వరప్రసాద్‌గారు వంటి భారీ చిత్రాలతో పాటు భర్త మహాశయులకు విజ్ఞప్తి, అనగనగా ఒకరాజు వంటి సినిమాల నుంచి నారీ నారీ నడుమ మురారి మూవీకి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. మరి ఈ పోటీలో శర్వానంద్‌ ఏ స్థాయిలో నెట్టుకొస్తాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X