Nari Nari Naduma Murari Day 4 Collections: నారీ నారీ నడుమ మురారికి డీసెంట్‌ కలెక్షన్స్... శర్వానంద్ మూవీకి ఎంత

ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాతలు అనిల్ సుంకర, రామబ్రహ్మం సంయుక్తంగా నిర్మించిన చిత్రం నారీ నారీ నడుము మురారి. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించారు. ఇందులో శర్వానంద్ సరసన సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీన నారీ నారీ నడుము మురారి చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సత్య, వీకే నరేష్, సుదర్శన్, సంపత్ రాజ్, శ్రీకాంత్ అయ్యంగార్, సునీల్, వెన్నెల కిషోర్, గెటప్ శ్రీను తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాకు భాను భోగవరపు స్టోరీని అందించగా.. నందు సావిరిగన సంభాషణలు రాశారు. జీ శేఖర, యువరాజ్ సినిమాటోగ్రఫిని, విశాల్ చంద్రశేఖర్ సంగీత దర్శకత్వం వహించారు. ఈ నేపథ్యంలో నారీ నారీ నడుమ మురారి బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? 4వ రోజు ఈ సినిమా ఎన్ని కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టింది? ఈ వివరాల్లోకి వెళితే..

నారీ నారీ నడుము మురారి బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులు కలిపి నారీ నారీ నడుము మురారి మూవీకి 40 కోట్ల రూపాయల బడ్జెట్ అయ్యింది. టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాలతో ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాలు, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ మార్కెట్ కలిపి వరల్డ్ వైడ్‌గా దాదాపు 11 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. నారీ నారీ నడుమ మురారీ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే 12 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూషన్ షేర్... 25 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు. సంక్రాంతికి భారీ చిత్రాలతో పాటు దాదాపు అరడజను సినిమాలు పోటీలో ఉండటంతో థియేటర్ల కొరత కనిపించింది.

Nari Nari Naduma Murari Day 4 Expected Box Office Collections Worldwide Sharwanand s movie has shown strong growth

నారీ నారీ నడుము మురారి 3 రోజుల కలెక్షన్స్
శర్వానంద్ మూవీ తొలిరోజు 70 లక్షల రూపాయలు, రెండో రోజున 2.25 కోట్ల రూపాయలు, మూడో రోజున 2.25 కోట్ల రూపాయలు చొప్పున ఇండియాలో 5.2 కోట్ల రూపాయల నెట్... 6.15 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇప్పటి వరకు కర్ణాటకలో 50 లక్షల రూపాయలు, తెలుగు రాష్ట్రాలలో 5.20 కోట్ల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 22 లక్షల రూపాయలు చొప్పున నారీ నారీ నడుమ మురారి చిత్రం కలెక్ట్ చేసింది.

నారీ నారీ నడుము మురారి ఓవర్సీస్ కలెక్షన్స్
నారీ నారీ నడుము మురారి మూవీకి నార్త్ అమెరికాలో ప్రీమియర్స్+ డే 1 బుకింగ్స్ ద్వారా 172k డాలర్లు (భారత కరెన్సీలో 1.56 కోట్ల రూపాయలు) వసూలు చేసింది. రెండో రోజు శర్వానంద్ మూవీకి నార్త్ అమెరికాలో 80k డాలర్లు (72.56 లక్షల రూపాయలు) రాబట్టింది. ఇక మూడో రోజు అడ్వాన్స్ బుకింగ్ వరకు అందిన లెక్కల ప్రకారం శర్వానంద్ మూవీ నార్త్ అమెరికాలో 300K డాలర్లు (2.72 కోట్ల రూపాయలు)కు పైగా వసూలు చేసినట్లు అంచనా. ఇక ఇతర దేశాలలో నారీ నారీ నడుమ మురారీ మూవీకి మరో 30 లక్షల రూపాయల వరకు వచ్చినట్లుగా తెలుస్తోంది. దాంతో ఓవర్సీస్ నుంచి ఇప్పటి వరకు శర్వానంద్ మూవీకి 3 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చినట్లుగా ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. భారత్‌లో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్ కలిపి శర్వానంద్ మూవీ వరల్డ్ వైడ్‌గా 9 కోట్ల రూపాయల వరకు వసూలు చేసినట్లుగా భావిస్తున్నారు.

నారీ నారీ నడుము మురారి 4వ రోజు కలెక్షన్స్
పాజిటివ్ రివ్యూలు, యూత్ నుంచి ఆదరణ నేపథ్యంలో నారీ నారీ నడుమ మురారీ మూవీకి మంచి బుకింగ్స్ జరుగుతున్నాయి. కొన్ని ఏరియాలో ఈ సినిమాకు కొత్తగా థియేటర్స్ కూడా యాడ్ చేస్తున్నారు. 4వ రోజు సాయంత్రం 4 గంటల వరకు శర్వానంద్ మూవీకి ఇండియాలో 39 శాతం మేర థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లుగా సాక్‌నిక్ నివేదించింది. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు ఇండియాలో 87 లక్షల రూపాయల నెట్ కలెక్షన్స్ వచ్చాయి. ప్రస్తుత టెండ్స్‌ను బట్టి నారీ నారీ నడుమ మరారి మూవీ 4వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 3 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో కోటి రూపాయలు చొప్పున ప్రపంచవ్యాప్తంగా 5 కోట్ల రూపాయలు వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. దాంతో నాలుగు రోజులలో నారీ నారీ నడుమ మురారి మూవీ వరల్డ్ వైడ్‌గా 14 కోట్ల రూపాయల గ్రాస్ రాబడుతుందని భావిస్తున్నారు.

అయితే ది రాజాసాబ్, మన శంకర వరప్రసాద్‌గారు వంటి భారీ చిత్రాలతో పాటు భర్త మహాశయులకు విజ్ఞప్తి, అనగనగా ఒకరాజు వంటి సినిమాల నుంచి నారీ నారీ నడుమ మురారి మూవీకి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. మరి ఈ పోటీలో శర్వానంద్‌ ఏ స్థాయిలో నెట్టుకొస్తాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X