Mad Square Day 1 Collections : మ్యాడ్ స్క్వేర్ డే1 కలెక్షన్లు.. ఎన్ని కోట్లంటే?

యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ మ్యాడ్ స్క్వేర్ మార్చి 28న గ్రాండ్ గా విడుదలైంది. ఇండియాతో పాటు వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2023 అక్టోబర్ 6న ఆడియెన్స్ ను ఆకట్టుకునేందుకు వచ్చిన కామెడీ, లవ్, యూత్ ఫల్ కంటెంట్ 'మ్యాడ్' ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఆ సినిమాకు అప్పుడు మంచి రెస్పాన్స్ దక్కింది. ఆడియెన్స్ నుంచి పాజిటివ్ టాక్ రావడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద కూడా సక్సెస్ అందుకుంది. అప్పుడు కేవలం 8 కోట్ల బడ్జెట్ తో 'మ్యాడ్' చిత్రాన్ని నిర్మించారు. కాగా బాక్సాఫీస్ నుంచి రూ.26 కోట్ల గ్రాస్ ను తిరిగి ఇచ్చింది.

ఇక మొదటి భాగం ఘన విజయం సాధించడంతో మేకర్స్ ఇప్పుడు మ్యాడ్ 2ని తీసుకొచ్చారు. మ్యాడ్ స్క్వేర్ టైటిల్ తో తాజాగా వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిందీ చిత్రం. తొలిరోజు ఈ చిత్రం ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. దీంతో ఈ చిత్రం బాక్సాఫీస్ కలెక్షన్లు ఎలా ఉండబోతున్నాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కాగా ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం.. మ్యాడ్ చిత్రం కు క్రియేట్ అయిన బజ్ ప్రకారం... డే1న వరల్డ్ వైడ్ గా రూ.5 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం టాక్ బాగానే ఉంటడంతో ఇంకా మించిపోయే అవకాశం కూడా లేకపోలేదని భావిస్తున్నారు.

Narne Naveen Sangeeth Shobhan Mad Square Day 1 Box Office Collections Worldwide

మరోవైపు మ్యాడ్ స్క్వేర్ చిత్రానికి అడ్వాన్డ్స్ బుకింగ్స్ లోనూ ఓ మాదిరిగా సేల్ జరగడం విశేషం. ఈ చిత్రానికి ఇండియాలో రూ.2.9 కోట్ల రేంజ్లో గ్రాస్ బుక్కింగ్స్ జరిగాయని, ఇక ఓవర్సీస్ లో రూ.2.1 కోట్ల వరకు గ్రాస్ బుక్కింగ్స్ అయ్యాయని తెలుస్తోంది. ఇలా మొత్తంగా రూ.5 కోట్ల వరకు గ్రాస్ బుక్కింగ్స్ ను రిలీజ్ కు ముందే సేల్ జరిపింది. ఇక వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి రూ.21 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని ట్రేడ్ పండితులు తెలుపుతున్నారు. దీంతో రూ.22 కోట్ల రేంజ్ లోపు ఈ చిత్రానికి బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను ఫిక్స్ చేశారు.

అయితే, మ్యాడ్ స్క్వేర్ చిత్రానికి మంచి టాక్ వినిపిస్తుండటంతో బాక్సాఫీస్ కలెక్షన్లు అందిరిపోవడం ఖాయమని అంటున్నారు. ఇక ఈరోజే రాబిన్ హుడ్ చిత్రం రిలీజ్ కావడం, ఒక రోజు ముందుగానే నిన్న లూసీఫర్ 2 : ఎంపురాన్, వీరధీరా శూర చిత్రం విడుదలయ్యాయి. అయితే ఇలా పోటీ ఎంత ఉన్నప్పటికీ మ్యాడ్ స్క్వేర్ యూత్ ఫుల్ అండ్ కామెడీ కంటెంట్ ను కలిగి ఉండటంతో బాక్సాఫీస్ వద్ద వసూళ్లకు ఎలాంటి ఢోకా లేదంటున్నారు.

మ్యాడ్ స్క్వేర్ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 450 థియేటర్లలో విడుదలైంది. కాగా వరల్డ్ వైడ్ గా 650 వరకు థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ చిత్రానికి కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించగా నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ లు ప్రధాన పాత్రల్లో నటించారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్, శ్రీకర స్టూడియో, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. స్యూరదేవర నాగవంశీ సమర్పించగా హారిక స్యూరదేవర, సాయి సౌజన్య నిర్మించారు. భీమ్స్ సిసిరోలియో పాటలు, థమన్ నేపథ్య సంగీతం అందించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X