AAY 10 Days Collections: స్టడీగా ఎన్టీఆర్ బావమరిది మూవీ.. 10 రోజుల్లో ఎన్ని కోట్లంటే?

తెలుగు సినిమా రంగంలోకి ఎంతో మంది హీరోలుగా ఎంట్రీ ఇస్తున్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే ఆరంభంలోనే హిట్లు కొట్టి ఔరా అనిపిస్తున్నారు. అలాంటి వారిలో ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ ఒకడు. ఫస్ట్ మూవీతోనే సక్సెస్ సాధించిన అతడు.. ఇప్పుడు 'ఆయ్' అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఇది కూడా ఆరంభంలోనే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఫలితంగా భారీ రెస్పాన్స్‌ను అందుకుంటూ కలెక్షన్లను భారీగా రాబడుతోంది. ఈ నేపథ్యంలో నార్నే నితిన్ 'ఆయ్' సినిమా 10 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందో మీరే చూడండి!

'ఆయ్' అంటూ వచ్చాడు
నార్నే నితిన్ హీరోగా చేసిన ఫన్ ఎంటర్‌టైనర్ మూవీనే 'ఆయ్'. కంచిపల్లి అంజిబాబు తెరకెక్కించిన ఈ సినిమాను జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్, విద్య కప్పినీది నిర్మించారు. దీనికి రామ్ మిరియాల మ్యూజిక్ అందించాడు. ఇందులో నయన్ సారిక హీరోయిన్‌గా నటించగా.. అంకిత్ కొయ్య, కృష్ణ చైతన్య, శ్రీవాణి కీలక పాత్రలను పోషించారు.

Narne Nithiin Starrer AAY Movie 10 Days Official Box Office Collections

నితిన్ మూవీకి బిజినెస్ ఇలా

పల్లెటూరి నేపథ్యంతో కూడిన హాస్యంతో రూపొందిన చిత్రమే 'ఆయ్'. ఈ మూవీ నుంచి వచ్చిన ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడంతో దీనిపై అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే ఈ క్రేజీ సినిమాను ప్రమోషన్ కూడా చేశారు. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలూ కలుపుకుని ఈ సినిమా రూ. 3.25 కోట్లు మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది.

Narne Nithiin Starrer AAY Movie 10 Days Official Box Office Collections

9 రోజుల్లోనే అన్ని కోట్ల రచ్చ
కంచిపల్లి అంజిబాబు దర్శకత్వంలో నార్నే నితిన్ నటించిన 'ఆయ్' సినిమాకు ఆరంభంలోనే పాజిటివ్ టాక్ వచ్చింది. అందుకు తగ్గట్లుగానే ఇది మొదటి రోజు నుంచీ ప్రేక్షకుల స్పందనను సొంతం చేసుకుంటోంది. తద్వారా భారీ వసూళ్లను సాధిస్తోంది. ఫలితంగా ఈ సినిమాకు తొమ్మిది రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 5.40 కోట్లు షేర్, రూ. 10.10 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

10వ రోజు తెలుగులో భారీగానే

ఎన్టీఆర్ బావమరిది హీరోగా చేసిన 'ఆయ్' సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ఆదరణ బాగానే వస్తోంది. అయితే, వీక్ డేస్‌లో మాత్రం తగ్గిపోతోంది. కానీ, 10వ రోజు స్పందన మరింతగా పెరిగిపోయింది. ఫలితంగా ఈ సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 45 లక్షలు షేర్ వసూలు చేసింది. అలాగే, వరల్డ్ వైడ్‌గా అన్ని ఏరియాలు కలిపి రూ. 50 లక్షలు షేర్ రాబట్టింది.

Narne Nithiin Starrer AAY Movie 10 Days Official Box Office Collections

10 రోజులకు కలిపి ఎంతంటే
కంచిపల్లి అంజిబాబు - నార్నే నితిన్ కాంబినేషన్‌లో రూపొందిన 'ఆయ్' సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా భారీ రెస్పాన్స్ వస్తోంది. భారీ బడ్జెట్ చిత్రాల నుంచి పోటీ ఉండడంతో తక్కువ థియేటర్లలోనే ఇది విడుదలైంది. కానీ, తర్వాత స్క్రీన్లు పెంచుకుని సత్తా చాటుతోంది. ఇలా ఈ చిత్రం 10 రోజుల్లోనే రూ. 5.90 కోట్లు షేర్, రూ. 11.00 కోట్లు గ్రాస్ మైలురాయిని కూడా దాటేసింది.

Narne Nithiin Starrer AAY Movie 10 Days Official Box Office Collections

టార్గెట్‌ ఔట్.. లాభం ఇలా

నార్నే నితిన్ హీరోగా నటించిన 'ఆయ్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలిపి రూ. 3.25 కోట్ల బిజినెస్ జరుపుకున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అంటే రూ. 3.50 కోట్లు షేర్ వస్తేనే ఈ సినిమా హిట్ స్టేటస్‌ను అందుకుంటుంది. అలాంటిది 10 రోజుల్లో దీనికి రూ. 5.90 కోట్లు షేర్ వచ్చింది. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 2.40 కోట్లు లాభాలతో రికార్డు కొట్టింది.

More from Filmibeat

Read more about: aay narne nithiin aay collection
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X