AAY 12 Days Collections: ఆయ్ డబుల్ రికార్డు.. 12 రోజుల్లో ఊహించని వసూళ్లు.. లాభం ఎన్ని కోట్లంటే!

టాలీవుడ్‌లో రూరల్ బ్యాగ్‌డ్రాప్‌తో పాటు క్యాస్ట్ సిస్టమ్ మీద ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. అలాంటివి ప్రతి ఒక్కరిపై ప్రభావాన్ని చూపుతుంటాయి. అందుకే ఈ తరహా మూవీలకు మంచి స్పందన లభిస్తుంటుంది. అలా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రమే 'ఆయ్'. నార్నే నితిన్ హీరోగా నటించిన ఈ సినిమాకు ఆరంభంలోనే పాజిటివ్ టాక్ రావడంతో, ఆడియెన్స్ నుంచి రెస్పాన్స్ కూడా భారీ స్థాయిలో లభిస్తోంది. దీంతో వసూళ్లు అదిరిపోయేలా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నార్నే నితిన్ 'ఆయ్' సినిమా 12 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందో మీరే చూడండి!

ఫన్ ఎంటర్‌టైనర్‌గా ఆయ్
నార్నే నితిన్ హీరోగా నటించిన ఫన్ ఎంటర్‌టైనర్ సినిమానే 'ఆయ్'. కంచిపల్లి అంజిబాబు తెరకెక్కించిన ఈ సినిమాను జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్, విద్య కప్పినీది నిర్మించారు. దీనికి రామ్ మిరియాల మ్యూజిక్ అందించాడు. ఇందులో నయన్ సారిక హీరోయిన్‌గా నటించగా.. అంకిత్ కొయ్య, కృష్ణ చైతన్య, శ్రీవాణి కీలక పాత్రలు చేశారు.

Narne Nithiin Starrer AAY Movie 12 Days Official Box Office Collections

నితిన్ మూవీకి బిజినెస్ ఇలా

గోదావరి జిల్లాల నేపథ్యంతో క్రేజీ ఫన్‌తో రూపొందిన చిత్రమే 'ఆయ్'. ఈ మూవీ నుంచి వచ్చిన ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడంతో దీనిపై అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే ఈ క్రేజీ సినిమాను ప్రమోషన్ కూడా చేశారు. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలూ కలుపుకుని ఈ సినిమా రూ. 3.25 కోట్లు మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకుంది.

11 రోజుల్లోనే అన్ని కోట్ల రచ్చ
కంచిపల్లి అంజిబాబు రూపకల్పనలో నార్నే నితిన్ హీరోగా నటించిన 'ఆయ్' సినిమాకు ఆరంభంలోనే పాజిటివ్ టాక్ దక్కింది. దీంతో ఇది మొదటి రోజు నుంచీ ప్రేక్షకుల స్పందనను బాగా అందుకుంటోంది. తద్వారా భారీ వసూళ్లను సాధిస్తోంది. ఫలితంగా ఈ సినిమాకు 11 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 6.70 కోట్లు షేర్, రూ. 12.40 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

Narne Nithiin Starrer AAY Movie 12 Days Official Box Office Collections

12వ రోజు తెలుగులో భారీగానే

ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా నటించిన 'ఆయ్' సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ఆదరణ బాగానే వస్తోంది. అయితే, వీక్ డేస్‌లో మాత్రం తగ్గిపోతోంది. కానీ, 12వ రోజు స్పందన బాగా వచ్చింది. ఫలితంగా ఈ సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 60 లక్షలు షేర్ వసూలు చేసింది. అలాగే, వరల్డ్ వైడ్‌గా రూ. 65 లక్షలు షేర్ రాబట్టుకుంది.

12 రోజులకు కలిపి ఎంతంటే
కంచిపల్లి అంజిబాబు - నార్నే నితిన్ కలయికలో తెరకెక్కిన 'ఆయ్' సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా భారీ రెస్పాన్స్ వస్తోంది. భారీ బడ్జెట్ చిత్రాల నుంచి పోటీ ఉండడంతో తక్కువ థియేటర్లలోనే ఇది విడుదలైంది. అయినా ఏమాత్రం తగ్గకుండా భారీ వసూళ్లను అందుకుంటోంది. ఇలా ఈ చిత్రం 12 రోజుల్లోనే రూ. 7.35 కోట్లు షేర్, రూ. 13.20 కోట్లు గ్రాస్‌ను కలెక్ట్ చేసుకుంది.

Narne Nithiin Starrer AAY Movie 12 Days Official Box Office Collections

టార్గెట్‌ ఔట్.. లాభం ఇలా

'ఆయ్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలిపి రూ. 3.25 కోట్ల బిజినెస్ జరుపుకున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అంటే రూ. 3.50 కోట్లు షేర్ వస్తేనే ఈ సినిమా హిట్ స్టేటస్‌ను అందుకుంటుంది. అలాంటిది 12 రోజుల్లో దీనికి రూ. 7.35 కోట్లు షేర్ వచ్చింది. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 3.85 కోట్లు లాభాలతో డబుల్ బ్లాక్ బస్టర్ అయింది.

More from Filmibeat

Read more about: aay narne nithiin aay collection
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X