AAY 14 Days Collections: ఆయ్ డబుల్ రికార్డు.. 14 రోజుల్లో ఊహించని వసూళ్లు.. లాభం ఎన్ని కోట్లంటే!

తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంతో మంది యంగ్ గాయ్స్ హీరోలుగా వస్తున్నారు. కానీ, అందులో చాలా అంటే చాలా తక్కువ మంది మాత్రమే ఆరంభంలోనే హిట్లను అందుకుంటున్నారు. అలాంటి వారిలో ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ ఒకడు. అంతలా ఇతగాడు ఫస్ట్ మూవీతోనే హిట్ కొట్టి సత్తా చాటాడు. ఈ క్రమంలోనే ఇటీవలే 'ఆయ్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి భారీ రెస్పాన్స్ కూడా లభిస్తోంది. ఫలితంగా వసూళ్లు అత్యధికంగా లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నార్నే నితిన్ 'ఆయ్' సినిమా 14 రోజుల్లో ఎంత రాబట్టిందో మీరే చూడండి!

క్రేజీ కామెడీతో వచ్చిన ఆయ్
నార్నే నితిన్ హీరోగా నటించిన క్రేజీ కామెడీ మూవీనే 'ఆయ్'. కంచిపల్లి అంజిబాబు తెరకెక్కించిన ఈ సినిమాను జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్, విద్య కప్పినీది నిర్మించారు. దీనికి రామ్ మిరియాల మ్యూజిక్ అందించాడు. ఇందులో నయన్ సారిక హీరోయిన్‌గా నటించగా.. అంకిత్ కొయ్య, కృష్ణ చైతన్య, శ్రీవాణి కీలక పాత్రల్లో నటించారు.

Narne Nithiin Starrer AAY Movie 14 Days Official Box Office Collections

ఆయ్ మూవీకి బిజినెస్ ఇలా

పల్లెటూరి నేపథ్యంతో ఫన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రమే 'ఆయ్'. ఈ మూవీ నుంచి వచ్చిన ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడంతో దీనిపై అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే ఈ క్రేజీ సినిమాను ప్రమోషన్ కూడా చేశారు. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలూ కలుపుకుని ఈ సినిమా రూ. 3.25 కోట్లు మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది.

Narne Nithiin Starrer AAY Movie 14 Days Official Box Office Collections

13 రోజుల్లోనే అన్ని కోట్ల రచ్చ
కంచిపల్లి అంజిబాబు దర్శకత్వంలో నార్నే నితిన్ హీరోగా నటించిన 'ఆయ్' సినిమాకు ఆరంభంలోనే పాజిటివ్ టాక్ దక్కింది. దీంతో ఇది మొదటి రోజు నుంచీ ప్రేక్షకుల స్పందనను బాగా సొంతం చేసుకుంటోంది. తద్వారా భారీ వసూళ్లను సాధిస్తోంది. ఫలితంగా ఈ సినిమాకు 13 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 7.28 కోట్లు షేర్, రూ. 15.10 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

Narne Nithiin Starrer AAY Movie 14 Days Official Box Office Collections

14వ రోజు తెలుగులో భారీగానే

ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా చేసిన 'ఆయ్' సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ఆదరణ బాగానే వస్తోంది. అయితే, వీక్ డేస్‌లో మాత్రం తగ్గిపోతోంది. కానీ, 14వ రోజు స్పందన కాస్త తగ్గిపోయింది. ఫలితంగా ఈ సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 20 లక్షలు షేర్ వసూలు చేసింది. అలాగే, వరల్డ్ వైడ్‌గా రూ. 25 లక్షలు షేర్ రాబట్టుకుంది.

Narne Nithiin Starrer AAY Movie 14 Days Official Box Office Collections

14 రోజులకు కలిపి ఎంతంటే
కంచిపల్లి అంజిబాబు - నార్నే నితిన్ కాంబినేషన్‌లో రూపొందిన 'ఆయ్' సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా భారీ రెస్పాన్స్ వస్తోంది. తక్కువ థియేటర్లలోనే ఇది విడుదలైనప్పటికీ ఏమాత్రం తగ్గకుండా భారీ వసూళ్లను అందుకుంటోంది. ఇలా ఈ చిత్రం 14 రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా అన్ని ఏరియాలూ కలిపి రూ. 7.53 కోట్లు షేర్, రూ. 15.50 కోట్లు గ్రాస్‌ను కలెక్ట్ చేసుకుంది.

Narne Nithiin Starrer AAY Movie 14 Days Official Box Office Collections

టార్గెట్‌ ఔట్.. లాభం ఇలా

'ఆయ్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలిపి రూ. 3.25 కోట్ల బిజినెస్ జరుపుకున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అంటే రూ. 3.50 కోట్లు షేర్ వస్తేనే ఈ సినిమా హిట్ స్టేటస్‌ను అందుకుంటుంది. అలాంటిది 14 రోజుల్లో దీనికి రూ. 7.53 కోట్లు షేర్ వచ్చింది. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 4.03 కోట్లు లాభాలతో డబుల్ బ్లాక్ బస్టర్‌గా సత్తా చాటుకుంది.

More from Filmibeat

Read more about: aay narne nithiin aay collection
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X