AAY 2 Days Collections: దంచికొట్టిన ఎన్టీఆర్ బావమరిది.. 2 రోజుల్లోనే ఊహకందని వసూళ్లు
టాలీవుడ్‌లోని చాలా మంది స్టార్ హీరోలు తమ ఫ్యామిలీల నుంచి హీరోలను పరిచయం చేస్తున్నారు. అలా ఇప్పటికే ఎంతో మంది వచ్చి సత్తా చాటుతున్నారు. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్. మొదటి చిత్రంతోనే హిట్ కొట్టిన అతడు.. ఇప్పుడు 'ఆయ్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమాకు టాక్‌తో పాటు రెస్పాన్స్ కూడా బాగానే లభిస్తోంది. దీంతో కలెక్షన్లు ఊహించని విధంగా వస్తున్నాయి. మరి 'ఆయ్' సినిమా రెండు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందో మీరే చూడండి!
ఆయ్ అంటూ వచ్చిన నితిన్
నార్నే నితిన్ హీరోగా నటించిన సినిమానే 'ఆయ్'. కంచిపల్లి అంజిబాబు తెరకెక్కించిన ఈ సినిమాను జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్, విద్య కప్పినీది నిర్మించారు. ఇందులో నయన్ సారిక హీరోయిన్‌గా నటించగా.. అంకిత్ కొయ్య, కృష్ణ చైతన్య, శ్రీవాణి తదితరులు కీలక పాత్రలను చేశారు. ఈ మూవీకి రామ్ మిరియాల సంగీతాన్ని అందించాడు.

నితిన్ మూవీకి బిజినెస్ ఇలా
రూరల్ బ్యాగ్‌డ్రాప్‌లో ఫన్ ఎలిమెంట్లతో రూపొందిన సినిమానే 'ఆయ్'. ఈ మూవీ నుంచి వచ్చిన ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడంతో దీనిపై అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే ఈ క్రేజీ సినిమాను ప్రమోషన్ కూడా చేశారు. ఫలితంగా వరల్డ్ వైడ్‌గా అన్ని ఏరియాలూ కలుపుకుని ఈ సినిమా రూ. 3.20 కోట్లు మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకుంది.

అలాంటి టాక్.. తొలి రోజునే
కడుపుబ్బా నవ్వించే కామెడీ స్టోరీతో రూపొందిన 'ఆయ్' సినిమాకు ఆరంభంలోనే పాజిటివ్ టాక్ వచ్చింది. ఫలితంగా ఈ సినిమాకు మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా మంచి స్పందన లభించింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 55 లక్షలు షేర్ వసూలు చేసింది. వరల్డ్ వైడ్‌గా ఇంకో పది లక్షలు కలుపుకుని రూ. 65 లక్షలు షేర్‌ను, 1.20 కోట్లు గ్రాస్ రాబట్టింది.
2వ రోజు ఇలా.. మొత్తంగా
ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా నటించిన 'ఆయ్' సినిమాకు టాక్‌కు అనుగుణంగానే రెండో రోజు స్పందన మరింతగా పెరిగిపోయింది. ఫలితంగా ఈ సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 65 లక్షలు షేర్ వసూలు చేసింది. వరల్డ్ వైడ్‌గా రూ. 75 లక్షలు రాబట్టింది. ఇలా రెండు రోజుల్లోనే ఈ చిత్రం రూ. 1.40 కోట్లు షేర్ రాబట్టి సత్తా చాటుకుంది.

టార్గెట్‌కు ఎంత రావాలి?
నార్నే నితిన్ హీరోగా నటించిన 'ఆయ్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలిపి రూ. 3.20 కోట్ల బిజినెస్ జరుపుకున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అంటే రూ. 3.50 కోట్లు షేర్ వస్తేనే ఈ సినిమా హిట్ స్టేటస్‌ను అందుకుంటుంది. అలాంటిది 2 రోజుల్లో దీనికి రూ. 1.40 కోట్లు షేర్ వచ్చింది. అంటే హిట్ స్టేటస్‌ను చేరాలంటే ఇంకా రూ. 2.10 కోట్లు రాబట్టాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











