AAY 3 Days Collections: ఆయ్ మూవీకి కోట్ల వసూళ్లు.. ఎన్టీఆర్ బావమరిది కుమ్ముడు.. 3 రోజుల్లోనే అంతా!

తెలుగు సినిమా పరిశ్రమలోకి ఎంతో మంది హీరోలుగా పరిచయం అవుతున్నారు. అయితే, అందులో కొందరు మాత్రమే స్టార్ల ఫ్యామిలీల నుంచి వస్తున్నారు. అలా ఇటీవలే వచ్చిన వారిలో నార్నే నితిన్ ఒకడు. జూనియర్ ఎన్టీఆర్ బావమరిది అయిన అతడు 'మ్యాడ్' చిత్రంతో పరిచయమై హిట్ కొట్టాడు. ఈ ఊపులోనే ఇప్పుడు 'ఆయ్' అనే ఫన్ ఎంటర్‌టైనర్‌ మూవీతో వచ్చాడు. దీనికి అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తోంది. ఫలితంగా వసూళ్లు భారీ స్థాయిలోనే లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నార్నే నితిన్ 'ఆయ్' సినిమా మూడు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందో మీరే చూడండి!

ఆయ్ మూవీతో వచ్చిన నితిన్
నార్నే నితిన్ హీరోగా నటించిన చిత్రమే 'ఆయ్'. కంచిపల్లి అంజిబాబు తెరకెక్కించిన ఈ సినిమాను జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్, విద్య కప్పినీది నిర్మించారు. ఇందులో నయన్ సారిక హీరోయిన్‌గా నటించగా.. అంకిత్ కొయ్య, కృష్ణ చైతన్య, శ్రీవాణి తదితరులు కీలక పాత్రలను చేశారు. ఈ మూవీకి రామ్ మిరియాల మ్యూజిక్ ఇచ్చాడు.

Narne Nithiin Starrer AAY Movie 3 Days Official Box Office Collections

నితిన్ మూవీకి బిజినెస్ ఇలా
పల్లెటూరి నేపథ్యంతో ఫన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన సినిమానే 'ఆయ్'. ఈ మూవీ నుంచి వచ్చిన ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడంతో దీనిపై అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే ఈ క్రేజీ సినిమాను ప్రమోషన్ కూడా చేశారు. ఫలితంగా వరల్డ్ వైడ్‌గా అన్ని ఏరియాలూ కలుపుకుని ఈ సినిమా రూ. 3.25 కోట్లు మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది.

రెండు రోజుల్లోనే అన్ని కోట్లు
పొట్టచెక్కలయ్యేలా నవ్వించే కామెడీ కథతో రూపొందిన 'ఆయ్' సినిమాకు ఆరంభంలోనే పాజిటివ్ టాక్ వచ్చింది. ఫలితంగా ఈ సినిమాకు మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా మంచి స్పందన లభించింది. రెండో రోజు రెస్పాన్స్ రెట్టింపు అయిపోయింది. ఫలితంగా ఈ సినిమాకు మొదటి రెండు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 1.72 కోట్లు షేర్, రూ. 3.25 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

Narne Nithiin Starrer AAY Movie 3 Days Official Box Office Collections

3వ రోజు తెలుగులో భారీగానే
జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా నటించిన 'ఆయ్' సినిమాకు టాక్‌కు అనుగుణంగానే మూడో రోజు స్పందన మరింతగా పెరిగింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం అదిరిపోయే రెస్పాన్స్‌తో సత్తా చాటుకుంది. ఫలితంగా ఈ సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 1.05 కోట్లు షేర్ వసూలు చేసింది. వరల్డ్ వైడ్‌గా రూ. 1.10 కోట్లు రాబట్టింది.

3 రోజులకు కలిపి ఎంతంటే
కంచిపల్లి అంజిబాబు దర్శకత్వంలో నార్నే నితిన్ హీరోగా నటించిన 'ఆయ్' సినిమాకు వరల్డ్ వైడ్‌గా భారీ స్పందన దక్కుతోంది. మరో మూడు పెద్ద సినిమాల నుంచి పోటీ ఉండడంతో తక్కువ థియేటర్లలోనే ఇది విడుదలైంది. అయినా చక్కని ప్రదర్శన చేస్తోంది. ఫలితంగా ఈ చిత్రం మూడు రోజుల్లోనే రూ. 2.82 కోట్లు షేర్, రూ. 5.30 కోట్లు గ్రాస్ వసూలు చేసింది.

Narne Nithiin Starrer AAY Movie 3 Days Official Box Office Collections

నార్నే నితిన్ హీరోగా నటించిన 'ఆయ్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలిపి రూ. 3.25 కోట్ల బిజినెస్ జరుపుకున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అంటే రూ. 3.50 కోట్లు షేర్ వస్తేనే ఈ సినిమా హిట్ స్టేటస్‌ను అందుకుంటుంది. అలాంటిది 3 రోజుల్లో దీనికి రూ. 2.82 కోట్లు షేర్ వచ్చింది. అంటే హిట్ స్టేటస్‌ను చేరాలంటే ఇంకా రూ. 68 లక్షలే రాబట్టాల్సి ఉంది.

More from Filmibeat

Read more about: aay narne nithiin aay collection
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X