AAY 4 Days Collections: చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్ బావమరిది.. 4 రోజుల్లోనే టార్గెట్ ఔట్.. లాభం ఎంతంటే!
ఒకప్పుడు సినిమాల పరంగా ప్రయోగాలు చేయడానికి పెద్దగా ఎవరూ సాహసించేవారు కాదు. కానీ, ఇప్పుడు ప్రేక్షకుల అభిరుచిలో మార్పులు వస్తుండడంతో కొత్త కొత్త కాన్సెప్టులతో వస్తున్నారు. ముఖ్యంగా పల్లెటూరి నేపథ్యంతో ఎన్నో చిత్రాలు వస్తున్నాయి. అలా ఇప్పుడు రూపొందిన మూవీనే 'ఆయ్'. ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా నటించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలైంది. దీనికి ఆడియెన్స్ అదిరిపోయే రెస్పాన్స్ ఇవ్వడంతో కలెక్షన్లు పోటెత్తుతున్నాయి. మరి 'ఆయ్' సినిమా నాలుగు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందో మీరే చూడండి!
'ఆయ్' ఎన్టీఆర్ బావమరిది
నార్నే నితిన్ హీరోగా నటించిన తాజా సినిమానే 'ఆయ్'. కంచిపల్లి అంజిబాబు తెరకెక్కించిన ఈ సినిమాను జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్, విద్య కప్పినీది నిర్మించారు. ఈ మూవీకి రామ్ మిరియాల మ్యూజిక్ ఇచ్చాడు. ఇందులో నయన్ సారిక హీరోయిన్‌గా నటించగా.. అంకిత్ కొయ్య, కృష్ణ చైతన్య, శ్రీవాణి తదితరులు కీలక పాత్రలను చేశారు.

నితిన్ మూవీకి బిజినెస్ ఇలా
గోదావరి జిల్లా నేపథ్యంతో ఫన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన సినిమానే 'ఆయ్'. ఈ మూవీ నుంచి వచ్చిన ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడంతో దీనిపై అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే ఈ క్రేజీ సినిమాను ప్రమోషన్ కూడా చేశారు. ఫలితంగా వరల్డ్ వైడ్‌గా అన్ని ఏరియాలూ కలుపుకుని ఈ సినిమా రూ. 3.25 కోట్లు మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకుంది.
మూడు రోజుల్లోనే అన్ని కోట్లు
కడుపుబ్బా నవ్వించే కామెడీ కథతో తెరకెక్కిన 'ఆయ్' సినిమాకు ఆరంభంలోనే పాజిటివ్ టాక్ లభించింది. అయినా ఈ సినిమాకు మొదటి రోజు మోస్తరు స్పందన వచ్చింది. కానీ, రెండో రోజు నుంచి ఇది భారీగా పుంజుకుంటూ దూసుకుపోతోంది. ఫలితంగా ఈ సినిమాకు మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 2.70 కోట్లు షేర్, రూ. 4.75 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

4వ రోజు తెలుగులో భారీగానే
యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా చేసిన 'ఆయ్' సినిమాకు ప్రేక్షకుల ఆదరణ అంతకంతకూ పెరుగుతూనే ఉంటోంది. ఇలా 4వ రోజు స్పందన మరింతగా పెరిగింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రాణించింది. ఫలితంగా ఈ సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 1.00 కోట్లు షేర్ వసూలు చేసింది. వరల్డ్ వైడ్‌గా రూ. 1.10 కోట్లు రాబట్టింది.
4 రోజులకు కలిపి ఎంతంటే
కంచిపల్లి అంజిబాబు దర్శకత్వంలో నార్నే నితిన్ హీరోగా చేసిన 'ఆయ్' సినిమాకు వరల్డ్ వైడ్‌గా భారీ రెస్పాన్స్ దక్కుతోంది. పెద్ద పెద్ద హీరోల సినిమాల నుంచి పోటీ ఉండడంతో తక్కువ థియేటర్లలోనే ఇది విడుదలైంది. అయినా అదిరిపోయే ప్రదర్శన చేస్తోంది. ఫలితంగా ఈ చిత్రం నాలుగు రోజుల్లోనే రూ. 3.80 కోట్లు షేర్, రూ. 7.20 కోట్లు గ్రాస్ వసూలు చేసింది.

టార్గెట్ ఔట్.. లాభం ఇలా
నార్నే నితిన్ హీరోగా నటించిన 'ఆయ్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలిపి రూ. 3.25 కోట్ల బిజినెస్ జరుపుకున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అంటే రూ. 3.50 కోట్లు షేర్ వస్తేనే ఈ సినిమా హిట్ స్టేటస్‌ను అందుకుంటుంది. అలాంటిది 4 రోజుల్లో దీనికి రూ. 3.80 కోట్లు షేర్ వచ్చింది. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 30 లక్షలు లాభాలు కూడా వచ్చాయి. ఇక, వరుసగా రెండు హిట్లను అందుకుని నార్నే నితిన్ సరికొత్త రికార్డును నమోదు చేసుకున్నాడు.


Click it and Unblock the Notifications











