AAY 5 Days Collections: ఎన్టీఆర్ బావమరిది మరో రికార్డ్.. 5 రోజుల్లోనే కోట్ల వర్షం.. లాభం ఎంతో తెలిస్తే!
తెలుగు సినిమా పరిశ్రమలోకి ఎంతో మంది హీరోలుగా పరిచయం అవుతున్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే ఆరంభంలోనే హిట్లు సాధించి సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ ఒకడు. 'మ్యాడ్' సినిమాతో హీరోగా మంచి ఆరంభాన్ని అందుకున్న అతడు.. ఇప్పుడు 'ఆయ్' అనే మూవీని చేశాడు. దీనికి ఆరంభం నుంచీ అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తోంది. ఫలితంగా భారీ స్థాయిలో వసూళ్లను సాధిస్తూ దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో నార్నే నితిన్ 'ఆయ్' సినిమా నాలుగు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందో మీరే చూడండి!
గోదావరి కామెడీతో 'ఆయ్'
నార్నే నితిన్ హీరోగా నటించిన ఫన్ సినిమానే 'ఆయ్'. కంచిపల్లి అంజిబాబు తెరకెక్కించిన ఈ సినిమాను జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్, విద్య కప్పినీది నిర్మించారు. ఇందులో నయన్ సారిక హీరోయిన్‌గా నటించగా.. అంకిత్ కొయ్య, కృష్ణ చైతన్య, శ్రీవాణి తదితరులు కీలక పాత్రలను చేశారు. ఈ మూవీకి రామ్ మిరియాల మ్యూజిక్ ఇచ్చాడు.

నితిన్ మూవీకి బిజినెస్ ఇలా
కడుపుబ్బా నవ్వించే ఫన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన సినిమానే 'ఆయ్'. ఈ మూవీ నుంచి వచ్చిన ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడంతో దీనిపై అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే ఈ క్రేజీ సినిమాను ప్రమోషన్ కూడా చేశారు. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలూ కలుపుకుని ఈ సినిమా రూ. 3.25 కోట్లు మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది.
4 రోజుల్లోనే అన్ని కోట్ల రచ్చ
గోదావరి ప్రాంత నేపథ్యంతో ఫన్ జోనర్‌లో వచ్చిన 'ఆయ్' సినిమాకు ఆరంభంలోనే పాజిటివ్ టాక్ లభించింది. అయినా ఈ సినిమాకు మొదటి రోజు మోస్తరు స్పందన వచ్చింది. కానీ, రెండో రోజు నుంచి ఇది భారీగా వసూళ్లను రాబడుతూ దూసుకుపోతోంది. ఫలితంగా ఈ సినిమాకు నాలుగు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 3.90 కోట్లు షేర్, రూ. 6.95 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

5వ రోజు తెలుగులో భారీగానే
నార్నే నితిన్ హీరోగా చేసిన 'ఆయ్' సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ఆదరణ అంతకంతకూ పెరుగుతూనే ఉంటోంది. కానీ, 5వ రోజు మాత్రం స్పందన కాస్త తగ్గిపోయింది. ఫలితంగా ఈ సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 60 లక్షలు షేర్ వసూలు చేసింది. అలాగే, వరల్డ్ వైడ్‌గా అన్ని ఏరియాల వసూళ్లను కలుపుకుని రూ. 65 లక్షలు షేర్ రాబట్టింది.
5 రోజులకు కలిపి ఎంతంటే
కంచిపల్లి అంజిబాబు రూపకల్పనలో నార్నే నితిన్ హీరోగా చేసిన 'ఆయ్' సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా భారీ రెస్పాన్స్ దక్కుతోంది. పెద్ద పెద్ద హీరోల సినిమాల నుంచి పోటీ ఉండడంతో తక్కువ థియేటర్లలోనే ఇది విడుదలైనా వాటిని మించేలా వసూళ్లు రాబడుతోంది. ఇలా ఈ చిత్రం ఐదు రోజుల్లోనే రూ. 4.58 కోట్లు షేర్, రూ. 8.10 కోట్లు గ్రాస్ వసూలు చేసి సత్తా చాటింది.

టార్గెట్ ఔట్.. లాభం ఇలా
నార్నే నితిన్ హీరోగా నటించిన 'ఆయ్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలిపి రూ. 3.25 కోట్ల బిజినెస్ జరుపుకున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అంటే రూ. 3.50 కోట్లు షేర్ వస్తేనే ఈ సినిమా హిట్ స్టేటస్‌ను అందుకుంటుంది. అలాంటిది 5 రోజుల్లో దీనికి రూ. 4.58 కోట్లు షేర్ వచ్చింది. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 1.08 కోట్లు లాభాలతో రికార్డు కొట్టింది.


Click it and Unblock the Notifications











