AAY 7 Days Collections: 3.50 కోట్ల ఆయ్.. వారంలో ఊహకందని వసూళ్లు.. ఎన్టీఆర్ బావమరిది లాభం ఎంతంటే!
టాలీవుడ్‌లోకి స్టార్ల ఫ్యామిలీల నుంచి ఎంతో మంది కుర్రాళ్లు హీరోలుగా వచ్చారు. అయితే, అలా ఎంటరైన వారిలో కొందరు మాత్రమే ఆరంభంలోనే హిట్లను అందుకుని సత్తా చాటారు. అందులో జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ ఒకడు. 'మ్యాడ్'తో గ్రాండ్ ఎంట్రీని అందుకున్న అతడు.. ఇప్పుడు 'ఆయ్' అనే క్రేజీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీకి ఆరంభం నుంచీ అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. దీంతో వసూళ్లు కూడా భారీ స్థాయిలో లభిస్తున్నాయి. మరి నార్నే నితిన్ 'ఆయ్' సినిమా 7 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందో మీరే చూడండి!
'ఆయ్' అంటూ వచ్చాడు
నార్నే నితిన్ హీరోగా చేసిన ఎంటర్‌టైనర్ మూవీనే 'ఆయ్'. కంచిపల్లి అంజిబాబు తెరకెక్కించిన ఈ సినిమాను జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్, విద్య కప్పినీది నిర్మించారు. ఇందులో నయన్ సారిక హీరోయిన్‌గా నటించగా.. అంకిత్ కొయ్య, కృష్ణ చైతన్య, శ్రీవాణి తదితరులు కీలక పాత్రలను చేశారు. దీనికి రామ్ మిరియాల మ్యూజిక్ అందించాడు.

నితిన్ మూవీకి బిజినెస్ ఇలా
గోదావరి ప్రాంతం నేపథ్యంతో కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రమే 'ఆయ్'. ఈ మూవీ నుంచి వచ్చిన ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడంతో దీనిపై అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే ఈ క్రేజీ సినిమాను ప్రమోషన్ కూడా చేశారు. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలూ కలుపుకుని ఈ సినిమా రూ. 3.25 కోట్లు మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకుంది.
6 రోజుల్లోనే అన్ని కోట్ల రచ్చ
కడుపుబ్బా నవ్వించే కామెడీతో తెరకెక్కిన 'ఆయ్' సినిమాకు ఆరంభంలోనే పాజిటివ్ టాక్ లభించింది. అయినా ఈ సినిమాకు మొదటి రోజు మోస్తరు స్పందన వచ్చింది. కానీ, రెండో రోజు నుంచి ఇది అదిరిపోయే వసూళ్లతో దూసుకుపోతోంది. ఫలితంగా ఈ సినిమాకు ఆరు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 4.62 కోట్లు షేర్, రూ. 8.05 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

7వ రోజు తెలుగులో భారీగానే
నార్నే నితిన్ హీరోగా చేసిన 'ఆయ్' సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ఆదరణ అంతకంతకూ పెరుగుతూ వచ్చింది. కానీ, 7వ రోజు మాత్రం స్పందన మరింతగా తగ్గిపోయింది. ఫలితంగా ఈ సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 20 లక్షలు షేర్ వసూలు చేసింది. అలాగే, వరల్డ్ వైడ్‌గా అన్ని ఏరియాల వసూళ్లను కలుపుకుని రూ. 25 లక్షలు షేర్ రాబట్టింది.

7 రోజులకు కలిపి ఎంతంటే
కంచిపల్లి అంజిబాబు దర్శకత్వంలో నార్నే నితిన్ హీరోగా చేసిన 'ఆయ్' సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా భారీ రెస్పాన్స్ దక్కుతోంది. పెద్ద పెద్ద హీరోల సినిమాల నుంచి పోటీ ఉండడంతో తక్కువ థియేటర్లలోనే ఇది విడుదలైనా వాటిని మించేలా దూసుకుపోతోంది. ఇలా ఈ చిత్రం ఏడు రోజుల్లోనే రూ. 4.87 కోట్లు షేర్, రూ. 9.10 కోట్లు గ్రాస్ వసూలు చేసి సత్తా చాటింది.

టార్గెట్ ఔట్.. లాభం ఇలా
నార్నే నితిన్ హీరోగా నటించిన 'ఆయ్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలిపి రూ. 3.25 కోట్ల బిజినెస్ జరుపుకున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అంటే రూ. 3.50 కోట్లు షేర్ వస్తేనే ఈ సినిమా హిట్ స్టేటస్‌ను అందుకుంటుంది. అలాంటిది 7 రోజుల్లో దీనికి రూ. 4.87 కోట్లు షేర్ వచ్చింది. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 1.37 కోట్లు లాభాలతో రికార్డు కొట్టింది.


Click it and Unblock the Notifications











