AAY 8 Days Collections: ఎన్టీఆర్ బావమరిది మరో గ్రేట్ రికార్డు.. అల్లు అల్లున్ బ్రదర్‌కు లాభం ఎంతంటే!

తెలుగు చిత్ర పరిశ్రమలో పల్లెటూరి నేపథ్యంతో పాటు కామెడీతో రూపొందే సినిమాల సంఖ్య ఇప్పుడు గణనీయంగా పెరుగుతోంది. ఇప్పుడు ఇలాంటి చిత్రాలే మరింతగా వస్తున్నాయి. అలా ఇటీవలే విడుదలైన స్పెషల్ మూవీనే 'ఆయ్'. ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా నటించిన ఈ చిత్రం ఫన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ మూవీ వసూళ్లను రాబడుతూ దూసుకుపోతోంది. మరి నార్నే నితిన్ 'ఆయ్' సినిమా 8 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందో మీరే లుక్కేయండి!

'ఆయ్'తో నార్నే నితిన్ రాక
నార్నే నితిన్ హీరోగా చేసిన ఫీల్ గుడ్ కామెడీ మూవీనే 'ఆయ్'. కంచిపల్లి అంజిబాబు తెరకెక్కించిన ఈ సినిమాను జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్, విద్య కప్పినీది నిర్మించారు. దీనికి రామ్ మిరియాల మ్యూజిక్ అందించాడు. ఇందులో నయన్ సారిక హీరోయిన్‌గా నటించగా.. అంకిత్ కొయ్య, కృష్ణ చైతన్య, శ్రీవాణి తదితరులు కీలక పాత్రలను చేశారు.

Narne Nithiin Starrer AAY Movie 8 Days Official Box Office Collections

నితిన్ మూవీకి బిజినెస్ ఇలా

పల్లెటూరిలో ఉండే పరిస్థితులకు అద్దం పట్టే కథతో రూపొందిన చిత్రమే 'ఆయ్'. ఈ మూవీ నుంచి వచ్చిన ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడంతో దీనిపై అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే ఈ క్రేజీ సినిమాను ప్రమోషన్ కూడా చేశారు. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలూ కలుపుకుని ఈ సినిమా రూ. 3.25 కోట్లు మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది.

7 రోజుల్లోనే అన్ని కోట్ల రచ్చ
గోదావరి ఎటకారంతో కూడిన కామెడీతో తెరకెక్కిన 'ఆయ్' సినిమాకు ఆరంభంలోనే పాజిటివ్ టాక్ వచ్చింది. అయినా ఈ సినిమాకు మొదటి రోజు కాస్త తక్కువ స్పందన వచ్చింది. కానీ, రెండో రోజు నుంచి ఇది అన్ని సినిమాలనూ దాటుకుంటూ వెళ్తోంది. ఫలితంగా ఈ సినిమాకు వారం రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 4.86 కోట్లు షేర్, రూ. 8.55 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

Narne Nithiin Starrer AAY Movie 8 Days Official Box Office Collections

8వ రోజు తెలుగులో భారీగానే

నార్నే నితిన్ హీరోగా నటించిన 'ఆయ్' సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ఆదరణ బాగానే లభిస్తోంది. అయితే, వీక్ డేస్‌లో కాస్త డౌన్ అవుతోంది. ఇలా 8వ రోజు స్పందన మరింతగా తగ్గింది. ఫలితంగా ఈ సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 18 లక్షలు షేర్ వసూలు చేసింది. అలాగే, వరల్డ్ వైడ్‌గా అన్ని ఏరియాలు కలుపుకుని రూ. 20 లక్షలు షేర్ రాబట్టింది.

8 రోజులకు కలిపి ఎంతంటే
కంచిపల్లి అంజిబాబు డైరెక్షన్‌లో నార్నే నితిన్ హీరోగా చేసిన 'ఆయ్' సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా భారీ రెస్పాన్స్ దక్కుతోంది. రెండు భారీ కమర్షియల్ సినిమాల నుంచి పోటీ ఉండడంతో తక్కువ థియేటర్లలోనే ఇది విడుదలైంది. అయినా వాటిని మించేలా దూసుకుపోతోంది. ఇలా ఈ చిత్రం 8 రోజుల్లోనే రూ. 5.06 కోట్లు షేర్, రూ. 9.00 కోట్లు గ్రాస్ వసూలు చేసి సత్తా చాటింది.

Narne Nithiin Starrer AAY Movie 8 Days Official Box Office Collections

టార్గెట్‌ ఔట్.. లాభం ఇలా

నార్నే నితిన్ హీరోగా నటించిన 'ఆయ్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలిపి రూ. 3.25 కోట్ల బిజినెస్ జరుపుకున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అంటే రూ. 3.50 కోట్లు షేర్ వస్తేనే ఈ సినిమా హిట్ స్టేటస్‌ను అందుకుంటుంది. అలాంటిది 8 రోజుల్లో దీనికి రూ. 5.06 కోట్లు షేర్ వచ్చింది. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 1.56 కోట్లు లాభాలతో రికార్డు కొట్టింది. ఇక, ఈ చిత్రం ఇప్పుడు 5 కోట్లు షేర్ మార్క్ దాటి సత్తా చాటగా.. అల్లు అర్జున్ బ్రదర్ లాంటి బన్నీ వాసుకు రూ. 1.50 కోట్లకు పైగా లాభాలు దక్కాయి.

More from Filmibeat

Read more about: aay narne nithiin aay collection
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X