AAY 9 Days Collections: కుమ్మేసిన నార్నే నితిన్ .. 9 రోజుల్లో రికార్డు వసూళ్లు.. లాభం ఎంతో తెలిస్తే!

టాలీవుడ్‌కు చెందిన ఎంతో మంది ప్రముఖులు తమ కుటుంబాల నుంచి హీరోలను పరిచయం చేశారు. అలా వచ్చిన వారిలో అతి తక్కువ మంది మాత్రమే ఆరంభంలోనే హిట్లను అందుకున్నారు. అందులో ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ ఒకడు. 'మ్యాడ్' గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన అతడు.. ఇప్పుడు 'ఆయ్' అనే సినిమాను చేశాడు. క్రేజీ కాన్సెప్టుతో వచ్చిన ఈ సినిమాకు అదిరిపోయే స్పందన లభిస్తోంది. ఫలితంగా వసూళ్లు భారీ స్థాయిలోనే వస్తున్నాయి. మరి నార్నే నితిన్ 'ఆయ్' సినిమా 9 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందో మీరే చూసేయండి!

'ఆయ్' అంటూ ఎంటర్
నార్నే నితిన్ హీరోగా నటించిన కామెడీ సినిమానే 'ఆయ్'. కంచిపల్లి అంజిబాబు తెరకెక్కించిన ఈ సినిమాను జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్, విద్య కప్పినీది నిర్మించారు. దీనికి రామ్ మిరియాల మ్యూజిక్ అందించాడు. ఇందులో నయన్ సారిక హీరోయిన్‌గా నటించగా.. అంకిత్ కొయ్య, కృష్ణ చైతన్య, శ్రీవాణి తదితరులు నటించారు.

Narne Nithiin Starrer AAY Movie 9 Days Official Box Office Collections

నితిన్ మూవీకి బిజినెస్ ఇలా

గోదావరి జిల్లాల యాసతో కూడిన కామెడీతో రూపొందిన చిత్రమే 'ఆయ్'. ఈ మూవీ నుంచి వచ్చిన ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడంతో దీనిపై అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే ఈ క్రేజీ సినిమాను ప్రమోషన్ కూడా చేశారు. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలూ కలుపుకుని ఈ సినిమా రూ. 3.25 కోట్లు మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకుంది.

8 రోజుల్లోనే అన్ని కోట్ల రచ్చ
డిఫరెంట్ కామెడీతో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'ఆయ్' సినిమాకు ఆరంభంలోనే పాజిటివ్ టాక్ వచ్చింది. అయినా ఈ సినిమాకు మొదటి రోజు మామూలు స్పందనే వచ్చింది. కానీ, రెండో రోజు నుంచి ఇది భారీ రెస్పాన్స్‌తో దూసుకుపోతోంది. ఫలితంగా ఈ సినిమాకు ఎనిమిది రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 5.07 కోట్లు షేర్, రూ. 9.65 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

Narne Nithiin Starrer AAY Movie 9 Days Official Box Office Collections

9వ రోజు తెలుగులో భారీగానే

ఎన్టీఆర్ బావమరిది నటించిన 'ఆయ్' సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ఆదరణ బాగానే వస్తోంది. అయితే, వీక్ డేస్‌లో మాత్రం తగ్గిపోతోంది. ఇలా 9వ రోజు స్పందన మరింతగా తగ్గిపోయింది. ఫలితంగా ఈ సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 18 లక్షలు షేర్ వసూలు చేసింది. అలాగే, వరల్డ్ వైడ్‌గా అన్ని ఏరియాలు కలిపి రూ. 20 లక్షలు షేర్ రాబట్టింది.

9 రోజులకు కలిపి ఎంతంటే
కంచిపల్లి అంజిబాబు దర్శకత్వంలో నార్నే నితిన్ హీరోగా చేసిన 'ఆయ్' సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా భారీ రెస్పాన్స్ వస్తోంది. రెండు పెద్ద హీరోల సినిమాల నుంచి పోటీ ఉండడంతో తక్కువ థియేటర్లలోనే ఇది విడుదలైంది. కానీ, తర్వాత స్క్రీన్లు పెంచుకుని దూసుకుపోతోంది. ఇలా ఈ చిత్రం 9 రోజుల్లోనే రూ. 5.27 కోట్లు షేర్, రూ. 10.10 కోట్లు గ్రాస్ మైలురాయిని కూడా దాటేసింది.

Narne Nithiin Starrer AAY Movie 9 Days Official Box Office Collections

టార్గెట్‌ ఔట్.. లాభం ఇలా

నార్నే నితిన్ హీరోగా చేసిన 'ఆయ్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలిపి రూ. 3.25 కోట్ల బిజినెస్ జరుపుకున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అంటే రూ. 3.50 కోట్లు షేర్ వస్తేనే ఈ సినిమా హిట్ స్టేటస్‌ను అందుకుంటుంది. అలాంటిది 9 రోజుల్లో దీనికి రూ. 5.27 కోట్లు షేర్ వచ్చింది. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 1.77 కోట్లు లాభాల కూడా సాధించింది.

More from Filmibeat

Read more about: aay narne nithiin aay collection
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X